హైదరాబాద్‌లో శనివారం ఉద్యోగ మేళా Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
హైదరాబాద్‌లో శనివారం ఉద్యోగ మేళా
నల్లకుంట, హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానంద 155వ జయంతి సందర్భంగా ప్రతియేటా నిర్వహించే జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈనెల 13న బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్రంలోని యువతకు ఉచిత ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు శరత్‌చంద్ర సాంస్కృతిక, సామాజిక సేవా ట్రస్ట్‌ సంస్థ అధ్యక్షుడు శరత్‌చంద్ర, కార్యదర్శి డి.ఎ్‌స.రమ్య వెల్లడించారు. గురువారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా నిరుద్యోగ సమస్య నిర్మూలనతో పేదవారిని గుర్తించి వారి జీవన విధానానికి సరైన ఉద్యోగాన్ని కల్పించాలనే లక్ష్యంతో తమ సంస్థ కృషిచేస్తోందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగులకు వారి విద్యార్హత ప్రకారం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న పలు కంపెనీల సహకారంతో అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలు ఉచితంగా కల్పించడానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎ్‌ససీ, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా ఫెయిల్‌ అయిన తర్వాత చదువుకోడానికి వెళ్లలేని పేదవారికి తమ సంస్థ ఈ అవకాశాన్ని కల్పిస్తోందని తెలిపారు. ఆసక్తి గల వారు తమ పాఠశాల, కళాశాలలో విద్యకు సంబంధించిన సర్టిఫికెట్స్‌, ఆధార్‌ కార్డు ఇతరత్ర వాటితో హాజరుకావాలని కోరారు. వివరాలకు ఫోన్‌ నెం. 8897226495, 6281493541ను సంప్రదించాలని కోరారు.