మైనారిటీ బాలికలకు స్కాలర్‌షిప్స్ Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
మైనారిటీ బాలికలకు స్కాలర్‌షిప్స్
మైనారిటీల కోసం మౌలానా ఆజాద్‌ జాతీయ ఉపకార వేతనం
ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆఖరు తేదీ సెప్టెంబర్‌ 30
అర్హులైన ఇంటర్‌ విద్యార్థినులకు రూ.12 వేలు స్కాలర్‌షిప్‌
 
ఆంధ్రజ్యోతి - గుంటూరు: ఉన్నత విద్య చదువుకుంటున్న మైనారిటీ బాలికలను ఆర్థికంగా ప్రోత్సాహించేందు కు మౌలానా ఆజాద్‌ జాతీయ ఉపకార వేతన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఉపకార వేతనం పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపికైన ఇంటర్‌ విద్యార్థినులకు రూ.12 వేల ఉపకార వేతనం అందిస్తారు.
 
ఉపకారవేతనాలకు అర్హతలు
మైనారిటీ(ముస్లీం, క్రిస్టియన్‌, జైన్‌, పార్సీ, బుద్ధిస్ట్‌ వర్గాల) బాలికలు అర్హులు.
2016-17 విద్యా సంవత్సరంలో 10వ తరగతి(స్టేట్‌- సీబీఎస్‌ఈ) ఫలితాల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
 
ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌ లేదా కళాశాల లేదా విద్యా సంస్థలో పేరు నమోదై ఉండాలి.
 
విద్యార్థి తండ్రి లేదా సంరక్షకుడి వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉండాలి.
 
www.moef.nic.in అనే వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు పొందుపరిచి, అనంతరం ప్రింట్‌ తీసి ఆ దరఖాస్తుతో పాటు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా జతపరిచి పోస్ట్‌ ద్వారా మైనార్టీ కార్యాలయానికి పంపించాలి. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు వెబ్‌సైట్‌లో అం దుబాటులో ఉన్నాయి.
 
జత చేయాల్సిన ధ్రువీకరణాలు
సంబంధిత అధికారి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం
 
ఇటీవల సంబంధిత అధికారి విద్యార్థిని తండ్రి నివసించే ప్రాంతంలో మంజూరు చేసిన విద్యార్థిని తండ్రి లేదా సంరక్షక్షుడి ఆదాయ ధ్రువీకరణ పత్రం
 
పదో తరగతి మార్కుల జాబితా నకలు. దీనిపై విద్యార్థిని ప్రస్తుతం చదువున్న కళాశాల ప్రిన్సిపాల్‌ సంతకం తప్పనిసరి.
 
దరఖాస్తులో సంబంధిత ఫారంలో విద్యార్థిని తెలిపిన వివరాలను ధ్రువీకరిస్తూ ప్రిన్సిపాల్‌ సంతకంవిద్యా సంస్థలో నమోదైనట్లు ఇచ్చే రశీదు.
 
దరఖాస్తులో అతికించిన ఫొటోపై ఆ విద్యా సంస్థ ప్రిన్సిపాల్‌ సంతకం, విద్యా సంస్థ స్టాంపు ఉండాలి.
 
ఆధార్‌ కార్డు, జాతీయ బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ కాపీలు.
 
అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు హిందీ లేదా ఇంగ్లీష్‌ భాషల్లో మాత్రమే ఉండాలి.
 
లభించే ఉపకార వేతనం
ఎంపికైన మైనారిటీ విద్యార్థినులకు ఇంటర్‌ చదివేందుకు రూ.12 వేలు రెండు విడతలుగా బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఆడ్మిషన్‌ పొందినట్లు ధ్రువీకరించుకున్న తరువాత రూ.6 వేలు, ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత సాంధిచాక మరో రూ.6 వేలు అందిస్తారు.వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి.