ఐదో తరగతి చిన్నారిపై అమానుషం! Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
ఐదో తరగతి చిన్నారిపై అమానుషం!
బాలికను గర్భవతిని చేసి పరారైన ప్రబుద్ధుడు

నరసాపురం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఐదో తరగతి చదువుతున్న చిన్నారిని మాయమాటలతో లోబర్చుకున్న ఓ ప్రబుద్ధుడు ఆమెను గర్భవతిని చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ దారుణం మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు... రిక్షా కార్మికుడు చుక్కా అబ్బులు ఐదేళ్ల క్రితం పట్టణంలో అనాథగా తిరుగుతున్న బాలికను చేరదీశాడు. అప్పటినుంచి ఆమె ఆలనా పాలనా చూస్తున్నాడు. పార్కు రోడ్‌లోని స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న ఆ బాలిక(11)పై పట్టణానికి చెందిన పేడారి నర్సింహరాజు(37) కన్నుపడింది. చిన్నారిపై అత్యాచారం చేశాడు. బాలిక అనార్యోగానికి గురి కావడంతో అబ్బులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలింది. అబ్బులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.