ఇంటర్వ్యూ ముందు ఈ ఆరూ చూసుకోండి Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఇంటర్వ్యూ ముందు ఈ ఆరూ చూసుకోండి
నాలుగు ప్రశ్నలకు సమాధానం రాసేస్తే లేదా చెప్పేస్తే ఉద్యోగం ఖాయం అన్న రోజులు కావివి. మార్పులు ఒకదాని వెంట మరొకటి త్వరితగతిన చోటు చేసుకుంటున్న విషయాన్ని గమ నించాలి. ఇది ఉద్యోగం/ ఇంటర్వ్యూకూ వర్తిస్తుంది. రెండు నెలల్లో ప్రస్తుత సంవత్సరం ముగియనుంది. కొత్త సంవత్సరంలో ఉద్యోగ ట్రెండ్‌ ఎలా ఉండనుందో, ఉద్యోగా ర్థులకు ఏయే లక్షణాలు అవసరం అవుతాయో ముందుగానే తెలుసుకుంటే అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండవచ్చు. వివిధ పరిశ్రమలకు చెందిన పలువురు నిపుణులను సంప్రదించిన మీదట పొందిన సమాచారం...
 
జాబ్‌ ఎంపిక ఎప్పటికీ నరాలకు ఉత్కంఠ కలిగించే అనుభవమే. జాబ్‌ కోసం ప్రయత్నం అంటేనే ఒత్తిడికి లోనవడం. ఈ నెర్వస్‌నెస్‌ను అధిగమించడమే అభ్యర్థి చేయాల్సిన తొలి పని అన్నది హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజర్లలో అత్యధికుల అభిప్రాయం. ఇంటర్వ్యూను సమ ర్థంగా ఎదుర్కొనేందుకు ఆరు విధానాలు అవసరం అని సంబం ధిత నిపుణులు సూచిస్తున్నారు. సరికొత్త పోకడలను కూడా దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనలు ఇవి.
 
కమ్యూనికేషన్‌ వ్యూహం: ఇంటర్వ్యూ అంటేనే అభ్యర్థి సామర్థ్యాలను గుర్తించే పని అంటున్నారు ‘కోర్సెరా’ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి. ఒకవేళ ఇంటర్వ్యూ గంట సేపు జరిగితే ఆ సమయంలో అడిగే ప్రశ్నలు అన్నింటికీ సమగ్రంగా సమాధానం ఇవ్వడం అన్నది ఏ అభ్యర్థికి సాధ్యం కాదు. అందువల్ల నాన్‌ వెర్బల్‌ కమ్యూనికేషన్‌ సామ ర్థ్యాన్ని తగ్గించి చూడవద్దు. అంటే కమ్యూని కేషన్‌ సంబంధిత వ్యూహం చాలా పకడ్బందీగా ఉండాలి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏమి అడుగుతు న్నారు, మనం ఏమి చెబుతున్నాం, సమాధానాన్ని మనం ఎలా వ్యక్తం చేస్తున్నాం లేదంటే చేయాలి అనే విషయాలపై పక్కా ప్రణాళికతో వ్యవహరించాలి.
 
సోషల్‌ మీడియా, జాబ్‌ పోర్ట్‌ల్స్‌ పరిశీలనలో చురుకుగా: సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్రభావం ఈ రోజుల్లో విపరీతంగా ఉంది. జాబ్‌ మార్కెట్‌లో నిలవాలంటే సంబంధిత అంశాల్లో చాల చురుకుగా వ్యవహరించాల్సిందే. పేరు ప్రతిష్ఠలు ఎక్కువగా ఉన్న సంస్థల్లో జాబ్‌ పొందాలంటే ఆ సామర్థ్యం తప్పనిసరి.
 
అవగాహనలో వెనుక ఉండొద్దు: ఒక పజిల్‌ను పూర్తి చేయలేనప్పుడు విషయం ఆసాంతం ఆర్థం కాదు. అంతా ముక్కలుముక్కలుగానే ఉంటుంది. ఇంటర్వ్యూ విషయానికి వస్తే, మనం వెళ్ళిన కంపెనీపై సమగ్ర అవగాహన లేకుంటే, అభ్యర్థి పరిస్థితి బలహీ నంగా ఉంటుంది. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయం లోనే కంపెనీకి తాను ఎలా ఫిట్‌ అన్నది అభ్యర్థి తెలియజేయాలి.
 
ఈ విషయం జవాబులో రావాలంటే, కంపెనీకి సంబంధించిన విషయాలు తెలిసి ఉండాలి. కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా అభ్యర్థి తన లక్ష్యాలు, విలువలు, నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయో వివరించాలి. అదే సమయంలో తన విధుల నిర్వరించే క్రమంలో భాగంగా కంపెనీ తన నుంచి ఏమి ఆశిస్తోందో తెలుసుకోవాలి. దీంతో జాబ్‌ విషయంలో అభ్యర్థి ఎంత సీరియస్‌గా ఉన్నారన్నది ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి అర్థమవుతుంది.
 
ఎవరి సీవీ వారికే: మన పరోక్షంలో మనల్ని కంపెనీ ముందు నిలిపేదే సీవీ. మొదట ఆ సీవీ ఆకట్టుకుం టేనే హైరింగ్‌ మేనేజర్‌ నుంచి పిలుపు అందుకోగలం. అందువల్ల దేనికదిగా కంపెనీని అనుసరించి సీవీని రూపొందించుకోవాలి. చిట్టిపొట్టి వాక్యాలతో ఇంత వరకు చేసిన పని తదితరాలన్నీ రాయాలి. సొంత విషయాలు మొదలుకుని ప్రతీది బుల్లెట్‌ పాయింట్స్‌తో రాయాలి. అబద్దాలకు తావుండరాదు.
 
మంచి ఇంప్రెషన్‌: ఇంటర్వ్యూలో గెలుపు అన్న విషయాన్ని పక్కన పెడితే, అభ్యర్థిగా మంచి ఇంప్రెషన్‌ ఇవ్వగలగాలి. సమయానికి ఇంటర్వ్యూ చేసే ప్రదేశానికి చేరుకోవడం, మంచి డ్రెస్సింగ్‌, ఐ కాంటాక్ట్‌, చెప్పే విషయంలో స్పష్టత, ఆత్మవిశ్వాసం, గతంలో సాధించిన విజయాల వివరణలో ఆచితూచి వ్యవహరించాలి. యావత్తు వ్యవహారాన్ని నడవడి అన్న పదబందంలో ఇముడ్చుకోవాలి.
 
ఫాలోఅప్‌: ఇదో కీలక అంశం. మీ నుంచి ఏమి ఆశిస్తోందో కంపెనీ నర్మగర్భంగా తెలియజేస్తుంది. ఆ మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోండి. తుది ఎంపికకు సంబంధించి మర్యాదగా ప్రశ్నించి తెలుసు కోండి. ఇంటర్వ్యూ అనంతరం ఫాలోఅప్‌ను అస్సలు మర్చిపోవద్దు. అవకాశం ఉందా అని అడగడం ద్వారా, మిమ్మల్ని తీసుకుంటే కంపెనీకి అదనంగా సమకూరే విలువే అన్నది అర్థమయ్యేలా ఈ ఫాలోఅప్‌ ఉండాలి.