జీహెచ్‌ఎంసీ జాబ్‌మేళాకు స్పందన Education-Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
జీహెచ్‌ఎంసీ జాబ్‌మేళాకు స్పందన
కిటకిటలాడిన హరిహరకళాభవన్‌
నిరుద్యోగులకు బాసటగా జీహెచ్‌ఎంసీ: డిప్యూటీ మేయర్‌
 
హైదరాబాద్, హరిహరకళాభవన్‌: జీహెచ్‌ఎంసీ అంటే రోడ్లు వేయడం, గుంతలు పూడ్చడం, పారిశుధ్య పనులు చేయడం మాత్రమే అనుకోవడంలేదని పౌరులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడం కూడా తన బాధ్యతగా భావించి పనిచేస్తుందని డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ అన్నారు. గురువారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సామాజిక కోణంలో ఆలోచించి నగరంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జీహెచ్‌ంఎసీ ముందుకు వచ్చిందన్నారు. 51 కంపెనీలు 12 వేల ఉద్యోగాలతో ముందుకు వచ్చాయని తెలిపారు. టాలెంట్‌ ఉంటే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దొరకుతాయని వివరించాడు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం, అబిరుచి, క్యారెక్టర్‌ ఉంటే మంచి ఉద్యోగం దొరకడంతోపాటు ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, సరియైున స్కిల్స్‌ లేకపోవడం మూలంగా ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అన్నారు.
 
ఆర్మీకి చెందిన కల్నల్‌ అమోద్‌ చడ్డా మాట్లాడుతూ ఆర్మీలోని వివిధ విభాగాల్లో వేల ఉద్యోగాలు ఉన్నాయని, దేశం కోసం పనిచేయాలనే తపన ఉన్న యువతకు మంచి అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ (యుసీడీ) భాస్కరచారి, ఉత్తర మండలం జోనల్‌ కమిషనర్‌ శంకరయ్య, కార్పొరేటర్లు ఉప్పల తరుణి, శ్రీదేవి, కో-ఆప్షన్‌ మెంబర్‌ గొట్టిముక్కల జ్యోతి, ఉప కమిషనర్లు ఈడీ విజయరాజు, ఇస్లావత్‌, రమేష్‌, యూసీడీ పీవో సౌజన్య తదితరులు పాల్గొన్నారు. 969 మంది నిరుద్యోగులు జాబ్‌ మేళాలో పాల్గొనగా ఎవరికి ఆఫర్‌ లెటర్స్‌ ఇవ్వలేదు.
 
జీహెచ్‌ఎంసీకి థ్యాంక్స్‌
నేను ఎం.ఈడీ చేశాను. ఉద్యోగం చేస్తున్నాను. నా ఫ్రెండ్స్‌, ఇంటి పక్కన ఉంటున్న వారికి సహాయంగా జాబ్‌ మేళాకు వచ్చాను. కన్సల్టెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కి థ్యాంక్స్‌. 
- వీణ, సికింద్రాబాద్‌
 
మగవారికే ఉద్యోగావకాశాలు అధికం
నేను డిగ్రీ పూర్తి చేశాను. ఎగ్జిక్యూటివ్‌ జాబ్‌ కోసం వచ్చాను. ఈ జాబ్‌ మేళాకు వచ్చిన కంపెనీలలో మగవారికి ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాల్లో సగం మహిళలకు కల్పించకపోవడం నిరాశ పరచింది.
- ఆర్తీ, బేగంపేట్‌
 
జీహెచ్‌ఎంసీకి రుణపడి ఉంటాను
నేను ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగం చేయవలసి వస్తోంది. జీహెచ్‌ఎంసీ జాబ్‌ మేళా ఏర్పాటు చేసిందని తెలిసి వచ్చాను. హోండా మోటార్స్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాను. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం దొరకడం ఆనందంగా ఉంది. జీహెచ్‌ఎంసీకి రుణపడి ఉంటాను.
- అలేఖ్య, బేగంపేట్‌
 
ఏర్పాట్లు భేష్‌
నేను బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేశాను. ఇంతకు ముందు మా కాలేజీలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. ప్రస్తుతం... మొదటి సారిగా బయట జాబ్‌ మేళాకు వచ్చాను. జాబ్‌మేళకు జీహెచ్‌ఎంసీ చేసిన ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయి.
- పూర్ణిమ, ప్రకాష్‌నగర్‌