రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగింది Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగింది
గత జనవరి నుంచి అమలు
సెప్టెంబరు జీతంతో చెల్లింపు
పెన్షనర్లకు ప్రత్యేకంగా ఉత్తర్వు
దసరా కానుకగా 25నే వేతనం

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరువు భత్యం (డీఏ) పెరిగింది. సెప్టెంబరు వేతనం ఐదు రోజుల ముందే రానుంది. కరువు భత్యం పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోద ముద్ర వేశారు. పెరిగే కరువు భత్యాన్ని సెప్టెంబరు వేతనంతో కలిపి చెల్లిస్తారు. ప్రస్తుతం ఉద్యోగులకు 22.008శాతం కరువు భత్యం అందుతోంది. వారికి 2.096శాతం పెంచారు.
 
వెరసి, కరువు భత్యం 24.104 శాతానికి చేరింది. దీనిని ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నారు. జనవరి నుంచి ఆగస్టు వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలో కలుపుతారు. సెప్టెంబరు నుంచి వేతనంతో కలిపి ఇస్తారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా 580 కోట్ల అదనపు భారం పడనుంది. పింఛనుదారులకు డీఏ పెంపు ఉత్తర్వులు తర్వాత జారీ అవుతాయి.
 
దసరా కానుకగా వేతనాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబరు వేతనం 25వ తేదీనే అందనుంది. ఈనెల 30న దసరా పండుగ రావడంతోపాటు అక్టోబరు 1, 2 తేదీల్లో మొహర్రం, గాంధీ జయంతి సెలవులు ఉన్నాయి. దీంతో 25నే వేతనం చెల్లించాలని ఆర్థిక శాఖాధికారులను సీఎం కేసీఆర్‌ మంగళవారం ఆదేశించారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.