పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లకూ ‘సెట్‌’లు! Education-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లకూ ‘సెట్‌’లు!
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు కలిపి నిర్వహణ
కామన్‌గా యూజీ కోర్సుల ప్రవేశాలు, పరీక్షలు
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రతిపాదన

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సులు, పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సెట్‌) నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు కలిపి ఈ సెట్‌ను నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని వర్సిటీలు పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు విడివిడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తూ, ర్యాంకుల ప్రాతిపదికగా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. దీంతో వర్సిటీలపై పని ఒత్తిడి పెరగడంతో పాటు ఎంతో సమయం వృథా అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో అన్నింటికీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదన తెరపైకొచ్చింది. దీనివల్ల యూనివర్సిటీలు ఇకపై పీజీ, రీసెర్చ్‌లపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలు కలుగుతుందని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చే విధంగా కసరత్తు జరుగుతోంది. ఇదిలావుండగా, అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ) కోర్సులకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే కొనసాగించాలని, అయితే అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణకు మాత్రం కామన్‌ షెడ్యూల్‌ను అమల్లోకి తీసుకురావాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది.