తరగతి గదిలో బెంచీపై అసభ్య రాతలు Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
తరగతి గదిలో బెంచీపై అసభ్య రాతలు
మందలించిన అధ్యాపకులు
భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం
కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా
వైద్య ఖర్చులు భరిస్తామని ప్రిన్సిపాల్‌ హామీ

హైదరాబాద్, సైదాబాద్‌: తరగతి గదిలో బెంచీపై అసభ్యంగా రాసిన విద్యార్థినిని అధ్యాపకులు మందలించడంతో ఇంటికెళ్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేశాడు. మీర్‌పేట జనప్రియనగర్‌లో నివసిస్తున్న మాణిక్‌ప్రభు కుమారుడు వింజమూరి సంజయ్‌ చంపాపేటలోగల ఓ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తరగతి గదిలో బెంచీపై అసభ్యంగా రాశాడు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు లెక్చరర్లకు చెప్పారు. వారు సంజయ్‌ను మందలించి ప్రిన్సిపాల్‌కు చెప్పి తల్లిదండ్రులను తీసుకురావాలని సూచించారు. అసభ్యకరంగా రాసినందుకు టీసీ ఇచ్చి పంపిస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులను తీసుకొస్తేనే కళాశాలకు రానిస్తామన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడి భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడు.
 
కాళ్లకు తీవ్రమైన గాయాలైన సంజయ్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర బీసీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌, ఏబీవీపీ, బీజేపీ నాయకులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యార్థి వైద్యఖర్చులు భరిస్తామని ప్రిన్సిపాల్‌ కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.