ఓయూకు ‘ఏ+’ Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఓయూకు ‘ఏ+’
కాకతీయ, జేఎన్‌టీయూకు ‘ఏ’ గ్రేడ్‌
10 విద్యాసంస్థలకు న్యాక్‌ గుర్తింపు
వర్సిటీల అధికారులకు కడియం అభినందన
 
హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర యూనివర్సిటీలకు న్యాక్‌ కళ వచ్చింది. 3 ప్రముఖ వర్సిటీలకు నేషనల్‌ అసె్‌సమెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌(న్యాక్‌) మంగళవారం గుర్తింపును జారీ చేసింది. మరో 7 విద్యాసంస్థలకూ న్యాక్‌ గుర్తింపు దక్కింది. ఈ 10 విద్యాసంస్థల్లో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, జేఎన్‌టీయూ సహా 6 ప్రభుత్వ విద్యాసంస్థలు, 4 ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి.
 
ప్రఖ్యాత వర్సిటీ ఉస్మానియాకు న్యాక్‌ రెండో అత్యుత్తమ గ్రేడ్‌ ‘ఏ+’ దక్కడం విశేషం. ఆ తర్వాత కాకతీయ, జేఎన్‌టీయూహెచ్‌కు ‘ఏ’ గ్రేడ్‌ దక్కింది. ఆగస్టు 17-19 తేదీల్లో న్యాక్‌ బృందం ఈ మూడు వర్సిటీలను సందర్శించి సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు ఇతర అంశాలపై న్యాక్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కు నివేదిక ఇచ్చింది. ఈ మేరకు న్యాక్‌ ఈసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వర్సిటీలకు నాలుగేళ్లుగా న్యాక్‌ గుర్తింపు లేకపోవడంతో యూజీసీ నుంచి వచ్చే నిధుల్లో కోత పడింది. ఇప్పుడు మళ్లీ న్యాక్‌ గుర్తింపు దక్కడంతో యూజీసీ నుంచి నిధులు రానున్నాయి. కాగా, 3వర్సిటీలు న్యాక్‌ గుర్తింపు సాధించడంపై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ఆయా వర్సిటీల అధికారులకు అభినందనలు తెలిపారు.