ఫస్ట్‌ జాబ్‌..అనుభవం లేకున్నా ఉద్యోగం సాధ్యమే.. Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఫస్ట్‌ జాబ్‌..అనుభవం లేకున్నా ఉద్యోగం సాధ్యమే..
మీరు యువకులు. అనుభవం అస్సలు లేదు. అయినప్పటికీ ఉద్యోగం కావాలి. ఎలా? చదువు పూర్తికాగానే ఎంట్రీ స్థాయి జాబ్‌లోకి అడుగుపెట్టడమే క్లిషమైన అంశం. కొంత మంది ఫ్రెషర్స్‌కు ఇవ్వం అంటారు. మరికొందరు అనుభవం ఉందా అంటారు. అనుభవం లేకుండా ఉద్యోగం రాదు.... ఉద్యోగం లేకుండా అనుభవం రాదు... నిజానికి ఎవరూ ఉద్యోగం ఇవ్వకుండా అనుభవం ఎలా వస్తుంది? అలాఅని జాబ్‌ కోసం తక్కువ వేతనం ఉన్న ఉద్యోగంలో చేరగలరా? దీనిని అధిగమించడానికి ఉపయోగపడే కొన్ని టిప్స్‌....
 
నువ్వేం పొందగలవో తెలుసుకో
మీకు సూటయ్యే ఉద్యోగం ఏంటో తెలుసుకోండి. ఈ విషయంలో వాస్తవికంగా ఆలోచించండి. జాబ్‌ విషయంలో మీరు కిడ్‌. అయితే ఉద్యోగం కోసం అనుభవం ఉన్న వారితో కూడా పోటీ పడాల్సి వస్తుంది. అంత మాత్రాన భయపడాల్సినదేమీ లేదు. ఫస్ట్‌ జాబ్‌ విషయంలో మీ స్నేహితులు, బంధువుల నుంచి అవసరమైన సమాచారం పొందవచ్చు.
 
సన్నద్ధంగా ఉండాలి
జాబ్‌ సెర్చ్‌ ప్రక్రియకు సంబంధించిన సకల అంశాలను ప్రిపరేషన్‌కుముందే తెలుసుకోవాలి. Snagajob తరహా వెబ్‌సైట్‌లలో సంబంధిత ఆర్టికల్స్‌ చాలా ఉంటాయి. అందులో అన్ని ఏజ్‌ గ్రూప్‌లకు సంబంధించిన ఆర్టికల్స్‌ ఉంటాయి. ఇంటర్నెట్‌ అంటే సమాచార గని. జాబ్‌ వెతుకలాటతో మొదలుపెట్టి ఇంటర్వ్యూలు, ఉద్యోగం పొందాక ఎలా ఉండాలి వరకు అన్నీ లభిస్తాయి. ఆయా కంపెనీల వెబ్‌సైట్స్‌లో కూడా మంచి సమాచారం దొరుకుతుంది. సదరు కంపెనీ సంస్కృతి, బ్రాండ్‌, ఇంటర్వ్యూయర్‌కు ఎలా ఆసక్తి కలిగించాలి వంటివి అక్కడ చూడొచ్చు.
 
ఉద్యోగ వేటలో ఉన్నట్టు తెలియాలి
స్నేహితులు, బంధువులు, టీచర్లు మొదలైనవారి నుంచి రిఫరెన్స్‌లు చాలా వస్తాయి. అందుకే జాబ్‌ సెర్చ్‌లో ఉన్నట్టు అందరికీ తెలియజేయాలి. వారంతా పెద్ద రిసోర్స్‌లాగా పనిచేస్తారు. అలాగే ఎలాంటి పని చేయాలని కోరుకుంటున్నారో వారికి తెలియాలి. అదే సయమంలో ఆకాంక్షలకు అనుగుణ్యమైన జాబ్‌ కాదని, వచ్చిన అవకాశాలను విడిచిపెట్టవద్దు. అదే అవకాశం, మీరు అనుకున్న జాబ్‌ దరికి చేరేలా చేయవచ్చు కూడా.
 
అనుభవం కోసం పనిచేయి
కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న జాబ్‌ లభించకపోవచ్చు. అందువల్ల భవిష్యత్తులో కోరుకున్న జాబ్‌ కోసం సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సంబంధాలు నెరపాలి. ఉదాహరణకు క్లర్క్‌గా పొందే జాబ్‌లో ఎక్సైట్‌మెంట్‌ ఉండదు. అయితే అదే జాబ్‌ కోరుకున్న ఉద్యోగం పొందేందుకు సోపానం కావచ్చు. వాలంటీర్‌గా చేయాల్సి వచ్చినా నిరాకరించాల్సిన పనిలేదు. నీ రెజ్యూమెలో పొందుపరిచిన వాలంటీర్‌ అనుభవమే, కోరుకున్న జాబ్‌ ఇచ్చే ఎంప్లాయిర్‌కు నచ్చవచ్చు.
 
ఆప్షన్స్‌ అన్నింటినీ పరిగణించాలి
కలలుకంటున్న జాబ్‌కే ఎన్నడూ పరిమితం కావద్దు. అలాగే మొదట వచ్చిన జాబ్‌తో సంతోషపడాల్సిన అవసరమూ లేదు. మీ ఆలోచన పరిధిని విస్తృతపర్చుకోండి. సాధ్యమైనన్ని ఆప్షన్స్‌ పెట్టుకోండి. ఆసక్తులతో ఆరంభించి, అందుకు గల అవకాశాలపై ఆలోచించండి. జంతు సంరక్షణ మీ ఆసక్తి అయిన పక్షంలో జూ, యానిమల్‌ షెల్టర్‌, వెటర్నరీ కార్యాలయం వరకు అన్నీ మీ ఆప్షన్స్‌లో ఉండాలి. ఈ సందర్భంలో యజమానులు ఊళ్ళో లేనప్పుడు కుక్కల సంరక్షణ, పక్షులను చూసుకోవడం వంటి పనుల మాటేమన్నది కూడా మీ ఆప్షన్స్‌లో ఉండాలి. హోండాపై ఆసక్తి ఉంటే, ఆటో స్పేర్‌ పార్టుల ఆమ్మకం నుంచి ఆయిల్‌ ఛేంజ్‌, కార్స్‌ డీటెయిలింగ్‌ వరకు అన్నీ ఆప్షన్స్‌గానే చూడాలి. చివరగా అనుకున్న లేదంటే కోరుకున్న జాబ్‌ రానంత మాత్రాన సెర్చ్‌ను విస్మరించాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాల్లో సహనం చాలా అవసరం. అదేపనిగా సెర్చ్‌ చేస్తుంటే మీ ఆలోచనలకు తగ్గ పొటన్షియల్‌ ఎంప్లాయర్‌ దృష్టిలో మీరు పడవచ్చు. అనుకున్న జాబ్‌ పొందవచ్చు. నిరాశ ఎన్నటికీ పనికి రాదని గుర్తుంచుకోవాలి.