బడిలోనూ బతకనీయరా? Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
బడిలోనూ బతకనీయరా?
ఇంట్లోనూ లైంగిక దాడులా?.. పిల్లలు ఇంకెక్కడికి పోవాలి?
ఇంతకన్నా దౌర్భాగ్యముందా?.. సత్యార్థి ఆవేదనచెన్నైకి చేరిన యాత్ర
 
చెన్నై, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మన ఇల్లు, పాఠశాలలు కూడా పిల్లలకు సురక్షితం కాకపోవడాన్ని మించిన దౌర్భాగ్యం మరోకటి ఉండబోదని నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాశ్‌ సత్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరూ తల్లిదండ్రుల్లా ఆలోచించి.. పిల్లలకు సురక్షిత భారతాన్ని అందించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సమస్యపై ఆయన రెండురోజుల క్రితం కన్యాకుమారి వేదికగా ప్రారంభించిన భారత యాత్ర.. బుధవారం చెన్నై చేరుకొంది. పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను అడ్డుకునేందుకు అందరం కలిసి పోరాడదామని ఈ సందర్భంగా దేశప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక వేధింపులు పెరగడం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ‘‘పిల్లలకి మన ఇల్లు కూడా సురక్షితం కానంతగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులే పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
 
పాఠశాలలు కూడా సురక్షితంగా లేవు. అక్కడా పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. దాన్ని అడ్డుకోవడానికే నేను పోరాడుతున్నాను. చిన్నారుల సంరక్షణ కోసం ప్రతి ఇంటి తలుపు తడతాను. అన్ని రంగాల నేతలనూ కలుస్తాను’’ అని తెలిపారు. ప్రతి చిన్నారి స్వతంత్ర భారతంలో స్వేచ్ఛగా, మంచి పౌరుడిగా ఎదిగేందుకు కృషిచేద్దామని కోరారు. కొన్ని రాష్ట్రాల్లో బాలలపై లైంగిక కేసుల పరిష్కారానికి 40 ఏళ్లు పట్టే దౌర్భాగ్య పరిస్థితులు మన దేశంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘బాధిత చిన్నారుల గొంతు మనమే అవుదాం. మన పిల్లల్ని రక్షించుకుందాం’ అని నినదించారు.