బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అరెస్ట్‌ Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అరెస్ట్‌
టెకీపై అత్యాచారం.. దృశ్యాలు ఇంటర్నెట్‌లో..
 
బెంగళూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడ్డమే కాకుండా ఆ దృశ్యాలను ఇంటర్నెట్‌లో పోస్టు చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అరిందమ్‌నాథ్‌(28) సహోద్యోగి(26)కి ఇంట్లో పార్టీ ఉందని చెప్పి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించాడు. తన మాట వినకపోతే ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. ఆ బెదిరింపులకు ఆమె లొంగలేదు. దీంతో అత్యాచార దృశ్యాలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసి ఆమెకు ఫోన్‌చేసి చెప్పాడు. షాక్‌కు గురైన సదరు మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించగా చుట్టుపక్కలవారు గమనించి రక్షించారు. దీనిపై బాధితురాలు వివేక్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.