పరీక్ష పునఃనిర్వహణపై చర్చిస్తాం Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
పరీక్ష పునఃనిర్వహణపై చర్చిస్తాం
ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌
 
విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష సమయంలో సర్వర్‌ అంతరాయంతో ఇబ్బందిపడిన అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించడంపై కమిషన్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఆచార్య ఉదయభాస్కర్‌ అన్నారు. అభ్యర్థులకు న్యాయం జరగలేదని భావిస్తే మరోసారి పరీక్ష నిర్వహిస్తామని, లేదంటే ఉండదన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన గీతం వర్సిటీలోని గ్రూప్‌-2 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. శనివారం మధ్యాహ్నం పరీక్ష ప్రారంభమైన వెంటనే సర్వర్‌ సమస్య కారణంగా జాప్యం జరగడంతో అభ్యర్థులు ఆందోళన చేశారన్నారు. 41మంది మాత్రం పరీక్షకు రాలేదని, సమయం ఇచ్చినా పరీక్ష రాయని అభ్యర్థుల విషయంలో మాల్‌ప్రాక్టీస్‌ నిబంధనల మేరకు వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.