ఒక్క వర్సిటీ లేని ప్రకాశం Education-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఒక్క వర్సిటీ లేని ప్రకాశం
23 ఏళ్లుగా ఒంగోలులో పీజీ సెంటర్‌తో సరి
కార్యరూపం దాల్చని అమాత్యుల ప్రకటనలు
వనరులు ఉన్నా పట్టించుకోని సర్కారు
 
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 12 జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పలు జిల్లాల్లో రెండు, మూడు వర్సిటీలు కూడా ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో రాష్ట్ర వర్సిటీలతో పాటు జాతీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ వర్సిటీలు, జాతీయ స్థాయి విద్యా సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ప్రైవేట్‌ వర్సిటీలూ ఏర్పాటవుతున్నాయి. కానీ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నడిబొడ్డున ఉన్న ప్రకాశం జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు కాలేదు. వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమి, ఉద్యోగులు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది.
 
పీజీసెంటర్‌ అప్‌గ్రేడ్‌ ఏమైందో...?
ఒంగోలులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) సెంటర్‌ ఉంది. 1993 నవంబర్‌ 16న దీనిని ప్రారంభించారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా ఈ సెంటర్‌ స్థాయి మాత్రం పెరగడం లేదు. పీజీ సెంటర్‌ను విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్‌ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు.
 
మొత్తం 114 ఎకరాల భూమి, తగినన్ని భవనాలు, 47 మంది ఉద్యోగులు ఉన్నా వర్సిటీగా మార్పుకాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దశలవారీ పరిధిని పెంచుకుంటూ వివిధ రకాల కోర్సులను నడుపుతున్న పీజీసెంటర్‌కు అనుబంధంగా దాదాపు 300 కాలేజీలు నడుస్తున్నాయి. ఇంత వరకు ఒంగోలులోని పీజీ సెంటర్‌ స్థాయిని వర్సిటీ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేయాలంటూ రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదన వెళ్లలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
క్లస్టర్‌ వర్సిటీ పోయిందిలా...
రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్షా అభియాన్‌ (రూసా) స్కీం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. రాష్ట్రంలో క్లస్టర్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కర్నూలు లోని సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కాలేజీని క్లస్టర్‌ యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ అక్కడ ఇప్పటికే రాయలసీమ వర్సిటీ, ఉర్దూ వర్సిటీ, సెంట్రల్‌ వర్సిటీలు ఉన్నాయి. దీంతో ఆ జిల్లాలో ప్రతిపాదిత క్లస్టర్‌ వర్సిటీని ఒంగోలులో ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపకపోవడంతో పాత నిర్ణయానికి అనుగుణంగానే కర్నూలు క్లస్టర్‌ వర్సిటీకే రూ.50 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇలా ఇది కూడా ప్రకాశం జిల్లా చేజారిపోయింది.