ఆర్యవైశ్య విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
ఆర్యవైశ్య విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు, చిలకలూరిపేట : శ్రీకాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం, నిత్య అన్నదాన సత్రం హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద ఆర్యవైశ్య విద్యార్థులకు విద్యాసహాయాన్ని అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు శ్రీకాశి అన్నపూర్ణసత్రం విద్యానిధి సభ్యుడు పొట్టి శ్రీరాములు బుధవారం తెలిపారు. సత్రం ఆధ్వర్యంలో 2006నుంచి ప్రతియేటా ఈ విద్యాసహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్‌లో 90శాతం మార్కులు దాటిన విద్యార్థులతోపాటు ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులు, వృత్తివిద్యా కోర్సులలో చేరేవారు ఈ సహాయం పొందేందుకు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేవారు శ్రీకాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రం, నిత్య అన్నదన సత్రం, ఫ్లాట్‌ నెం. 303, సంకల్ప్‌ అపార్ట్‌మెంట్‌, రామకృష్ణమఠం ఎదురు, ఇందిరా పార్కు పక్కన, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, హైదరాబాద్‌ చిరునామాకు దరఖాస్తు ఫారంను పంపాలన్నారు. కేంద్ర ప్రభుత్వ యూపీఎస్సీ సివిల్‌ సర్వీసు పరీక్షల అభ్యర్థులకు కూడా సహాయం అందిస్తామని వివరించారు.