జాబ్ ఇంటర్వ్యూ అని చెప్పి ఏం చేశాడంటే... Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
జాబ్ ఇంటర్వ్యూ అని చెప్పి ఏం చేశాడంటే...
12-01-2018 చెన్నై: ఉద్యోగాన్వేషణలో ఉన్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. డాక్టర్‌నంటూ ఓ వ్యక్తి ఆమెను ఫోన్‌లో వేధించాడు. అశ్లీలంగా మాట్లాడాడు. తనకు ఎదురైన పరిస్థితి ఇతరులకు రాకూడదని ఆమె కోరుకుంటోంది.
 
చెన్నై నివాసి నమియా బెయిద్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం ఆమె ఫ్రెంచ్ భాషలో ప్రావీణ్యం సంపాదించారు. ఆతిథ్య రంగంలో ఉన్న ఓ ఫ్రెండ్‌ సహాయంతో ఏదైనా ఉద్యోగం సంపాదించాలనుకున్నారు. ఆమెకు ఉద్యోగం దొరకాలన్న ఉద్దేశంతో ఆ ఫ్రెండ్ ఆమె ఫోన్ నంబరును వాట్సాప్ గ్రూప్స్‌లో పెట్టారు. ఆ ఫోన్ నెంబరును ఓ దుర్మార్గుడు గుర్తించాడు. తాను డాక్టర్‌నంటూ నమియాకు ఫోన్ చేశాడు. తాను ఉద్యోగం ఇస్తానంటూ మాటలు కలిపాడు. ఇంటర్వ్యూ ఐదు రౌండ్లలో జరుగుతుందని చెప్పి, వేర్వేరు వ్యక్తులు మాట్లాడినట్లుగా నటించాడు. జనవరి 2న నమియాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ఎయిర్ ఫ్రాన్స్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్‌గా పర్మినెంట్ ఉద్యోగం ఇస్తానని చెప్పాడు.
 
నమియా తనకు నెలకు రూ.45 వేలు జీతం కావాలని అడిగారు. అందుకు ఆ వ్యక్తి సమాధానమిస్తూ నెలకు రూ.70 వేలు జీతం ఉంటుందని చెప్పాడు. దీంతో నమియాకు అనుమానం వచ్చింది. తనను సరిగా ఇంటర్వ్యూ చేయకుండానే అడిగిన జీతం కన్నా ఎక్కువ మొత్తం ఇస్తానని ఎలా చెప్పగలుగుతున్నాడని మనసులో అనుకున్నారు. వెంటనే ఆమె ఆ కాల్‌ను రికార్డు చేయడం ప్రారంభించారు. ఐదు రౌండ్లలో ఇంటర్వ్యూ జరుగుతుందని ఆ వ్యక్తి చెప్పాడు. మొదటి రౌండ్ తర్వాత మరొకరు ఫోన్ చేస్తారని చెప్పాడు. కానీ రెండోసారి కూడా అతనే ఫోన్ చేసి, వేరొక వ్యక్తిగా నటించాడు. ఫ్రెంచ్ సినిమాలు, వాటిలో సెక్స్ సీన్స్‌ మీద అభిప్రాయం అడిగాడు. వాటిపై అయిష్టత చూపిస్తావా? లేక ఇష్టపడతావా? అని అడిగాడు. ఇంకా ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసిన తర్వాత మూడో రౌండ్‌లో వీడియో కాల్ వస్తుందని చెప్పాడు.
 
మూడో రౌండ్ వీడియో కాల్‌ను వేరొక నంబరుతో చేశాడు. తాను డాక్టర్‌నని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి అంతకుముందు రెండు రౌండ్లలో మాట్లాడినవాడే మళ్ళీ మాట్లాడుతున్నాడని నమియా గుర్తించారు. ఫోన్‌లో పూర్తిగా కనిపించే విధంగా నిలబడాలని ఆ వ్యక్తి అడిగాడు. చేతులు ఎత్తి నిల్చోవాలని, పొట్ట చూపించాలని అడిగాడు. నమియా తన పొట్ట చూపించేందుకు తిరస్కరించింది. ఆ వ్యక్తి మళ్ళీ మాట్లాడుతూ బాడీ హగ్గింగ్ టీ-షర్ట్ వేసుకోమని చెప్పాడు. ఇంకా... ఇంకా అసహ్యంగా మాట్లాడాడు.
 
ఈ దుర్మార్గుడి గురించి తన ఫ్రెండ్ ద్వారా ఆరా తీశారు. చివరికి ఆ వ్యక్తి పేరు దీపక్ అని తెలిసింది. దీపక్ కేరళలో ఓ హోటల్‌లో మేనేజర్ అని, మరొక ఉద్యోగం కోసం వెతుకుతున్నాడని వెల్లడైంది. అతను వివాహితుడని కూడా తెలిసింది. జనవరి 3న నమియా ఈ దుర్మార్గుడిపై పోరాటానికి సిద్ధమయ్యారు. దీపక్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. మరింత దురహంకారం ప్రదర్శించాడు. ‘‘నువ్వు ఆడదానివని నిరూపించు’’ అన్నాడు.