చదువు + ఉద్యోగానికి రక్షణ JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
చదువు + ఉద్యోగానికి రక్షణ
భిన్నంగా ఆలోచించే మనస్తత్వం, దేశానికి సేవ చేయాలనే ఆసక్తి ఉన్న వారికి చక్కని అవకాశం కల్పిస్తోంది ఎన్‌డిఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామ్‌ (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ ఎగ్జామినేషన్‌). ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఒక చేత్తో డిగ్రీ, మరో చేత్తో క్లాస్‌-1 ఆఫీసర్‌గా త్రివిధ దళాల్లో కెరీర్‌ ప్రారంభించే చక్కని అవకాశం సొంతమవుతుంది. ఎన్‌డిఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామ్‌ (I) - 2018 నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
 
మొత్తం ఖాళీలు: 415 (అభ్యర్థులు ఏ విభాగానికి ప్రాధాన్యం ఇస్తున్నారో ముందే తెలియజేయాలి).
 
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ: 360 (ఆర్మీ-208, నేవీ-60, ఎయిర్‌ఫోర్స్‌ - 92)
నేవల్‌ అకాడమీ (10 + 2 కేడెట్‌ ఎంట్రీ స్కీమ్‌): 55
 
అర్హత: ఆర్మీ వింగ్‌ - 12వ తరగతి / తత్సమానం.
ఎయిర్‌ఫోర్స్‌, నేవల్‌ వింగ్‌ - 10 + 2 విధానంలో మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌లతో 12వ తరగతి /తత్సమానం.
చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే.
అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
 
వయసు: 16 నుంచి 18 ఏళ్లు (జూలై 2, 1999 - జూలై 1, 2002 మధ్య జన్మించి ఉండాలి).
ఎంపిక ఇలా: ఎంపిక విధానంలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో రాత పరీక్ష, రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు దశలకు కలిపి మొత్తం మార్కులు 1800.
రాత పరీక్షలో రెండు పేపర్లు
ఎంపిక ప్రక్రియలో నిర్వహించే రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్‌ - 1, పేపర్‌ - 2. ఈ రెండు పేపర్లకు కలిపి కేటాయించిన మొత్తం మార్కులు 900. నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి.
పేపర్‌ - 1: ఇందులో మేథమెటిక్స్‌ నుంచి 120 ప్రశ్నలు ఇస్తారు. వీటికి 150 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. కేటాయించిన మార్కులు 300. అంటే ప్రతి ప్రశ్నకు 2.5 మార్కులు. ఇందులో అల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మాత్రికలు, అనలిటికల్‌ జ్యామెట్రీ, డిఫరెన్షియల్‌ కాలిక్యులస్‌, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్‌, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, వెక్టర్‌ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్‌, ప్రొబబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
పేపర్‌ - 2: ఇది జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌. ఇందులోని 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. కేటాయించిన మార్కులు 600. అంటే ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ను రెండు విభాగాలుగా విభజించారు. మొదటి విభాగంలో ఇంగ్లీష్‌ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 200. ఇందులో గ్రామర్‌, వొకాబులరీ, కాంప్రెహెన్షన్‌, యూజ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండో విభాగంలో జనరల్‌ నాలెడ్జ్‌ ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఇస్తారు. వీటికి కేటాయించిన మార్కులు 400. ఇందులో సెక్షన్‌-ఎ ఫిజిక్స్‌, సెక్షన్‌-బి కెమిస్ర్టీ, సెక్షన్‌-సి జనరల్‌ సైన్స్‌, సెక్షన్‌-డి హిస్టరీ, భారత స్వాతంత్రోద్యమం, సెక్షన్‌-ఇ జాగ్రఫి, సెక్షన్‌-ఎ్‌ఫ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తంగా చూస్తే ప్రశ్నలలో సెక్షన్ల వారీగా ఎ-25 శాతం (100 మార్కులు), బి-15 శాతం (60 మార్కులు), సి-10 శాతం (40 మార్కులు), డి-20 శాతం (80 మార్కులు), ఇ-20 శాతం (80 మార్కులు), ఎఫ్‌-10 శాతం (40 మార్కులు) వెయిటేజీని కలిగి ఉంటాయి.
 
ప్రిపరేషన్‌
మేథమెటిక్స్‌ కోసం 6 - 10వ తరగతి మేథ్స్‌ పుస్తకాల్లోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకోవాలి. అందులోని సూత్రాలను, ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. వీలైనంత ఎక్కువగా మోడల్‌ ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. ఇదే క్రమంలో షార్ట్‌కట్‌ మెథడ్స్‌ నేర్చుకోవాలి.
జనరల్‌ ఎబిలిటీ విభాగం కోసం రోజూ తెలుగు, ఆంగ్ల దినపత్రికలను చదవాలి.
ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, జనరల్‌ సైన్స్‌, హిస్టరీ, భారత స్వాతంత్ర్యోద్యమం, జాగ్రఫీ కోసం ఆయా సబ్జెక్ట్‌ల వారీగా ఎన్‌సిఈఆర్‌టి 11, 12వ తరగతి పుస్తకాలను చదవాలి.
ఇంగ్లీ్‌షలో గ్రామర్‌పై ఎక్కువగా దృష్టి సారించాలి.
మోడల్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
 
ఎస్‌ఎస్‌బి ఇంటర్వ్యూ
రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికైన వారికి రెండో దశలో ఎస్‌ఎస్‌బి (సర్వీస్‌ సెలెక్షన్‌ బోర్డ్‌) ఇంటర్వ్యూ ఐదు రోజులపాటు ఉంటుంది. ఈ దశకు కేటాయించిన మార్కులు 900. ఇందులో ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన వారికి ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీతోపాటు పైలట్‌ ఆప్టిట్యూడ్‌ బ్యాటరీ టెస్ట్‌ (పిఎబిటి) ఉంటుంది. ఎస్‌ఎ్‌సబి ఇంటర్వ్యూలో మొదటి దశలో ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రేటింగ్‌ టెస్ట్‌లో భాగంగా వెర్బల్‌ - నాన్‌ వెర్బల్‌ టెస్ట్‌, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ ఉంటాయి. రెండో దశలో సైకలాజికల్‌ టెస్ట్‌లు, గ్రూప్‌ ఆఫీసర్‌ టాస్క్‌లు, ఇంటర్వ్యూ, కాన్ఫరెన్స్‌ ఉంటాయి. సైకలాజికల్‌ టెస్ట్‌లో థిమాటిక్‌ అప్రిసియేషన్‌ టెస్ట్‌, వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌, సిచ్యూవేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌, సెల్ఫ్‌ డిస్ర్కిప్షిన్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. గ్రూప్‌ ఆఫీసర్‌ టాస్క్‌లో గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ ప్లానింగ్‌ ఎక్సైజ్‌, హాఫ్‌ గ్రూప్‌ టాస్క్‌, ఇండివ్యూడ్వల్‌ అబ్‌స్టకల్‌, కమాండ్‌ టాస్క్‌, స్నేక్‌ రేస్‌/గ్రూప్‌ అబ్‌స్టకల్‌ రేస్‌, ఇండివిడ్యువల్‌ లెక్చర్‌, ఫైనల్‌ గ్రూప్‌ టాస్క్‌ ఉంటాయి. తరవాత ఇంటర్వ్యూ, అటుపై కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. చివరగా మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే వారు ఎంపిక చేసుకున్న విభాగాన్ని కేటాయిస్తారు.
 
శిక్షణ ఇలా
ఎంపికైన అభ్యర్థులకు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో వారు ఎంచుకున్న ప్రాధాన్యం మేరకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన ప్రాథమిక శిక్షణనిస్తారు. ఇది మూడేళ్లు ఉంటుంది. ఇందులో రెండున్నరేళ్లు అందరికీ కామన్‌. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ - న్యూఢిల్లీ బ్యాచిలర్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
 
ఎన్‌డీఏ తరవాత
ఎన్‌డీఏ శిక్షణ తరవాత ఆర్మీ క్యాడెట్‌లను డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీకి పంపిస్తారు. అక్కడ వారికి సంవత్సరంపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వీరికి నెలకు రూ.21,000 స్టయిఫండ్‌గా చెల్లిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేస్తే లెఫ్టినెంట్‌ హోదాలో పర్మనెంట్‌ కమిషన్‌ కింద తీసుకుంటారు. రూ. 60 వేల వేతనంతో కెరీర్‌ ప్రారంభమవుతుంది.
నావెల్‌ క్యాడెట్‌లను కేరళ ఎజిమలాలోని నావెల్‌ అకాడమీకి పంపుతారు. ఇక్కడ సంవత్సరంపాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో వీరికి నెలకు రూ.21,000 స్టయిఫండ్‌గా చెల్లిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేేస్త సబ్‌ - లెఫ్టినెంట్‌ హోదాలో నియమిస్తారు. రూ. 60 వేల వేతనంతో కెరీర్‌ ప్రారంభమవుతుంది.
ఎయిర్‌ ఫోర్స్‌ క్యాడెట్‌లను హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి పంపుతారు. ఇక్కడ వీరికి ఏడాదిన్నరపాటు ఫ్లయింగ్‌ ట్రెయినింగ్‌ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ.21,000 స్టయిఫండ్‌గా చెల్లిస్తారు. తర్వాత వీరిని ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ ర్యాంక్‌ హోదాతో సర్వీసులోకి తీసుకుంటారు. ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైనవాళ్లు పైలట్‌గా విధులు నిర్వర్తిస్తారు. రూ. 60 వేల వేతనంతో కెరీర్‌ ప్రారంభమవుతుంది.
 
గత ఐదు పరీక్షల కటాఫ్‌ మార్కులు
సంవత్సరం   రాత పరీక్ష రాత పరీక్ష + ఎస్‌ఎస్‌బి ఇంటర్వ్యూ
2015 (1)       306                               674
2015 (2)       269                               637
2016 (1)       288                               656
2016 (2)       229                               602
2017 (1)       342                               708
 
ఉపయోగపడే పుస్తకాలు
NDA / NA Topic wise Solved Papers - Disha Publications.
Pathfinder for NDA & NA Entrance Examination.
Manorama Yearbook 2018.
NCERT 11, 12th Class Books.
Objective General English for Competitive Exams by S.P. Bakshi.
Objective General Knowlegde & Current Affairs (Level 1, Level 2) - Disha Publications.
 
ముఖ్య సమాచారం
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2018.
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 22, 2018.
వెబ్‌సైట్‌: upsc.gov.in