భారత్‌లో డిగ్రీ ఖర్చు రూ.12.2 లక్షలు Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
భారత్‌లో డిగ్రీ ఖర్చు రూ.12.2 లక్షలు
భారత దేశంలోని తలిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం సగటున ఒకొక్కరిపై 18,909 అమెరికన్‌ డాలర్లు (రమారమి రూ.12.2 లక్షలు) ఖర్చు చేస్తున్నారు. ప్రైమరీ నుంచి యూనివర్సిటీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు వరకు ఈ మొత్తం అవుతున్నట్టు హెచ్‌ఎ్‌సబిసి నివేదికలో పేర్కొంది. అంటే సగటు తల్లిదండ్రులు విద్యపై ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారో తెలుస్తోంది. అయితే ప్రపంచ సగటుతో పోల్చుకుంటే ఈ మొత్తం తక్కువే. పదిహేను దేశాల్లో
హెచ్‌ఎ్‌సబిసి సర్వే చేసింది. దాని ప్రకారం గ్లోబల్‌ సగటు వ్యయం 44,221 డాలర్లు. భారత దేశంలోని తలిదండ్రులు ప్రైమరీ విద్య 8,552 డాలర్లు, సెకండరీ విద్య 4,264 డాలర్లు, యూజీ కోసం 6,093 డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఇండొనేషియా, ఈజిప్ట్‌, ఫ్రాన్స్‌లో మాత్రం ఇండియాతో పోల్చుకుంటే చేస్తున్న వ్యయం తక్కువే. భారతదేశంలో 59 శాతం మంది తమ రోజువారి ఆదాయం నుంచే విద్య కోసం ఖర్చు చేస్తున్నారు.