సీబీఎస్‌ఈలోనూ ‘తెలుగు’ తప్పనిసరి Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
సీబీఎస్‌ఈలోనూ ‘తెలుగు’ తప్పనిసరి
రేపు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం
ఇంటర్‌లో ఇకపై ‘మొదటి భాష’గా తెలుగు
ప్రభుత్వ నిర్ణయంతో విద్యా శాఖ చర్యలు
ఎక్కువగా సంస్కృతంవైపే విద్యార్థుల మొగ్గు

హైదరాబాద్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కేంద్రం పరిధిలోని సీబీఎ్‌సఈ పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. 1 నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించడం విదితమే. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగానే ఉంది. కానీ సీబీఎ్‌సఈ పాఠశాలల్లో మాత్రం ‘ఆప్షనల్‌‘గా ఉంది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు సంస్కృతం, ఇతరభాషలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం అమలుకు విద్యాశాఖ అధికారులు సీబీఎ్‌సఈ అనుమతితో నడుస్తున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో ఈనెల 15న సమావేశం ఏర్పాటు చేశారు. యాజమాన్యాలు మాట వినకుంటే కేంద్రానికి లేఖ రాయాలని విద్యా శాఖ భావిస్తోంది. కాగా, ఇంటర్మీడియట్‌లో తెలుగును ‘ఫస్ట్‌ లాంగ్వేజ్‌’ చేసేందుకూ చర్యలు తీసుకుంటున్నారు.
 
ప్రస్తు తం ఇంగ్లీషు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తప్పనిసరి)గా ఉంది. సెకండ్‌ లాంగ్వేజ్‌ కింద తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఫ్రెంచ్‌, అరబిక్‌, కన్నడ, మరాఠీ భాషల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది సంస్కృతాన్ని ఎంపిక చేసుకుంటూ తెలుగుకు దూరమవుతు న్నారు. ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ విద్యార్థులు 4.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో మూడు లక్షల మంది సంస్కృతాన్నే ఎంచుకున్నారు. ఎందుకంటే ఎక్కువ మార్కులు స్కోర్‌ చేయవచ్చనే కారణం చెబుతున్నారు. అయితే ఇంటర్‌లో తెలుగును తప్పనిసరి చేయడం సరైంది కాదని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పి.మధుసూదన్‌ రెడ్డి అన్నారు. తెలుగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. పదవ తరగతి వరకు త్రిభాషలు చదువుకున్న విద్యార్థికి ఫ్రెంచ్‌, అరబిక్‌ లాంటి భాషలు నేర్చుకోవటం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందన్నారు.