ఎయిమ్స్‌కు లైన్‌ క్లియర్‌ Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఎయిమ్స్‌కు లైన్‌ క్లియర్‌
వచ్చే ఏడాది నుంచి ‘సిద్ధార్థ’లో తరగతులు
అంగీకరించిన ఎయిమ్స్‌ బృందం సభ్యులు
మొదటి విడతగా 50 సీట్లు కేటాయింపు
కాలేజీలో మౌలిక సదుపాయాలకు 5కోట్లు

అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎయిమ్స్‌ తరగతుల నిర్వహణకు రంగం సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విజయవాడలోని సిద్థార్థ మెడికల్‌ కాలేజీలో క్లాసులు ప్రారంభం కానున్నాయి. బుధవారం విజయవాడ వచ్చిన ఎయిమ్స్‌ బృందం దీనికి ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో మరో జాతీయ స్థాయి విద్యాసంస్థ విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. రెండు వారాల క్రితం కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి జె.పి.నడ్డా రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయినప్పుడు ఎయిమ్స్‌ తరగతుల ప్రారంభంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. వచ్చే ఏడాది నుంచే క్లాసులు ప్రారంభించాలని సీఎం కోరడంతో సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి వెంటనే ఇక్కడి వసతులను పరిశీలించేందుకు ఒక బృందాన్ని నియమించారు.
 
దీనిలో ఢిల్లీ ఎయిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి.కె.శర్మ, ఎయిమ్స్‌ ప్రతినిధి సచిన్‌.ఎం, ఆర్కిటెక్ట్‌లు ముఖేష్‌ వాజపేయి, జి.పి. శ్రీవాత్సవ ఉన్నారు. బుధవారం ఈ బృందం విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీని సందర్శించి, అక్కడ ఉన్న వసతులను క్షణ్ణంగా పరిశీలిచింది. అనంతరం వచ్చే ఏడాది నుంచి సిద్థార్థలో ఎయిమ్స్‌ తరగతులు నిర్వహించుకునేందుకు బృందం సభ్యులు అంగీకరించారు. .
 
ఈ మేరకు తమ నివేదికను కేంద్రానికి అందించనున్నారు. మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తి కావడానికి సుమారు రెండేళ్లు పడుతుంది. అప్పటి వరకూ సిద్థార్థలోనే ఈ తరగతులు నిర్వహిస్తారు. తొలిబ్యాచ్‌లో 50 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.5కోట్లు అవసరమని ఎయిమ్స్‌ బృందంతో పాటు రాష్ట్రానికి చెందిన ఎయిమ్స్‌ సభ్యులు, స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌.రవికుమార్‌, అకడమిక్‌ డీఎంఈ బాబ్జీ, సిద్ధార్థ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశాంక్‌ అంచనా వేశారు.
 
ముందే సూచించిన ‘ఆంధ్రజ్యోతి’
మంగళగిరిలో ఎయుమ్స్‌ నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా తరగతులను తెనాలి ఏరియా ఆసుపత్రిలో ప్రారంభించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు భావించారు. అయితే ఈ తరగతులను తెనాలిలో ప్రారరభించడం కంటే విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో ప్రారంభిస్తే మంచిదని ‘ఆంధ్రజ్యోతి’ ఆ సమయంలోనే సూచించింది.