రెజ్యూమె.. ఈ తప్పులను ఇట్టే పట్టేస్తారు Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
రెజ్యూమె.. ఈ తప్పులను ఇట్టే పట్టేస్తారు
రెజ్యూమె... ఒక్క ముక్కలో చెప్పాలంటే, అభ్యర్థి పరిచయ పత్రం. ఉద్యోగానికి ఇది చాలా కీలకం. అయితే చాలామంది అభ్యర్థులు ఉద్యోగం కోసం పంపే రెజ్యూమెలో తమకు సంబంధించిన సమస్త సమాచారాన్ని గుప్పించాలని చూస్తారు. అది తప్పు. ఇందులో అధిక సమాచారం, అసంబద్ధ సమాచారం ఇవ్వకూడదు. ఇలాంటి వాటిని రిక్రూటర్‌ చిటికెలో కనిపెట్టి పక్కన పడేస్తారు. కొందరు రెండు మూడు భిన్న అంశాలను కలగలిపి రెజ్యూమె తయారు చేస్తుంటారు. దీని వల్ల క్లారిటీ లోపిస్తుంది. రెజ్యూమె తయారీలో ఏయే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఒక లుక్‌ వేయండి.
 
స్కిల్‌, టాలెంట్‌ కలపొద్దు
స్కిల్‌ (నైపుణ్యం), టాలెంట్‌ (తెలివితేటలు)ను ఎక్కువగా కలిపేసి చూస్తారు. నిజానికి ఈ రెండూ వేర్వేరు. ప్రత్యేకించి ఒక విషయంలో నేర్చుకున్నవి, తెలుసుకున్నవి స్కిల్స్‌ కింద కు వస్తాయి. ఐటికి సంబంధించి ఫలానా లాంగ్వేజ్‌ తెలుసు అని చెప్పడం స్కిల్‌ కిందకు వస్తుంది. అదే సంక్షిప్తంగా కోడ్‌ రాయగలను, ఆఫీస్‌ అపాయింట్‌మెంట్స్‌ విషయంలో సింపుల్‌ ప్రోగ్రామ్‌ ఇవ్వగలను అని తెలియజేయడాన్ని తెలివి తేటలుగా పరిగణించాలి. ఈ రెంటినీ కలిపేయ కూడదు. విషయం ఏదైనా తెలియ జేసేటప్పుడు పెద్ద పేరా గ్రాఫ్‌లు రాయకూడదు. అలా రాస్తే కొందరు రిక్రూటర్లు వాటిని పక్కన పెట్టేయవచ్చు కూడా.
 
అనుభవంలో అనుకోని గ్యాప్స్‌
అనుభవం గురించి రాసేటప్పుడు అంతా ఒక ఆర్డర్‌లో ఉండకపోవచ్చు. మధ్యలో ఖాళీ ఉండవచ్చు. ఆ బ్రేక్‌ ఎందుకు వచ్చిందో తెలియజేయాలి. అంతే తప్ప బ్లఫ్‌ చేయొద్దు. రెజ్యూమె చూడగానే చాలా వరకు రిక్రూటర్‌కు కారణాలు అర్థం అవుతాయి. అభ్యర్థి ఎంత నిజాయితీగా ఉన్నాడో తెలుసుకోవడం కోసం మాత్రమే కారణాలు అడుగుతుంటారు. నిజానికి కొంత మంది ఆ సమయంలో బ్రేక్‌ తీసుకుని ఎంట్రప్రెన్యూర్‌షిప్‌వైపు మళ్ళవచ్చు. హాబీల కోసం సమయం కేటాయించుకోవచ్చు. అదీ కాదంటే ఉన్నత చదువులను పూర్తి చేయవచ్చు. మహిళలైతే మెటర్నటీ బ్రేక్‌ తీసుకోవచ్చు. వీటిలో ఏదైనప్పటికీ అదే విషయాన్ని తెలియజేయడమే మంచిది.
 
అంకెల్లో తకరారు
ప్రొఫెషనల్‌ అప్రోచ్‌ చాలా అవసరం. మరీ ముఖ్యంగా అంకెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్‌ విడిచిపెట్టిన సంవత్సరం, జాయినింగ్‌ తేదీ అలాగే సాధించిన విజయాలను పొందుపర్చడంలో తప్పులు చోటు చేసుకోకూడదు. అందులో తప్పులు పడితే, మొత్తం రెజ్యూమె అనుమానాస్పదంగా తయారవుతుంది. వాస్తవాలతో అంకెలు కలవకుంటే ఇబ్బందికరమే.
 
అచీవ్‌మెంట్స్‌
సాధించిన విజయాలను వివరించడంలో కలగాపులగం చేయకూడదు. సాధించిన విజయం, అప్పట్లో పని చేసిన కంపెనీ పేరు స్పష్టంగా, ఒక క్రమంలో తెలియజేయాలి. అంతే తప్ప అన్నింటినీ కలిపేయకూడదు. సదరు అచీవ్‌ మెంట్‌తో కంపెనీకి కలిగిన ప్రయోజనాన్ని తెలియజేయాలి. మొత్తం వివరాలన్నీ అర్థమయ్యే విధంగా ఉండాలి.
 
సామాజిక మాధ్యమాల్లో
రిక్రూటర్లు మిమ్మల్ని కలుసుకోవడానికి ముందే మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అందువల్ల సోషల్‌ ప్రొఫైల్‌ సైట్స్‌ను తెలియజేయాలి. ప్రొఫెషనల్‌ కమ్యూనిటీస్‌ వివరాలు ఉండే సైట్ల పేర్లను రిఫర్‌ చేయడం మంచిది.
 
మంచి రిఫరెన్స్‌లు
రిఫరెన్స్‌ అంటే ఏదో తెలిసిన ఇద్దరు పేర్లు రాయడం కాదు. ఆ ఇద్దరూ మీ గురించి అడిగిన ప్రశ్నలకు వివరాలు చెప్పగలిగిన వాళ్ళయి ఉండాలి. మీ మీద నమ్మకం కలిగించగలగాలి. అందువల్ల మంచి వ్యక్తుల పేర్లను తెలియజేయాలి.
 
టెంప్లేట్‌ రెజ్యూమె
రిక్రూటర్‌కు మీ దరఖాస్తు ఒక్కటే కొత్త కాదు. ఒక వారంలో వందలాది రెజ్యూమెలను చూస్తూ ఉంటారు. అందువల్ల కొద్దిగా ఆకట్టుకునే విధంగా టెంప్లేట్లు ఉపయోగించడం మంచిది. అది విషయం తెలియ జేయడానికి సహాయపడాలి. అంతే గజిబిజి చేయకూడదు. వాటిని ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విషయం కంటికి ఇంపుగా తెలియజేసేలా, అవసరమైనంత మేరకే టెంప్లేట్స్‌ను ఉపయోగించడం శ్రేయస్కరం.