గాలిలో ప్రాణాలు! Education-Article
వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ భార్యపై సీబీఐ కేసు, ఆదాయానికి మించి రూ.కోటి ఆస్తులున్నట్లు గుర్తించిన సీబీఐ|అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి     
గాలిలో ప్రాణాలు!
అదుపు తప్పిన స్కూల్‌ బస్సు... ఆదుకున్న చెట్టు
లైసెన్సు లేకుండానే నడిపిన ‘డ్రైవర్‌’
 
భీమవరం క్రైం: స్కూలు యాజమాన్యాల అలసత్వానికి, డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నిదర్శనమే... ఈ చిత్రం! పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని చినమిరం ప్రాంతంలోని శ్రీ చైతన్య ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన బస్సు ఇది. దెయ్యాలతిప్ప నుంచి 15 మంది విద్యార్థులను ఎక్కించుకుని మంగళవారం ఉదయం భీమవరం బయలుదేరింది. దిరుసుమర్రు రోడ్డులోని లాకుల వద్ద అతివేగంగా వెళుతూ అదుపుతప్పి... పంట బోదెలోకి దూసుకెళ్లింది. అక్కడున్న చెట్లను ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ సంఘటనతో బస్సులోని చిన్నారులు బెంబేలెత్తారు. ఒక్కరికి మాత్రం స్వల్పగాయాలయ్యాయి. బస్సు నడిపిన వ్యక్తికి సరైన బ్యాడ్జి, లైసెన్స్‌ లేవు. ప్రమాదం జరిగిన వెంటనే మరో డ్రైవర్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పంపించారు. ‘బస్సు నడిపింది ఈ అంకుల్‌ కాదు’ అని పిల్లలు చెప్పడంతో వారి ఎత్తు పారలేదు.