అంగన్‌వాడీలకు హెల్త్‌ కార్డులివ్వాలి Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
అంగన్‌వాడీలకు హెల్త్‌ కార్డులివ్వాలి
స్త్రీ, శిశు సంక్షేమ, బీసీ సంక్షేమ కమిటీల సూచన
 
హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): తమకు కూడా హెల్త్‌ కార్డులు ఇవ్వాలని అంగన్‌వాడీ సిబ్బంది కోరుతున్నారని, వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు అసెంబ్లీ స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ సూచించింది. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం, పప్పు, కోడిగుడ్లు, పాలతో పాటు ఇతరత్రా సరుకుల పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. డిగ్రీ ప్రాతిపదికన కాకుండా పదో తరగతితోనే పదోన్నతులు కల్పించే అంశాన్ని పరిశీలించాలని, అంగన్‌వాడీలకు సెలవులు ఇచ్చే విషయమై కాస్త వెసులుబాటు కల్పించాలని సూచించింది. కమిటీ చైర్‌పర్సన్‌ రేఖానాయక్‌ అధ్యక్షతన కమిటీ గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైంది. కమిటీ సభ్యులు, సంబంధిత శాఖాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా, మేర, దర్జీ కులస్తుల వృత్తిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ సూచించింది. గురుకులాలు, కల్యాణలక్ష్మి, ఓవర్సీస్‌ విద్యానిధి పథకాల అమలుపై కమిటీ గురువారం సమీక్ష నిర్వహించింది.