ఆటోమేషన్‌ సవాలుకు..సామర్థ్యమే సమాధానం JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఆటోమేషన్‌ సవాలుకు..సామర్థ్యమే సమాధానం
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగం ఊహించనంత వేగంతో పురోగమిస్తోంది. మానవ జీవితాన్ని సులభతరం చేసే దిశగా ఎన్నో సాంకేతిక వ్యవస్థల ఆవిర్భావానికి టెక్నాలజీ విప్లవం నాందిగా నిలిచింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌ వంటి నూతన ఆవిష్కరణలు వాటిలో భాగమే. ఈ ఆవిష్కరణల వల్ల ఉద్యోగ రంగంలో ఆందోళనలు తలెత్తడం మరో పరిణామం. విధి నిర్వహణలో యంత్రాలు మనుషులకు ప్రత్యామ్నాయంగా మారుతుండటం ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం, చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మన దేశంలో ఏయే రంగాలపై ఆటోమేషన్‌ ప్రభావం అధికంగా ఉంది, భవిష్యత్‌ ముఖ చిత్రం, తదనుగుణంగా మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలపై ఆస్పైరింగ్‌ మైండ్స్‌ అనే సంస్థ క్షేత్రస్థాయిలో ఒక అధ్యయనం నిర్వహించింది. అందులోని ముఖ్యాంశాలు...
 
ఉద్యోగార్థులకు జాబ్‌ మార్కెట్‌కు అనుగుణంగా స్కిల్స్‌ ఉన్నాయో లేవో అనే విషయాన్ని స్వీయ మదింపు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ టెస్ట్‌లు నిర్వహించే సంస్థ ఆస్పైరింగ్‌ మైండ్స్‌. దీనికి అమెజాన్‌, విప్రో, జీఈ, సిటీ గ్రూప్‌, టాటా మోటార్స్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి విఖ్యాత సంస్థలతో భాగస్వామ్యం ఉంది. ఉద్యోగా ర్థుల్లో ఆప్టిట్యూడ్‌ స్కిల్స్‌, రీజనింగ్‌ స్కిల్స్‌, టెక్నికల్‌ స్కిల్స్‌, మెంటల్‌ ఎబిలిటీ స్కిల్స్‌ను మూల్యాంకనం చేయడానికి ఆస్పైరింగ్‌ మైండ్స్‌ కంప్యూటర్‌ అడాప్టివ్‌ టెస్ట్‌ (ఎఎంక్యాట్‌) పేరుతో ఈ సంస్థ ఒక పరీక్షను నిర్వహిస్తుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తాజా నివేదిక ద్వారా దేశంలో ఆటోమేషన్‌కు గల అవకాశాలు, ప్రభావితమయ్యే ఉద్యోగాలు, కారణాలను ఆస్పైరింగ్‌ మైండ్స్‌ విశ్లేషించింది.
 
అధ్యయనం జరిగిందిలా
ముందుగా గ్రాడ్యుయేషన్‌ అర్హత ఉన్న 30 జాబ్‌ రోల్స్‌, వారికి అవసరమైన నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుంది. తరవాత వీటిల్లో ఆటోమేషన్‌కు గల అవకాశాలు, ఆ ఉద్యోగాల నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలను ఏవిధంగా ఆటోమేషన్‌ ప్రక్రియతో అనుసంధానించవచ్చు అనే అంశాలను విశ్లేషించింది. ఇందుకోసం వివిధ జాబ్‌ లిస్టింగ్‌ వెబ్‌సైట్స్‌ ద్వారా 10 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఆన్‌లైన్‌లో ఆటోమేటెడ్‌ సర్వేను చేపట్టింది. అధిక శాతం ఉద్యోగ బాధ్యతలను ఆటోమేటెడ్‌ టూల్స్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. కొంత సంక్షోభం ఉన్నప్పటికీ సామర్థ్యం ద్వారానే దీన్ని అధిగమించవచ్చని తెలిపింది.
 
ఉద్యోగాలు పోతాయా?
దశాబ్ధాల కిందట కంప్యూటర్‌ రాకను వ్యతిరేకించిన వారున్నారు. కంప్యూటర్‌ ప్రవేశంతో దేశంలో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరించింది. ప్రపంచంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగానికి మనదేశం హబ్‌గా మారింది. 31 శాతం మంది ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ద్వారానే ఉపాధి పొందుతున్నారు. టెక్నాలజీ రంగంలో పరిశోధనల వల్ల ఎన్నో నూతన ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆటోమేషన్‌ కూడా ఇందులో భాగమే. ఆటోమేషన్‌ ద్వారా వేగంగా, కచ్చితత్వంతో సేవలు అందించడం సాధ్యమైంది. అలాగే ఆటోమేషన్‌ లేదా ఏదైనా ఆవిష్కరణ అందుబాటులోకి వచ్చినప్పుడు.. వస్తువలు, సేవలు చౌకగా లభిస్తాయి. దాంతో ఆయా వస్తువులు, సేవలకు డిమాండ్‌ పెరుగుతుంది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేసే క్రమంలో కొన్ని వేల కొత్త ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఉద్యోగాలను కోల్పోతామనే భావన సరికాదు. ఆటోమేషన్‌ ప్రభావం కేవలం కొన్ని రంగాల్లో పరిమితంగానే ఉంటుంది. అదే సమయంలో నూతన అవకాశాలకు కూడా బాట వేస్తుంది. వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
 
ఆటోమేషన్‌ వల్ల ప్రభావితమైన రాష్ర్టాలు
రాష్ట్రం           కోల్పోయిన ఉద్యోగాల శాతం
ఢిల్లీ                 45.1
పశ్చిమ బెంగాల్‌ 42.2
హర్యానా 39.3
ఉత్తరప్రదేశ్‌ 39
రాజస్థాన్‌ 37.8
మధ్యప్రదేశ్‌ 37.8
కర్ణాటక 37.8
తమిళనాడు 37.6
తెలంగాణ 37.5
ఆంధ్రప్రదేశ్‌ 37.2
మహారాష్ట్ర 18
 
సాఫ్ట్‌గా ఎదుర్కోవాలి!
ఆటోమేషన్‌ ద్వారా కొన్ని రంగాల్లో ఉద్యోగాలను కోల్పోవడం అనేది తాత్కాలికం మాత్రమే. భవిష్యత్తులో ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వాటిని అందుకోవాలంటే మాత్రం ఉద్యోగార్థులు కొన్ని రకాల సాఫ్ట్‌ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. అవి.. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, టీమ్‌ వర్క్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ వంటివి. నూతన అవకాశాలతోపాటు జాబ్‌ మార్కెట్‌లో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా ఈ నైపుణ్యాలు ఉపకరిస్తాయి.
సృజనాత్మకత, పీపుల్‌ మేనేజ్‌మెంట్‌, వ్యూహ రచన వంటి నైపుణ్యాలు అవసరమైన రంగాల్లో ఆటోమేషన్‌ అసాధ్యం. అలాంటి బాధ్యతలను నిర్వహించడానికి సాఫ్ట్‌స్కిల్స్‌ ఎంతో అవసరం.
 
ఆటోమేషన్‌ అవకాశాలు తక్కువగా ఉండే జాబ్‌ రోల్స్‌...
డేటా అనాలిసిస్‌
మార్కెటింగ్‌
హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌
జనరల్‌ మేనేజ్‌మెంట్‌
ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐటీ, ఇంజనీరింగ్‌ తదితర విభాగాలు)
 
కస్టమర్‌ సర్వీస్‌లో...
మెషీన్‌ లెర్నింగ్‌, రోబోటిక్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌... ఇవన్నీ ఆటోమేషన్‌లో భాగం. ఆటోమేషన్‌ కారణంగా ఐటీ, సాఫ్ట్‌వేర్‌, కస్టమర్‌ సర్వీస్‌ రంగంలోని ఉద్యోగాలు కొంత ప్రభావానికి గురవుతున్నాయి. కస్టమర్‌ సర్వీస్‌ విభాగంలో ఆటోమేషన్‌ వినియోగం అధికంగా ఉంది (64 శాతం). ఎందుకంటే ఈ విభాగంలో ఒకే విధమైన పనిని పదేపదే చేయాల్సి ఉంటుంది. దాంతో ఇలాంటి విధులను ఆటోమేషన్‌ ద్వారా నిర్వర్తించడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. రంగాల వారీగా ఆటోమేషన్‌ ప్రభావాన్ని పరిశీలిస్తే..
 
రంగం   శాతం
అకౌంటింగ్‌ 61
అనలిటిక్స్‌ అండ్‌ కన్సల్టింగ్‌ 35
కోర్‌ ఇంజనీరింగ్‌ 27
కస్టమర్‌ సర్వీస్‌ 64
జనరల్‌ మేనేజ్‌మెంట్‌ 14
మార్కెటింగ్‌ 21
ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ 53
సేల్స్‌ 39
సాఫ్ట్‌వేర్‌ అండ్‌ ఐటీ 42
 
సృజనాత్మకత, తార్కిక విశ్లేషణ అవసరం ఉండే రంగాలపై ఆటోమేషన్‌ ప్రభావం నామమాత్రంగా ఉంది. ఉదాహరణకు మార్కెటింగ్‌ విభాగాన్ని తీసుకుంటే ఇందులో ఆటోమేషన్‌కు అవకాశాలు 21 శాతం మాత్రమే. సృజనాత్మకత, విభిన్నమైన ఆలోచనలు, తార్కిక వివేచన వంటివి మార్కెటింగ్‌ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించడానికి చాలా అవసరం. ఇలాంటి బాధ్యతలను మనుషులే సమర్థంగా నిర్వర్తిస్తారు. కాబట్టి మార్కెటింగ్‌ రంగంపై ఆటోమేషన్‌ ప్రభావం చాలా స్వల్పం.
పీపుల్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ అవసరమైన రంగాల్లో కూడా ఆటోమేషన్‌ ప్రభావం స్వల్పంగానే ఉంది. ఈ రంగానికి అవసరమైన నైపుణ్యాలను ఆటోమేషన్‌తో భర్తీ చేయడం ప్రస్తుతా నికి అసాధ్యం. ఫలితంగా జనరల్‌ మేనేజ్‌మెంట్‌ (14 శాతం), సేల్స్‌ (39 శాతం) విభాగాల్లో ఆటోమేషన్‌ అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
కస్టమర్‌ సర్వీస్‌ రంగంలో నిత్యం ప్రజలతో వ్యవహారాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఒకే విధమైన పనిని మళ్లీ మళ్లీ చేయాల్సి ఉంటోంది. ఇలాంటి బాధ్యతలను నిర్వర్తించడానికి పెద్దగా నైపుణ్యాలు అవసరం లేదు. ఉదాహరణకు ఆస్పత్రులకు లేదా ఇతర సంస్థలకు ఫోన్‌ చేస్తే ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సూచనలు ఇవ్వడం. ఫలితంగా కస్టమర్‌ సర్వీస్‌ విభాగంలో మూడో వంతు ఉద్యోగాలపై ఆటోమేషన్‌ ప్రభావం చూపిస్తుంది.
కోర్‌ ఇంజనీరింగ్‌ విభాగాలైన మెకానికల్‌, ఎలక్ర్టికల్‌, ఎలక్ర్టానిక్స్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌లలో ఆటోమేషన్‌ ప్రభావం స్వలంగా ఉంది. వీటిల్లో ఆటోమేషన్‌కు చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే సంబంధిత విధుల నిర్వహణలో తార్కిక సామర్థ్యం, సమస్యా పరిష్కార నైపుణ్యం ఉన్న మానవ వనరుల పాత్ర కీలకం. దాంతో ఆటోమేషన్‌ ప్రభావం నామమాత్రంగానే ఉంటోంది. ఉదాహరణకు ఏదైనా సంస్థ ఉత్పాదక శక్తిని మరింత పెంచాలంటే మొత్తం వ్యవస్థపై సమగ్ర అవగాహన ఉండాలి. వినూత్న ఆలోచనలను అమలు చేసే నేర్పుగల నిపుణులు కావాలి. ఇది ఆటోమేషన్‌తో అసాధ్యం. దీంతో కోర్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆటోమేషన్‌కు దూరంగానే నిలిచిపోయింది.
 
అకౌంటింగ్‌, అనలిటిక్స్‌ రంగాల్లో..
డేటాను సేకరించడం, నిల్వ చేయడం, ప్రాసెసింగ్‌ వంటి కార్యకలాపాలను ఆటోమేషన్‌ ద్వారా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. తదనుగుణంగా విధులను నిర్వహించే వివిధ రకాల సాఫ్ట్‌వేర్లు అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం. అకౌంటింగ్‌, అనలిటిక్స్‌ రంగాల్లో డేటా సేకరణ, నిల్వ, ప్రాసెస్‌ వంటి కార్యకలాపాలే ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ విభాగాల్లో ఆటోమేషన్‌ ఎక్కువగా జరుగుతోంది. అయితే డేటాను విశ్లేషించడం, దాని ఆధారంగా భవిష్యత్‌ అంచనాలను రూపొందించే విభాగాలు ప్రస్తుతం ఆటోమేషన్‌కు దూరంగానే ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ రంగంలో కూడా మావన ప్రమేయం లేకుండా అనేక కార్యకలాపాలను నిర్వహించవచ్చు. కార్యకలాపాలను విస్తరించడానికి, అనుసంధానం చేయడానికి మాత్రం మానవ ప్రమేయంం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో కీలకమైన వ్యూహ రచన, అమలు, ఉద్యోగుల నిర్వహణ వంటివాటిని ఆటోమేషన్‌తో నిర్వర్తించడం సులభం కాదు. దాంతో ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఆటోమేషన్‌కు దూరంగానే నిలిచింది.