జాబ్‌ అలర్ట్స్‌.. సెట్‌ చేసుకోండిలా Education-Article
హైదరాబాద్:గురుకుల ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా- టీఎస్‌పీఎస్సీ|చెన్నై: ఎయిరిండియా విమానంలో డ్రగ్స్‌ కలకలం, క్యాటరింగ్‌ బాక్స్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు గుర్తింపు|బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్‌కు ఈడీ నోటీసులు, ఈ నెల 23న వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు|రాజన్న-సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేటలో విషాదం, బైకుపై చెట్టు కూలి తల్లీకొడుకు మృతి|కృష్ణా: జగ్గయ్యపేట మండలం భీమవరంలో విషాదం, పొలంలో కరెంట్‌షాక్‌తో తండ్రీకొడుకు మృతి|విజయవాడ: కాపులను చీల్చడానికి వైసీపీ కుట్ర చేస్తోంది- కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ|విజయవాడ: శబరిమలలో ఆలయ ధ్వజస్తంభంపై పాదరసం పోసిన వారికి బెయిల్ మంజూరు|హైదరాబాద్: డ్రగ్స్‌ కేసులో కెమెరామెన్ శ్యామ్‌ కె.నాయుడును ఐదున్నర గంటలపాటు విచారించిన సిట్ అధికారులు|కర్నూలు: గోనెగొండ్ల మండలం హెచ్. కైరవాడిలో ఇంట్లో విద్యుత్‌షాక్‌తో తండ్రీకూతురు దుర్మరణం|తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారి కోలేరి కృష్ణారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు     
జాబ్‌ అలర్ట్స్‌.. సెట్‌ చేసుకోండిలా
జాబ్‌ మార్కెట్లో అవకాశాలకు కొదవలేదు. వాటిని గుర్తించి, అందుకోవడంలోనే అసలైన యుక్తి దాగి ఉంటుంది. అప్లయ్‌ నుంచి అపాయింట్‌మెంట్‌ వరకు మొత్తం హైరింగ్‌ ప్రాసెస్‌ డిజిటల్‌ మోడ్‌లోకి మారిన నేపథ్యంలో జాబ్‌ సెర్చ్‌ను కూడా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలి. ఒక క్లిక్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా మనం ఆశిస్తున్న జాబ్‌నోటిఫికేషన్స్‌ను అలర్ట్స్‌ రూపంలో పంపే సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయితే లక్షల్లో ఉండే జాబ్‌ ఆఫర్స్‌ నుంచి మన ప్రొఫైల్‌కు సరిపోయే జాబ్‌ అలర్ట్స్‌ను ఏ విధంగా పొందొచ్చొ చూద్దాం.

ఆన్‌లైన్‌ జాబ్‌ లిస్టింగ్‌ వెబ్‌సైట్స్‌, సోషల్‌ మీడియా లేదా సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్లు, మీడియా హౌస్‌లు జాబ్‌ అలర్ట్స్‌ను అప్‌ డేట్‌ చేస్తుంటాయి. ఈ సంస్థల నుంచి జాబ్‌ అలర్ట్స్‌ పొందాలంటే ముందుగా ఆయా సంస్థలు నిర్దేశించిన విధంగా ప్రొఫైల్‌ రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. తరవాత రెజ్యూమె, ఇచ్చిన సమాచారం ఆధారంగా మీ ప్రొఫైల్‌కు సరిపోయే జాబ్‌ నోటిఫికేషన్స్‌ను ఎప్పటికప్పుడు ఈ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ తదితర మాధ్యమాల ద్వారా (రోజు లేదా వారం వారం మీరు ఎంచుకున్న విధంగా) అలర్ట్స్‌ రూపంలో పంపిస్తారు.
ఉద్యోగ సాధనలో అధిక శాతం సమయాన్ని సెర్చ్‌ కోసమే కేటాయిస్తాం. ఆన్‌లైన్‌ జాబ్‌ లిస్టింగ్స్‌ వెబ్‌సైట్స్‌, సోషల్‌ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చిన తరవాత సుదీర్ఘ కాలంపాటు జాబ్‌ సెర్చ్‌ చేసే సంప్రదాయానికి చెక్‌ పడింది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాల సమాచారం సులువుగా అందుబాటులోకి వచ్చింది. రెజ్యూమె రైటింగ్‌, ప్రొఫైల్‌ క్రియేషన్‌ వంటి అంశాలు ఎంత ముఖ్యమో మన ప్రొఫైల్‌కు సరిపోయే జాబ్‌ అలర్ట్స్‌ను పొందడం కూడా అంతే కీలకమని గమనించాలి. అప్పుడే సరైన జాబ్‌ కాల్స్‌ రావడంతోపాటు సమయం ఆదా అవుతుంది. కాబట్టి జాబ్‌ అలర్ట్స్‌ను సెట్‌ చేసుకునే క్రమంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు..
కీ వర్డ్స్‌ :
జాబ్‌ అలర్ట్స్‌ను స్వీకరించే క్రమంలో గుర్తు పెట్టుకోవాల్సిన కీలక అంశం కీ వర్డ్స్‌. ఆన్‌లైన్‌ రిసోర్సె్‌సలో లక్షల సంఖ్యలో జాబ్స్‌ లిస్టింగ్స్‌ ఉంటాయి. వాటిల్లో ప్రతి నోటిఫికేషన్‌ను పరిశీలిస్తూ మనకు సరిపోయే జాబ్‌ను ఎంచుకోవడం సుదీర్ఘ ప్రక్రియ. కష్టంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ప్రొఫైల్‌కు సరిపోయే కీవర్డ్స్‌ను ఉపయోగిస్తూ సెర్చ్‌ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. క్వాలిఫికేషన్‌, స్కిల్స్‌, ప్రీవియస్‌ పొజిషన్‌, ఎక్స్‌పీరియెన్స్‌ వంటి వాటిని కీవర్డ్స్‌గా పేర్కొంటారు. ఈ కీవర్డ్స్‌ సెట్‌ చేసుకోవడం ద్వారా మనం ఎంచుకున్న రంగానికి సంబంధించిన జాబ్‌ అలర్ట్స్‌ను మాత్రమే పొందొచ్చు. మరో విషయంలో కూడా కీవర్డ్స్‌ కీలకంగా ఉంటాయి. ఏదైనా జాబ్‌కు అప్లయ్‌ చేసినప్పుడు అప్లికేషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ఏటీఎస్‌) కీవర్డ్స్‌ ఆధారంగానే రెజ్యూమెను స్ర్కీన్‌ చేస్తుంది.
లొకేషన్‌:
ప్రస్తుతం అనుసరిస్తున్న హైరింగ్‌ ప్రాసె్‌సలో వర్క్‌ లొకేషన్‌ను తప్పనిసరిగా పేర్కొంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఆన్‌లైన్‌ లేదా జాబ్‌ లిస్టింగ్‌ వెబ్‌సైట్లలో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలను అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రిఫర్డ్‌ వర్క్‌ లొకేషన్‌ అనే ఆప్షన్‌ ద్వారా మనకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అప్పుడే ఎంచుకున్న జాబ్‌ లొకేషన ఆధారంగానే కాల్స్‌/అలర్ట్స్‌ వస్తాయి. లేకపోతే లొకేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే జాబ్‌ అలర్ట్స్‌ గందరగోళానికి దారి తీస్తాయి. ఒక్కోసారి టైం (పని వేళలు)ను ప్రస్తావించడం ద్వారా కూడా సంబంధిత అలర్ట్స్‌ పొందొచ్చు. ఉదాహరణకు సెర్చ్‌ చేస్తున్నప్పుడే ఫుల్‌ టైం/ పార్ట్‌ టైం అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి.
జాబ్‌ కేటగిరీ:
జాబ్‌ అలర్ట్స్‌ విషయంలో గమనించాల్సిన మరో అంశం ఎంచుకున్న రంగం దానికి సంబంధించిన పరిశ్రమలు. ఎందుకంటే ఆన్‌లైన్‌ సోర్స్‌ల్లో జాబ్‌ ఆఫర్‌ చేసే కంపెనీల సంఖ్య వేలల్లో ఉంటుంది. వీటిల్లోంచి మన ప్రొఫైల్‌కు సరిపోయే రంగం, కంపెనీలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. తద్వారా మన ఫంక్షనల్‌ ఏరియాకు దగ్గరగా ఉండే పరిశ్రమలకు సంబంధించిన అలర్ట్స్‌ మాత్రమే వస్తాయి.
రోల్‌:
ఎటువంటి హోదాలో జాబ్‌ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమే. లక్షల సంఖ్యలో ఉండే జాబ్‌ ఆఫర్లకు సంబంధించిన కొన్ని వేల సంఖ్యలో జాబ్‌ రోల్స్‌ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో స్పష్టమైన అభిప్రాయంతో ఉండాలి.
ఉదాహరణకు సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా స్థిరపడాలని అనుకుంటే..సిస్టమ్స్‌ ఇంజనీర్‌ రోల్‌ ఆధారంగానే సెర్చ్‌ చేయాలి. అప్పుడే మనకు అవసరమైన జాబ్‌ అలర్ట్స్‌ రావడం జరుగుతుంది.
ఎక్స్‌పెక్టెడ్‌ శాలరీ:
హోదాకు తగిన వేతనాన్ని ఆశించడంలో ఎటువంటి సందేహాలకు తావు ఉండకూడదు. కాబట్టి అప్లయ్‌ చే సే జాబ్‌కు సంబంధించి ఎక్స్‌పెక్టెడ్‌ శాలరీ విషయంలో ఒక అంచనాతో ఉండడం మంచిది. సెర్చ్‌ చేస్తున్నప్పుడే ఎక్స్‌పెక్టెడ్‌ శాలరీ ఆప్షన్‌ ఉపయోగించాలి. తద్వారా మీరు ఆశిస్తున్న వేతనాన్ని ఆఫర్‌ చేసే కంపెనీల నుంచి మాత్రమే జాబ్‌ కాల్స్‌/జాబ్‌ అలర్ట్స్‌ వస్తాయి.
నో టు ఆదర్స్‌:
మరో కీలకమైన విషయం నో టు ఆదర్స్‌. చాలా మంది సెర్చ్‌ చేస్తున్నప్పుడు వారి ఫంక్షనల్‌ ఏరియా/రోల్‌కు సంబంధించి ఎటువంటి ఆప్షన్‌ కనిపించని పక్షంలో ఆదర్స్‌ అనే కాలాన్ని ఎంచుకుంటారు. అలా చేయకూడదు.
ఎందుకంటే రిక్రూటర్స్‌ ఫంక్షనల్‌ ఏరియా/రోల్‌ వైజ్‌గా రిక్రూట్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఆదర్స్‌ బదులు ప్రొఫైల్‌కు దగ్గరగా ఉండే ఫంక్షనల్‌ ఏరియా/రోల్‌ను ఎంచుకోవడం ప్రయోజనకరం. దాంతో ఎక్కువ మొత్తంలో జాబ్‌ అలర్ట్స్‌, కాల్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది.