మెరుగవుదాం.. Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
మెరుగవుదాం..
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ముందస్తుగా జిల్లా విద్యాశాఖ ప్రణాళిక
విద్యార్థులకు 40 రోజుల పాటు ప్రత్యేక తరగతులు ప్రారంభం
ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు..
జీహెచ్‌ఎం, ఎంఈవోలకు సర్క్యులర్లు జారీ
గతేడాది 85.22 శాతం ఉత్తీర్ణత
 
మేడ్చల్‌జిల్లా: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. 2017-18 సంవత్సరంలో మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 85.22 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 84 శాతం మంది విద్యార్థత సాధిస్తే, జిల్లాలో 85.22 శాతం ఫలితాలు వచ్చాయి. జిల్లాలో మొట్టమొదటి సారి జరిగిన పరీక్ష్లల్లో జిల్లాకు 17వ స్థానం దక్కింది. ఈ సంవత్సరంలో జరిగే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. జిల్లాలో మొత్తం 511 ప్రభుత్వ పాఠశాలలకు గానూ 103 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేట్‌ పాఠశాలలు మొత్తం 1149 వరకు ఉండగా, వీటిలో 772 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 6,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. 100 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగానే పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాఽ ద్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులు, జీహెచ్‌ఎంలతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు.
 
ఈ సారి జరిగే పదోతరగతి పరీక్షల్లో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలపై పూర్తి అవగాహన కల్పించేం దుకు సర్కారు చర్యలు తీసుకుంటుంది. పదోతరగతి సిలబస్‌ను పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు జనవరి నుంచి పునశ్చరణ (రివిజన్‌) తరగతులు నిర్వహించేం దుకు ప్రణాళికను రపొందించారు. పరీక్ష ఫలితాల్లో ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులతో పోలిస్తే...ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా జీపీఏను సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేట్‌కు ధీటుగా రాణించేందుకు సర్కారు అడుగులు వేస్తోంది. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ముందస్తుగా ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు.
 
పరీక్షలపై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు 40రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభమ య్యాయి. విద్యార్థులకు ఉదయం 8నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటలవరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎంఈఓలు, జీహెచ్‌ఎంలకు ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం గంటపాటు పాఠాలు భోదించి, ఆ తర్వాత రివిజన్‌ చేయించి, సాయంత్రం స్లిప్‌టెస్ట్‌లను నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా స్లిప్‌ టెస్టులను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సబ్జెక్టుల్లో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా తరగతులను భోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అఽధ్యాపకులు ప్రతివిద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి, ఎంఈవోలు రోజుకో ఉన్నతపాఠశాలను సందర్శించి, సబ్జెక్టుల రివ్యూను పరిశీలించనున్నారు. సర్కారుబడుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది.
 
మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి
పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు లక్ష్యం గా కార్యచరణ ప్రణాళికను రూపొందించా మని జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి ‘ఆంధ్రజ్యోతి‘తో వెల్లడిం చారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుల య్యేలా 40 రోజుల కార్యాచరణ ప్రణాళి కను రూపొందించినట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభ మైనట్టు వెల్లడించారు. ఈ సంవత్సరంలో జరిగే పదోతరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిం చేందుకు కృషి చేస్తున్నామని, గెజిటడ్‌ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో సమీక్ష సమావేశాలు నిర్వహిం చామని తెలిపారు. సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్టు వెల్లడించారు. గత సంవత్సరం తక్కువ శాతం ఫలితాలు వచ్చిన పాఠశాలలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలిపారు. పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించేం దుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
- జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి