కాలేజీ ఫీజుకు డబ్బులివ్వలేదని కన్నతండ్రినే.. Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
కాలేజీ ఫీజుకు డబ్బులివ్వలేదని కన్నతండ్రినే..
తండ్రిని చంపిన తనయుడు

మెంటాడ, సెప్టెంబరు 13: ‘ఆ ఫీజులూ.. ఈ ఫీజులు అంటూ లక్షలు తీసుకెళ్తున్నావ్‌.. ఇంత ఎందుకు ఖర్చవుతోంది? చదువు మానేసి ఇంటి దగ్గర పనిచూసుకో’ అని తండ్రి ఆవేశంగా అరిచాడని కత్తెరతో పొడిచేశాడు. విజయనగరం జిల్లా మెంటాడలో బుధవారం ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన సిరిశెట్టి కృష్ణాజీ (45) ఇంటి వద్దే దుస్తుల షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు సాయి గౌతమ్‌ విజయవాడ సమీపంలో సీఏ కోర్సు చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన గౌతమ్‌ తిరిగి విజయవాడకు బయలుదేరుతూ.. తండ్రి వద్దకు వచ్చి కోచింగ్‌ ఫీజు, ఇతర ఖర్చులకు కొంత సొమ్ము కావాలని అడిగాడు. ఇందుకు తండ్రి కృష్ణాజీ అసహనం వ్యక్తం చేశాడు. ఎందుకంత ఖర్చవుతోందని అరిచాడు. మాటామాటా పెరిగింది. క్షణికావేశంలో గౌతమ్‌ షాపులో ఉన్న కత్తెర తీసుకుని తండ్రిని పొడిచేశాడు. దీంతో కృష్ణాజీ రక్తపు మడుగుల్లో కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందాడు. గౌతమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.