జనవరిలో వేతనాల పెంపు Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
జనవరిలో వేతనాల పెంపు
కేంద్ర ఉద్యోగులకు కొత్త సంవత్సర కానుక
కనీస వేతనం, ఫిట్‌మెంట్‌ భారీగా పెంపు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం జనవరి నుంచే వేతనాలు పెరగనున్నాయి. జనవరిలో మోదీ ప్రభుత్వం ఈ మేరకు తీపికబురు అందించనుంది. ఏడో వేతన సంఘ (7వ సీపీసీ) సిఫారసులకు అనుగుణంగా వారి కనీస వేతనాలను పెద్దఎత్తున సవరించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని కేబినెట్‌ గతవారం పెంచిన సంగతి తెలిసిందే. వేతన సంఘ సిఫారసుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములాకు లోబడే ఈ డీఏను పెంచింది. దీనికి అదనంగా ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ను 2.57 రెట్లు పెంచాలని వేతన సంఘం సిఫారసు చేయగా.. మూడు రెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కొత్త వేతనాలు జనవరి నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశముంది.
కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, ఫిట్‌మెంట్‌ను 3.68 రెట్లు పెంచాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సూచన మేరకు.. దానిని రూ.21 వేలకు పెంచాలని సిఫారసులు, వేతనాల్లో అంతరంపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ సిఫారసు చేయనున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై త్వరలోనే కేంద్రం ప్రకటన చేస్తుందని, వచ్చే జనవరి నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. వేతన సంఘం కనీస వేతనాన్ని రూ.7 వేల నుంచి రూ.18 వేలకు పెంచాలని, గరిష్ఠ వేతనాన్ని రూ.80 వేల నుంచి రూ.2.25 లక్షలకు, కేబినెట్‌ సెక్రటరీకి రూ.2.5 లక్షలు ఇవ్వాలని సిఫారసు చేసింది. వీటిని కేంద్రం ఇప్పటికే ఆమోదించి.. లోపాల సవరణకు పై కమిటీని నియమించింది.