నిరుద్యోగుల పేరిట డెబిట్‌,క్రెడిట్‌ కార్డులు తీసుకొని... Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
నిరుద్యోగుల పేరిట డెబిట్‌,క్రెడిట్‌ కార్డులు తీసుకొని...
నకిలీ ఉద్యోగుల పేరిట క్రెడిట్‌ కార్డులు
 
హైదరాబాద్ : నకిలీ ఉద్యోగుల పేరిట ఐడీ కార్డులు తయారు చేసి క్రెడిట్‌ కార్డుల ద్వారా బ్యాంకుల్లో డబ్బులు స్వాహా చేస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 5లక్షల నగదు, 50 క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టా్‌పలు ఇతర నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉప్పల్‌ ఠాణాలో విలేకరుల సమావేశంలో డీసీపీ ఉమామహేశ్వరశర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన పోతిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి(30), ఒడిసాకు చెందిన నక్కింటి సుభాష్‌ కుమార్‌ (26), పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యాదగాని బాలాజీ (24), షేక్‌హాబీబ్‌(32) నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. వీరు రామంతాపూర్‌, పంజాగుట్ట ప్రాంతాల్లో ఎంఎ్‌సజీ వాక్స్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎంఎస్‌ స్టన్స్‌ ఐటీ సొల్యూషన్స్‌, ఎంఎస్‌ హప్‌టిక్‌ సోల్యూషన్స్‌ పేర్లతో మూడు నకిలీ కంపెనీలు ఏర్పాటు చేశారు.
 
ఈ కంపెనీల్లో ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. అనుభవ పత్రాలను ఇస్తున్నందుకు మరో 25 వేలు తీసుకుంటున్నారు. బ్యాంకు అకౌంట్ల కోసమని ఫొటోలు, ఆధార్‌ ఇతర వివరాల పత్రాలు తీసుకొని బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి జీతాలు కుడా వేస్తున్నారు. కంపెనీ జీతం స్లిప్‌లను, బ్యాంక్‌ ఖాతాలను చూపిస్తూ ఇతర బ్యాంకుల నుంచి క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు తీసుకుంటున్నారు. ఎనిమిది బ్యాంకుల నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు తీసుకొని రూ.50 లక్షల వరకు సొమ్మును స్వాహా చేశారు. ఇప్పటివరకు 200 మంది నిరుద్యోగులను మోసం చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు నేరెడ్‌మెట్‌, ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ బ్యాంకు అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.