ఆడబిడ్డల చదువుపై సీఎం ప్రత్యేక శ్రద్ధ: కవిత Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
ఆడబిడ్డల చదువుపై సీఎం ప్రత్యేక శ్రద్ధ: కవిత
14-09-2017: ఆడబిడ్డలు చదువుకోవడానికి ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నారని ఎంపీ కవిత అన్నారు. బుధవారం నిజామాబాద్‌లోని సాయినగర్‌లో గిరిజన మహిళా డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాల భవనాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. అనంతరం బైపా్‌సరోడ్డులో జిల్లా గోసంగి సంఘం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రావ్య గార్డెన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి మహా బతుకమ్మ సభ్యత్వం తీసుకుని, అక్కడ ఏర్పాటు చేసిన జిల్లా గోసంగి మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద వర్గాలకు చెందిన ఆడబిడ్డలు చదువుకోవడానికి ఎస్టీలకు 22, ఎస్సీలకు 23 గురుకుల హాస్టల్స్‌ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాల్లో నిజామాబాద్‌లో ఒక కళాశాల, మరొకటి కామారెడ్డికి కేటాయించామని వెల్లడించారు. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 8లక్షల మంది ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గోసంగి కులస్తుల డిమాండ్ల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు దళితులకు ఇస్తున్న మూడు ఎకరాల భూ పంపిణిలో గోసంగిలకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు.