క్లిష్టంగానే ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
క్లిష్టంగానే ఏపీపీఎస్సీ గ్రూప్‌-2
మూడో పేపర్‌ మరింత కఠినం!
 
అమరావతి:  ఏపీపీఎస్సీ గ్రూప్‌ -2 మెయిన్స్‌ ఒకింత కఠినంగానే ఉందన్న మాట సర్వత్రా వ్యక్తమవుతోంది. శని, ఆది వారాల్లో కలిపి మూడు పేపర్లుగా మెయిన్స్‌ నిర్వహించారు. సాపేక్షంగా రెండో పేపర్‌ మాత్రమే సులువుగా ఉంది. మొదటి పేపర్‌ పర్వాలేదనిపించగా, మూడో పేపర్‌ ఎకానమిలో అడిగిన ప్రశ్నలు కొద్దిగా కఠినంగా ఉన్నాయని కొందరు అభ్యర్థులు చెబుతున్నారు. మూడు పేపర్లలో అడిగిన ప్రశ్నల్లో అధికశాతం అభ్యర్థి సబ్జెక్టు పరిజ్ఞానాన్ని లోతుగా పరీక్షించేలా ఉన్నాయి. నిర్గేశిత సిలబస్‌ మొత్తం పేపర్లో ప్రతిబింబించలేదని, మూడు నాలుగు చాప్టర్ల నుంచే ప్రశ్నలు అడగడంతో సమ ప్రాధాన్యం లోపించిందని కూడా అంటున్నారు. మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్‌ మోడరేట్‌గా ఉంది. సబ్జెక్టు అంశాలు అంటే సైన్స్‌, జాగ్రఫీకి ప్రాధాన్యం ఇచ్చారు. కరెంట్‌ అఫైర్స్‌లో ఇటీవలి జరిగిన పరిణామాలపై అధికంగా ప్రశ్నలు అడిగారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన, చైనాతో సంబంధాలు, ఏపీ-తెలంగాణ మధ్య నీటిపంపకంపై అడిగిన ప్రశ్నలను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. రెండో పేపర్‌ పాలిటీ, ఏపీ హిస్టరీలో అడిగిన ప్రశ్నలు సబ్జెక్టుపై అవగాహన ఉన్న అభ్యర్థులకు సులువుగానే అనిపించాయి. పాలిటీలో రాజ్యాంగం అలాగే ఆర్టికల్స్‌పై అభ్యర్థి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నించారు. హిస్టరీలో కొన్ని ప్రశ్నలు అభ్యర్థి ఊహకు అందని విధంగా ఉన్నాయి.మూడో పేపర్‌ భారత, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలను ఉద్దేశించినది. ఏపీ ఆర్థిక సర్వేను ఆధారంగా చేసుకునే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ప్రిలిమ్స్‌ కేవలం ఎకానమి, పాలిటీ, కరెంట్‌ అఫైర్స్‌కు పరిమితం చేయడంతో తతిమా అంశాలపై మెయిన్స్‌లో దృష్టిపెట్టినట్టు కనిపిస్తోందని అకడమిక్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్లే ప్రిలిమ్స్‌తో పోల్చుకుంటే మెయిన్స్‌ అభ్యర్థులకు కష్టంగా అనిపించిందని చెబుతున్నారు. అంకెలకు పరిమితం కాకుండా కాన్సెప్ట్‌ ఆధారితంగా మార్చడం ఆహ్వానించదగ్గ పరిణామమని, సివిల్స్‌ రూట్‌లో పయనించడం శుభశూచకమని కూడా మరి కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.
- ఎడ్యుకేషన్‌ డెస్క్‌