నడుస్తున్న రైల్లో నుంచి జారిపడి విద్యార్థి దుర్మరణం Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
నడుస్తున్న రైల్లో నుంచి జారిపడి విద్యార్థి దుర్మరణం
అరకు రూరల్‌: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. అరకులోయ సందర్శన కోసం విశాఖ నుంచి పాసింజర్‌ రైలులో వెళుతున్న యువకుడు సెల్ఫీ తీసుకుంటూ గోస్తనీ నదిలో పడ్డాడు. గుంటూరు సమీపంలోని మలినేని లక్ష్మయ్య ఫార్మసీ కళాశాలలో ఫైనలియర్‌ చదువుతున్న డి.గోపిరెడ్డి(21) స్నేహితులతో కలసి శనివారం విశాఖపట్నం వచ్చాడు. ఆదివారం ఉదయం వీరంతా పాసింజర్‌ రైలులో అరకులోయ బయలుదేరారు. కబుర్లు చెప్పుకుంటూ, ఫొటోలు తీసుకుంటూ సరదా గడుపుతున్నారు. గోస్తనీ నదిపై వంతెన మీదుగా రైలు వెళ్తుండగా బోగీ వాకిలి వద్ద నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న గోపిరెడ్డి అదుపు తప్పి, 150 అడుగుల కింద ఉన్న నదిలో ఉన్న పెద్ద బండరాయిపై పడి ప్రాణాలు కోల్పోయాడు.