జేఈఈ మెయిన్‌ ద్వారానే.. Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
జేఈఈ మెయిన్‌ ద్వారానే..
ఇంజనీరింగ్‌ ప్రవేశాలపై హెచ్చార్డీ నిర్ణయం..
ఇదే జరిగితే ఎంసెట్‌ పరీక్షకు స్వస్తి పలికినట్లే!

హైదరాబాద్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో మార్పులు తెచ్చేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇంజనీరింగ్‌ ప్రవేశాలను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారానే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనపై రెండేళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నా.. ఆచరణలోకి మాత్రం రాలేదు. కానీ, వచ్చే ఏడాది మాత్రం పక్కాగా అమలు చేయాలని కేంద్ర నిర్ణయించినట్లు, ఈ మేరకు రాష్ట్రాలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలిసింది. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ ప్రవేశ పరీక్ష ఆధారంగానే రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశాలు కూడా కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని రాష్ట్ర విద్యాశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.
 
ఒకే పరీక్ష.. స్టేట్‌ ర్యాంకులు
వాస్తవానికి ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. అయితే ఇందుకోసం మళ్లీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని భావించి.. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఈ క్రమంలోనే కేంద్రం జేఈఈ మెయిన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దేశంలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్‌ ప్రవేశ పరీక్ష ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌లో ప్రవేశం కోరుకునే విద్యార్థి ఇక తప్పకుండా జేఈఈ మెయిన్‌ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
 
ఈ పరీక్ష అనంతరం విద్యార్థులు జాతీయ స్థాయిలో పొందిన ర్యాంకులకు అనుగుణంగా వారికి రాష్ట్ర ర్యాంకులను కేటాయిస్తారు. వాటి ద్వారా ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తారు. ఇదే జరిగితే ఎంసెట్‌ పరీక్షకు స్వస్తి పలికినట్టే. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలను నీట్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశాలతోపాటు బీఫార్మసీ, పలు వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్‌ నిర్వహిస్తున్నారు. ఇక ఇంజనీరింగ్‌నూ తొలగిస్తే.. బీఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలే నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో వీటికి మరో పరీక్ష నిర్వహించి, ఎంసెట్‌ను రద్దు చేయాలని ఆలోచిస్తున్నారు.