ఓయూ ఆర్ట్స్‌ కాలేజీకి 50 కంప్యూటర్లు విరాళం Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఓయూ ఆర్ట్స్‌ కాలేజీకి 50 కంప్యూటర్లు విరాళం
దాతృత్వం చాటుకున్న పూర్వ విద్యార్థి డాక్టర్‌ అజీజ్‌
 
ఉస్మానియా యూనివర్సిటీ/హైదరాబాద్‌, జనవరి 11: ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీకి 50 కంప్యూటర్లు విరాళంగా ఇచ్చేందుకు ఓయూ పూర్వ విద్యార్థి డాక్టర్‌ అజీజ్‌ అహ్మద్‌ జమాలుద్దీన్‌ ముందుకొచ్చారు. 2009లో ఓయూ ఆర్ట్స్‌ కాలేజీలో అధికారులు ఆయన పేరు మీదే కంప్యూటర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అమెరికాలో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డ ఆయన గురువారం ఆ కంప్యూటర్‌ సెంటర్‌ను తన కుటుంబ సభ్యులతో వచ్చి పరిశీలించారు. ఈ సెంటర్‌ ఏర్పాటుకు రూ.60లక్షలు విరాళాన్ని అజీజ్‌ అందించారు. కాగా, ఇక్కడ కంప్యూటర్లను ఉపయోగించుకుంటున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. 100 కంప్యూటర్ల సర్వీస్‌ అయిపోయినట్లు గుర్తించి వాటి స్థానంలో కొత్తగా 50 కంప్యూటర్లు ఏర్పాటు చేయడానికి విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఓయూ స్టూడెంట్‌ అఫైర్స్‌ డీన్‌ లక్ష్మీనారాయణ, ఓయూ పబ్లిక్‌ రిలేషన్స్‌ అడ్వైజర్‌ స్టీవెన్‌సన్‌, ఆర్ట్స్‌ కళాశాల వైస్‌ ప్రిన్స్‌పాల్‌ రాములు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఓయూ వీసీతో భేటీ అయిన అజీజ్‌..ఆర్ట్స్‌ కళాశాల మరమ్మతులకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎండోమెంట్‌ ఫండ్‌ను ఉపయోగించుకోవాలని కోరారు.