ఐటీ వెలవెల.. 23% పడిపోయిన నియామకాలు.. Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఐటీ వెలవెల.. 23% పడిపోయిన నియామకాలు..
టైర్‌2, టైర్‌3 పట్టణాల్లో 38శాతం మాత్రమే
విజ్డమ్‌జాబ్స్‌.కాం అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు పడిపోయాయి. టైర్‌1 నగరాల్లో 75% మాత్రమే ప్లేస్‌మెంట్లు జరుగుతుంటే.. టైర్‌2, టైర్‌3 నగరాల్లో ఇవి 38శాతం మాత్రమే. ఐటీ సర్వీసుల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు 23% పడిపోతే.. కోర్‌ ఇంజనీరింగ్‌లో ఇది 26% ఉంది. ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ పోర్టల్‌ ‘విజ్డమ్‌ జాబ్స్‌.కాం’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణెల్లోని 120 కంపెనీలు, 50 విద్యా సంస్థల్లో ఇది సర్వే చేసింది. ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ప్లేస్‌మెంట్లు కొద్దిగా పెరిగినా, పట్టణాల్లోని కాలేజీల్లో మాత్రం సగానికి సగం పడిపోయాయి. గత రెండేళ్లుగా టైర్‌2, టైర్‌3 విద్యా సంస్థల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు 21% తగ్గితే, క్యాంప్‌సలకు కంపెనీల రాక 30% పడిపోయింది. అదే సమయంలో, కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌, డాటా సైన్స్‌, రోబోటిక్స్‌, ఆగ్‌మెంటెడ్‌, వర్చ్యువల్‌ రియాలిటీ తదితరాలకు పెద్దపీట వేస్తున్నాయి. అవి చదివిన విద్యార్థుకు 35-40% అధికంగా చెల్లించడానికి చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, అనలిటికల్‌ స్కిల్స్‌ లేకపోవడం విద్యార్థులకు సమస్యగా మారింది. టైర్‌1 నగరాల్లో కేవలం 19శాతం ఇంజనీరింగ్‌ పట్టభద్రులు మాత్రమే కొలువులు సాధిస్తుంటే, మిగిలిన పట్టణాల్లో అది 14శాతం మాత్రమే. క్యాంపస్‌ సెలక్షన్లలో 2014-15లో 78, 2015-16లో 79శాతం మందికి ఉద్యోగాలు వస్తే 2016-17లో అది కాస్తా 66శాతానికి  పడిపోయింది.