2018లో ప్రభుత్వ సెలవులు Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
2018లో ప్రభుత్వ సెలవులు
2018 క్యాలెండర్‌ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవుల వివరాలను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్‌ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెం.2457, తేదీ: 24-11-2017 ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకా రం 2018లో మొత్తం 28 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో వేతనంతో కూడిన సెలవు(నెగోషియేబుల్‌ ఇన్‌స్ర్టుమెంట్‌ యాక్ట్‌ )దినాలు 21 ఖరారు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
  • జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం సాధారణ సెలవుకు బదులుగా ఫిబ్రవరి 10వ తేదీ రెండో శనివారం పనిదినంగా పరిగణిస్తారు.
  • ఇవిగాక ఐచ్ఛిక సెలవు దినాల్లో ఐదింటిని ఉద్యోగులు వాడుకునేందుకు అనుమతించింది. దానికి ఆధీకృత ఉన్నతాధికారి నుంచి దరఖాస్తు అనుమతి తప్పనిసరి.
  • ఉత్తర్వుల్లోని సాధారణ సెలవు దినాలు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినవే. పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజా పనుల శాఖలు, విద్యా సంస్థలకు వర్తించవు. వాటికి సంబంధించిన శాఖలు ప్రత్యేకంగా సెలవుల జాబితాను విడుదల చేస్తాయి.
  • ఈదుల్‌ ఫితర్‌, ఈదుల్‌ జుహో, మొహర్రం, ఈద్‌ -ఈ-మిలాద్‌లో మా ర్పులు జరిగితే అం దుకు అనుగుణంగా సెలవు తేదీలు మారుతాయి. ఆదివారం, రెండో శనివారం సెలవు దినాలు.
  • నాలుగు సాధారణ సెలవులు ఆదివారం, రెండో శనివారం వచ్చాయి. ఐదు ఐచ్ఛి క సెలవులు కూడా అది వారం, రెండో శనివారం వచ్చాయి.
సాధారణ సెలవులు
సంక్రాంతి జనవరి 15, సోమవారం
రిపబ్లిక్‌ డే జనవరి 26, శుక్రవారం
మహా శివరాత్రి ఫిబ్రవరి 13, మంగళవారం
హోలీ మార్చి 1, గురువారం
శ్రీరామ నవమి మార్చి 26, సోమవారం
గుడ్‌ ఫ్రైడే మార్చి 30, శుక్రవారం
బాబు జగ్గీవన్‌రామ్‌ జయంతి ఏప్రిల్‌ 5, గురువారం
మేడే మే 1, మంగళవారం
రంజాన్‌ జూన్‌ 16, శనివారం
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15, బుధవారం
బక్రీద్‌ ఆగస్టు 22, బుధవారం
కృష్ణాష్టమి సెప్టెంబరు 3, సోమవారం
వినాయక చవితి సెప్టెంబరు 13, గురువారం
మోహర్రం సెప్టెంబరు 21, శుక్రవారం
దుర్గాష్టమి అక్టోబరు 17, బుధవారం
విజయదశమి అక్టోబరు 18, గురువారం
దీపావళి నవంబరు 7, బుధవారం
మిలాదున్‌ నబి నవంబరు 21, బుధవారం
కార్తీక పౌర్ణమి నవంబరు 23, శుక్రవారం
క్రిస్‌మస్‌ డిసెంబరు 25, మంగళవారం
 
ఆదివారం, రెండో శనివారం వచ్చిన సాధారణ సెలవులు
భోగి జనవరి 14
ఉగాది మార్చి 18
అంబేడ్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14
రంజాన్‌ తర్వాత రోజు జూన్‌ 17
 
ఐచ్ఛిక సెలవులు
జనవరి 16న కనుమ
22న శ్రీపంచమి
ఫిబ్రవరి 1న హాజ్రత్‌ సయ్యద్‌ మహ్మద్‌ జన్మదినం
మార్చి 29న మహావీర్‌ జయంతి
ఏప్రిల్‌ 1న హజ్రత్‌ అలీ జన్మదినం
15న షబ్‌ఏ మోరాజ్‌
18న బసవ జయంతి
29న బుద్ధ పూర్ణిమ
మే 2న షబ్‌ ఈ బరాత్‌
జూన్‌ 5న షాదత్‌ అలీ
12న షాబ్‌ ఏ ఖదీర్‌
15న జుమా అతుల్‌ వాదా
జులై 14న రథయాత్ర
ఆగస్టు17న పార్శీల నూతన సంవత్సరం
ఆగస్టు 24న వరలక్ష్మి వ్రతం
ఆగస్టు 26న రాఖీ పౌర్ణమి
ఆగస్టు 30న ఈద్‌ ఏ గదీ
సెప్టెంబరు 20 మొహర్రం
అక్టోబర్‌ 30న అరెబయిన్‌
నవంబరు 6న నరక చతుర్ధి
డిసెంబరు 19న యాజ్‌ దహూమ్‌ షరీఫ్‌
డిసెంబరు 24న క్రిస్మస్‌ ఈవ్‌
 
ఆదివారం, రెండో శనివారం వచ్చిన ఐచ్ఛిక సెలవులు
ఏప్రిల్‌ 1న హజ్రత్‌ అలీ జన్మదినం
ఏప్రిల్‌ 15న శబ్‌ ఏ మిరాజ్‌
ఏప్రిల్‌ 29న బుద్ధ పూర్ణిమ
జులై 14న రథయాత్ర
ఆగస్టు 24 రాఖీ పౌర్ణమి