ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య
సత్తెనపల్లి(గుంటూరు జిల్లా): చదువుకోవటం ఇష్టంలేక కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకొని ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని నాగార్జుననగర్‌లో గల ప్రైవేటు హాస్టల్‌లో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గురజాల మండలం గంగవరానికి చెందిన చలువాడి వెంకటేశ్వర్లు రెండో కుమారుడు దుర్గా సతీష్‌నాయుడు (22) సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద గల నలంద ఇంజనీరింగ్‌ కాలేజిలో బీ-టెక్‌ సివిల్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నాగార్జుననగర్‌లోని ఒక ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్నాడు. ఉదయం తన రూంలో ఉండే విద్యార్థులు కళాశాలకు వెళ్ళారు.
 
సతీష్‌నాయుడు మాత్రం కళాశాలకు వెళ్ళలేదు. కళాశాలకు వెళ్ళి తిరిగివచ్చిన విద్యార్థులు రూంలో సతీష్‌నాయుడు నురగకక్కుకొని కిందపడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వైద్యుడిని సంప్రదించగా సతీష్‌నాయుడు చనిపోయాడని ధ్రువీకరించటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. గదిలో కూల్‌డ్రింక్‌ బాటిల్‌, పురుగుమందు డబ్బాను, సతీష్‌నాయుడు రాసిన ఆత్మహత్య లేఖను స్నేహితులు గుర్తించారు. సతీష్‌నాయుడు జ్వరంతో బాధపడుతూ 5 రోజుల క్రితం ఇంటికి వెళ్ళి తిరిగి ఉదయమే వచ్చాడని స్నేహితులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.