మెడికల్‌కు రెండుసార్లు కౌన్సెలింగ్‌ Education-Article
హైదరాబాద్:గురుకుల ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా- టీఎస్‌పీఎస్సీ|చెన్నై: ఎయిరిండియా విమానంలో డ్రగ్స్‌ కలకలం, క్యాటరింగ్‌ బాక్స్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తింపు|బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్‌కు ఈడీ నోటీసులు, ఈ నెల 23న వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు|రాజన్న-సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేటలో విషాదం, బైకుపై చెట్టు కూలి తల్లీకొడుకు మృతి|కృష్ణా: జగ్గయ్యపేట మండలం భీమవరంలో విషాదం, పొలంలో కరెంట్‌షాక్‌తో తండ్రీకొడుకు మృతి|విజయవాడ: కాపులను చీల్చడానికి వైసీపీ కుట్ర చేస్తోంది- కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ|విజయవాడ: శబరిమలలో ఆలయ ధ్వజస్తంభంపై పాదరసం పోసిన వారికి బెయిల్ మంజూరు|హైదరాబాద్: డ్రగ్స్‌ కేసులో కెమెరామెన్ శ్యామ్‌ కె.నాయుడును ఐదున్నర గంటలపాటు విచారించిన సిట్ అధికారులు|కర్నూలు: గోనెగొండ్ల మండలం హెచ్. కైరవాడిలో ఇంట్లో విద్యుత్‌షాక్‌తో తండ్రీకూతురు దుర్మరణం|తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారి కోలేరి కృష్ణారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు     
మెడికల్‌కు రెండుసార్లు కౌన్సెలింగ్‌
ఆ తర్వాత మాపప్‌ పద్ధతిలో కేటాయింపు..
అప్పటికీ మిగిలితే కాలేజీల్లో
మెడిక ల్‌ సీట్ల కౌన్సెలింగ్‌లో కొత్త పద్ధతి
ఒకటి రెండు రోజుల్లో ఫీజుల ఖరారు

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది నుంచి కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లోని అన్నిరకాల మెడికల్‌ సీట్లను ఇక నుంచి ప్రభుత్వం నిర్వహించే కామన్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేస్తారు. ఈ కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలిపోయే సీట్లను మాత్రం నేరుగా ఆయా కాలేజీలే భర్తీ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం నిబంధనల్లో మార్పు తెచ్చింది. ఈ ఏడాది మెడికల్‌ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈసారి కన్వీనర్‌ కోటాతో పాటు.. ప్రైవేటు కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌, ఎన్నారై కోటా సీట్లను కూడా ప్రభుత్వమే కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీచేస్తుంది. ఇందులోనే కొంత మార్పులు చేశారు. ఈ రెండు కేటగిరి సీట్ల భర్తీకి రెండుసార్లు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అప్పటికీ ఇంకా సీట్లు మిగిలితే... మాపప్‌ పద్ధతిలో అప్పటికప్పుడు కౌన్సెలింగ్‌ సెంటర్‌కు వచ్చే విద్యార్థులకు మెరిట్‌ ప్రకారం అవకాశం ఇస్తారు. ఆ తర్వాత కూడా ఇంకా ఏవైనా కాలేజీల్లో సీట్లు మిగిలితే, వాటిని భర్తీ చేసుకునే అవకాశాన్ని ఆయా మెడికల్‌ కాలేజీలకే ఇవ్వాలని నిర్ణయించారు.
 
అందుకోసం ప్రభుత్వం ప్రకటించిన తుది మెరిట్‌ జాబితాను ఆయా కాలేజీలకు అందజేయనున్నారు. ఈ మెరిట్‌ లిప్టులో ఉన్నవారు సీటు కావాలని కాలేజీకి వస్తే.. అక్కడ నేరుగా అడ్మిషన్లను ఇవ్వవచ్చు. అయితే, ఈ పద్ధతివల్ల కొన్ని సార్లు అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాలేజిల్లోని మొత్తం సీట్లను ముందు చూపించకుండా... కొన్ని సీట్లు మిగిలేలా కాలేజీలు అక్రమాలకు పాల్పడితే ఎలా నియంత్రించగలరన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సీటు కోసం నేరుగా కాలేజీకి వచ్చేవారి నుంచి యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో ఫీజులను వసూలు చేసే అవకాశం ఉంది. కానీ.. రెండుసార్లు కౌన్సెలింగ్‌, ఆపై మాపప్‌ పద్ధతి తర్వాత ఇక మెడికల్‌ సీట్లు మిగిలే ప్రసక్తి ఉండదని అధికారులు అంటున్నారు.
 
ఫీజుల సంగతేంటో..
ఈ ఏడాది మెడికల్‌ ఫీజులకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజులను యథాతథంగా కొనసాగిస్తూ, మేనేజ్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల ఫీజులను 5 శాతం మేర పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రైవేట్‌ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా ఫీజు ఎంబీబీఎస్‌ కోర్సు మొత్తానికి రూ. 55 లక్షలు ఉండగా, ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజు రూ.1.10 కోట్లు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులను 5 శాతం పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.