స్కూల్‌లో అగ్నిప్రమాదం.. 25 మంది సజీవ దహనం Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
స్కూల్‌లో అగ్నిప్రమాదం.. 25 మంది సజీవ దహనం
14-09-2017: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో మంటలు రేగడంతో 25 మంది సజీవదహనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం తెల్లవారు జామున ఖురాన్ బోధించే బోర్డింగ్ పాఠశాల దారుల్ ఖురాన్ ఇత్తిఫాకియా‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు మలేసియా ఫైర్ అండ్ రెస్క్యూ విభాగం వెల్లడించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. డార్మిటరీ కిటికీలన్నిటికీ ఇనుపచువ్వలు పెట్టిఉండడం, బయటికి వెళ్లేందుకు కేవలం ఒకే మార్గం ఉండడంతో పిల్లలంతా లోపల చిక్కుబడిపోయినట్టు చెబుతున్నారు. దీంతో విపరీతమైన పొగతో శ్వాస ఆడక కొంతమంది, తొక్కిసలాట కారణంగా మరికొంతమంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానికులు పేర్కొన్నారు. మృతుల్లో 23 మంది విద్యార్దులు, ఇద్దరు టీచర్లు ఉన్నట్టు వెల్లడించింది. చనిపోయిన పిల్లలంతా 13 నుంచి 17 ఏళ్ల లోపువారే కావడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
 
‘‘ఓ అగ్నిప్రమాదం కారణంగా ఇంతమంది చనిపోవడం ఎన్నడూ ఊహించలేదు. మలేసియాలో గత 20 యేళ్లలో ఇంత ఘోరం జరగడంఇదే మొదటిసారి... ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది..’’ అని కౌలాలంపూర్ ఫైర్ అండ్ రెస్క్యూ విభాగం డైరెక్టర్ ఖిరుదిన్ ద్రాహ్మన్ వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 11 మందిని కాపాడగా... గాయపడిన మరో ఏడుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.