కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
జేసీసీఎల్‌ఏ
 
అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల కాంట్రాక్టు అఽధ్యాపకుల సంఘం (జీసీసీఎల్‌ఏ) డిమాండ్‌ చేసింది. అలాగే ఏకీకృత సర్వీసు నిబంధనల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరింది. బుధవారం ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేసింది. అనంతరం కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు కె. యర్రప్ప విలేకరులతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమానవేతనం కల్పించాలన్నారు.