సాఫీగా గ్రూపు-2 మెయిన్స్‌ Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
సాఫీగా గ్రూపు-2 మెయిన్స్‌
అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 982 గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకోసం ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా శని, ఆదివారాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 49,106 మంది మెయిన్స్‌కు అర్హత సాధించగా... అందులో 45వేల మందికిపైగా (సుమారు 92శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఒకేసారి ఇన్ని వేలమందికి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించడం దేశంలోనే వినూత్న పద్దతి అని ఏపీపీఎస్సీ కార్యదర్శి వై.వి.ఎస్.టి.సాయి పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలు, వాటి జవాబులను ఒకటి, రెండు రోజుల్లో ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. ఆన్సర్‌ కీని వెబ్‌సైట్‌లో పెట్టిన ఏడు రోజుల్లోగా అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియచేయాలన్నారు. ఇందుకు ఉపయోగించాల్సిన ఫార్మాట్‌ను కూడా వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంచుతామని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.