సెలవులు ఇవే... Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
సెలవులు ఇవే...
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అమలు
ఉద్యోగికి చట్టబద్ధ హక్కు
 
11-01-2018: ఉద్యోగికి విధి నిర్వహణ, వ్యక్తిగత జీవితం రెండూ ముఖ్యమే. ఉద్యోగంతో పాటు వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు తగినంత సమయం కేటాయించాల్సిందే. అందుకోసమే ఉద్యోగులకు సెలవుల విధానం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అమలౌతోంది. ఈ సెలవులు వివిధ రకాలుగా ఉంటాయి. ఆ వివరాలు..
వారాంతపు సెలవు: వారంలో ఏడు రోజులకు గాను ఒకటి లేదా రెండు రోజులు సెలవు ఇస్తుంటారు. కంపెనీ పాలసీని బట్టి ఇకటా రెండా అన్నది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం ఒక్క రోజే సెలవుగా ఉంటుంది.
పండుగ దినాలు: వివిధ మతాలకు సంబంధించి ముఖ్యమైన పండుగ రోజుల్లోనూ సెలవులు ఉంటాయి.
ఎర్న్‌డ్‌ లీవ్‌ లేదా ప్రివిలేజ్‌ లీవ్‌(ఈఎల్‌): ప్రతీ ఉద్యోగికీ ఏడాదిలో ఇన్ని రోజులంటూ ఈఎల్స్‌ ఉంటాయి. గడచిన ఏడాదిలో ఎన్ని పనిదినాల పాటు సదరు ఉద్యోగి పని చేశాడన్న దానిపై ఆధారఫడి ఈ సెలవులు ఉంటాయి. ఈఎల్స్‌ను వాడుకోనివారు అదనపు వేతనాన్ని పొందవచ్చు. సెలవు తీసుకుంటే సాధారణ వేతనం (మూలవేతనం ప్రకారం) యథావిధిగా వస్తుంది. అయితే సెలవులే తీసుకోవాలా? లేక పని చేసి వేతనాన్ని పొందాలా? అన్నది కంపెనీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
క్యాజువల్‌ లీవ్స్‌: నెలలో ఇన్ని రోజుల పాటు క్యాజువల్‌ లీవ్‌ అని ఇస్తుంటారు. గరిష్ఠంగా మూడు రోజుల వరకు ఉంటుంది. కొన్ని సంస్థల్లో నెలకు ఒక్కటే క్యాజువల్‌ లీవ్‌ కూడా అప్లయ్‌ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1988 ప్రకారం ఏడాదిలో 12 రోజుల పాటు ఈ లీవ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. సిక్‌లీవ్‌ లేదా మెడికల్‌ లీవ్‌: కార్యాలయానికి రాలేనివిధంగా అనారోగ్యానికి గురైన పరిస్థితులలో వాడుకునేందుకు వీలుగా ఈ సెలవు పెట్టవచ్చు. తక్కువలో తక్కువ నెలకు ఒక్క రోజైనా సిక్‌ లీవ్‌ ఉంటుంది. ఒక నెలలో వాడుకోకపోతే అవసరం ఏర్పడినప్పుడు ఒకటికి మించి వాడుకోవచ్చు. ఎన్ని రోజుల సెలవులుగా ఇవ్వాలన్న విషయాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1988 ప్రకారం ఏడాదిలో 12 రోజుల వరకు సిక్‌లీవ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.
కాంపెన్సేటరీ ఆఫ్‌/ సీఆఫ్‌: సెలవు రోజుల్లో కూడా వచ్చి పని చేసినట్టయితే అందుకు గాను వేతనం చెల్లిస్తారు. లేదా మరో రోజు సెలవు కింద ఇస్తారు.
మెటర్నిటీ లీవ్‌ (ప్రసూతి సెలవులు): మహిళా ఉద్యోగులు సంతాన అవసరాల కోసం(గర్భధారణ నుంచి ప్రసవం, తదనంతరం మరికొంత కాలం) మెటర్నిటీ లీవ్‌ను ఇస్తుంటారు. ఎంత కాలం అన్నది కంపెనీలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని ప్రైవేటు కంపెనీలలో వేతనం లేకుండా ఈ లీవ్‌ను మంజూరు చేస్తుంటారు. గర్భస్రావం అయిన వారికి కూడా ఈ లీవ్‌ ఇస్తుంటారు. కాకపోతే తక్కువ రోజుల పాటు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1988 ప్రకారం ప్రసవానికి ముందు కనీసం ఆరు వారాలు, ఆ తర్వాత కనీసంఆరు వారాలు సెలవు ఇవ్వాలి.
పెటర్నిటీ లీవ్‌: మెటర్నిటీ లీవ్‌ తరహాలో ఉద్యోగి భార్య ప్రసవించిన సందర్భాల్లో వారి అవసరాలు చూసునేందుకు వీలుగా కొన్ని రోజుల పాటు ఉద్యోగులకు ఈ సెలవు ఇస్తుంటారు.
క్వారంటైన్‌ లీవ్‌: ఇన్ఫెక్షన్‌ ఆధారిత వ్యాధికిలోనై ఆ వ్యాధి కంపెనీలోని ఉద్యోగులకు కూడా వచ్చే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో సదరు ఉద్యోగిని ఈ సెలవుపై పంపిస్తారు.
హాఫ్‌ పే లీవ్‌: ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ లీవ్‌ అందుబాటులో ఉంది. ఏడాది కాలం సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సెలవు పెట్టుకునే వెసులుబాటు ఉంది. విధులకు రాకపోయినా ప్రతి రోజూ వేతనంలో సగం మేర చెల్లిస్తారు.
జాతీయ సెలవు దినాలు
గణతంత్ర దినోత్సవం (జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబరు 2) దేశంలోని ఉద్యోగులందరికీ వర్తించే సాధారణ సెలవు దినాలు. వీటిని జాతీయ సెలవుదినాలుగా గుర్తిస్తారు. ఏడాదిలో కనీసం ఏడు రోజులను జాతీయ సెలవు, పర్వదినాల కింద ఇవ్వాలని చెబుతున్నాయి. వాటిలో గణతంత్ర దినం, స్వాతంత్య్రదినం, గాంధీ జయంతి తప్పనిసరిగా ఇవ్వాల్సినవి.