సగం బీఈడీ కాలేజీలకే అడ్మిషన్లు? Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
సగం బీఈడీ కాలేజీలకే అడ్మిషన్లు?
ఎడ్‌సెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో 260 కాలేజీలకు చెక్‌
నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఎడ్‌సెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం.. గురువారం నుంచి ఈ నెల 16 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, శుక్రవారం నుంచి 17 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు పూర్తవుతాయి. ఈ నెల 18న సీట్ల కేటాయింపు జరగనుంది. రాష్ట్రంలో బీఈడీలో ప్రవేశాలకి ఈసారి 7,290 మంది అభ్యర్థులు ఎడ్‌సెట్‌లో క్వాలిఫై అయ్యారు. ఉన్నత విద్యా మండలి వర్గాల సమాచారం మేరకు తొలివిడత కౌన్సెలింగ్‌లో సగం బీఎడ్‌ కాలేజీలకే అడ్మిషన్లు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 500 లకు పైగా బీఈడీ కాలేజీలు ఉండగా.. సీట్ల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీ లేని దాదాపు సగం కాలేజీలను పక్కన పెట్టాలని మండలి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయమై గురువారం సాయంత్రానికి ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.