ఉద్యోగానికి తొలి మెట్టు.. ఇంటర్న్‌షిప్‌ JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఉద్యోగానికి తొలి మెట్టు.. ఇంటర్న్‌షిప్‌
ప్రస్తుతం ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ చేయడం తప్పనిసరిగా మారింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జాబ్‌ రెడీ స్కిల్స్‌, రియల్‌ టైం ఎక్స్‌పీరియన్స్‌ను అందించేవి ఇంటర్న్‌షిప్స్‌. తరగతి గదుల్లో బోధించిన అంశాలను వాస్తవ పరిస్థితులకు అన్వయించగలిగే అవకాశం ఇంటర్న్‌షిప్స్‌ ద్వారా లభిస్తుంది. సంబంధిత రంగంలోని ఆధునిక ధోరణులపై అవగాహన ఏర్పడుతుంది. కోర్సు పూర్తయ్యే నాటికి ఇండస్ర్టీ రెడీగా తీర్చిదిద్దుకునేందుకు ఇంటర్న్‌షిప్స్‌ మంచి వేదిక. అందుకే ఇంటర్న్‌షిప్స్‌ను ఉద్యోగానికి మొదటి మెట్టుగా భావిస్తున్నారు. కెరీర్‌పరంగా నిర్ణయాత్మక మలుపుగా నిలుస్తోన్న ఇంటర్న్‌షిప్స్‌ గురించి తెలుసుకుందాం..
 
విద్యార్థులకు, ఇటీవలే చదువు పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లకు, కెరీర్‌ మార్పు దిశగా ఆలోచిస్తున్న వారికి సంబంధిత రంగంలోని వాస్తవిక పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ఇంటర్న్‌షిప్స్‌ తోడ్పడతాయి. వీటి వ్యవధి సాధారణంగా ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు ఉంటుంది. చాలా వరకు కంపెనీలు సమ్మర్‌లో ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్‌ చేస్తుంటాయి. అంటే వేసవి సెలవుల్లో తమ సంస్థల్లో ఇంటర్న్‌గా తీసుకుంటున్నాయి. అలాంటి కంపెనీలను గుర్తించి ఇప్పటి నుంచే వాటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కోర్సుల్లో ఇంటర్న్‌షిప్స్‌ అకడమిక్‌ షెడ్యూల్‌లో భాగంగా ఉంటాయి. మరికొన్ని కోర్సుల్లో ఇంటర్న్‌షిప్స్‌కు క్రెడిట్‌ స్కోర్‌ కూడా ఇస్తున్నారు. వీటి ద్వారా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. కొద్ది రోజుల పాటు వాస్తవ పని వాతావరణం, పరిస్థితుల గురించి అనుభవ పూర్వకంగా తెలుసుకోవడం, అవసరమైన నైపుణ్యాలపై అవగాహన పొందడం వంటి అంశాలు ఇంటర్న్‌షిప్‌ను ప్రయోజనకరంగా మారుస్తున్నాయి. అంతేకాకుండా కంపెనీలు ఇంటర్న్‌గా చేరినవారి సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తాయి. అవసరమైన ప్రతిభ ఉందంటే ఉద్యోగావకాశం కూడా కంపెనీలు కల్పిస్తున్నాయి.
 
అవకాశం ఉన్న విభాగాలు: బీఈ / బీటెక్‌, ఎంసీఏ / పీజీడీసీఏ, ఎంబీఏ, లా, గ్రాడ్యుయేషన్‌ (బీసీఏ, బీకామ్‌ తదితరాలు), పీజీ (ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, తదితరాలు)
ఆఫర్‌ చేస్తున్న రంగాలు: ఐటీ / ఐటీఈఎస్‌, మాన్యుఫాక్చరింగ్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, కన్సల్టింగ్‌ సంస్థలు, ఆర్‌ అండ్‌ డీ.
 
ప్రయోజనాలివే
ఒక అభ్యర్థి ఇంటర్న్‌గా చేరిన తర్వాత వారి పనితీరు, దృక్పథం ఆధారంగా ఉద్యోగం కల్పించే వెసులుబాటు కంపె నీలకు లభిస్తుంది. పని, వాతావరణం, సంస్థ విధానాలు అన్నీ కుదిరితేనే ఉద్యోగంలో చేరే అవకాశం అభ్యర్థులకు ఉంటుంది. ఉద్యోగికి కావాల్సిన అర్హతలు, లక్షణాలు పెంపొందించుకోవడంతోపాటు, వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి ఇంటర్న్‌షిప్‌ ఉపకరిస్తుంది. సంబంధిత విభాగంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై అవ గాహన ఏర్పడుతుంది. సీనియర్లతో కలసి పని చేయడం వల్ల ప్రాక్టికల్‌ నైపుణ్యాలను పెంచుకునే వీలుంటుంది.
 
కంపెనీలు ఎందుకు ప్రోత్సహిస్తాయి?
రోజువారీ బాధ్యతల కారణంగా డిపార్ట్‌మెంట్‌ హెడ్స్‌ / మేనేజర్లు వారికి వచ్చిన వినూత్న ఆలోచనలను అమలు చేయడం ఒక్కోసారి సాధ్యం కాదు. అలాంటి ఆలోచనలపై పని చేయడం, వాటి ద్వారా ఎదురయ్యే పరిస్థితులను పరిశీలించడానికి కంపెనీలు ఇంటర్న్‌గా చేరినవారి సేవలను వినియోగించు కుంటాయి. అంతేకాకుండా ఇంటర్న్‌ ఫ్రెష్‌ మైండ్‌తో ఉంటారు. తద్వారా సంబంధిత రంగంలో సృజనాత్మక ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇవి నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తాయి. కాబట్టి కంపెనీలు కూడా ఇంటర్న్‌షిప్స్‌ను ప్రోత్సహిస్తాయి.
 
ఒక సంస్థలో చాలా ప్రాజెక్ట్‌లు ఉంటాయి. వీటిని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి. అయితే ఇందుకు తగిన సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రతిభావంతులైన ఇంటర్న్స్‌ను ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి కంపెనీలు వినియోగించు కుంటాయి. తద్వారా ఇంటర్న్‌ ప్రతిభను పరీక్షించే అవకాశం కూడా కంపెనీలకు ఉంటుంది.
చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతి సంస్థకు నేడు బ్రాండింగ్‌ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకోవడానికి కూడా ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్‌ చేస్తుంటాయి.
 
తమకు కావల్సిన ప్రతిభావంతులను రిక్రూట్‌ చేసుకునే క్రమంలో ఇంటర్న్‌షిప్స్‌ను కంపెనీలు ఒక మార్గంగా భావిస్తాయి. అవసరమైన నైపుణ్యాలు, ఇంటర్న్‌షిప్‌ సమయంలో పనితీరు, దృక్పథం, చురుగ్గా కంపెనీ సంస్కృతిలో కలిసిపోవడం వంటి అంశాలను కంపెనీలు ఇంటర్న్‌లో నిశితంగా గమనిస్తాయి. ఈ సమయంలో తమ స్కిల్స్‌తో ఆకట్టుకునేవారికి ఉద్యోగావకాశం కూడా కంపెనీలు కల్పిస్తాయి.
 
ఇలా చేయాలి..
 • నైపుణ్యాలను, ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఎక్కువ అవకాశాలను కల్పించే సంస్థలను ఎంపిక చేసుకోవాలి.
 • అప్పగించిన బాధ్యతను పూర్తి చేేసందుకు నూతనంగా ఆలోచించాలి.
 • సమస్యను పరిష్కరించే క్రమంలో ఏవైనా సందేహాలు వస్తే ఎటువంటి సంకోచం లేకుండా సీనియర్ల సలహాలు తీసుకోవాలి.
 • ఇంటర్న్‌షిప్‌లో ఎన్నో కార్యకలాపాలు ఉంటాయి. కాబట్టి చిన్న, పెద్దా అని తేడా లేకుండా ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించడానికి ప్రయత్నించాలి. ఇంటర్న్‌గా రోజువారీగా నిర్వహించిన కార్యకలాపాలను రికార్డ్‌ చేసుకోవడం ప్రయోజన కరం.
 • ఇంటర్‌ పర్సనల్‌ బిహేవియర్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
 • ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రొఫెసర్లు, ఇండస్ర్టీ నిపుణుల సహకారం తీసుకోవాలి.
 • స్టయిపెండ్‌ గురించి ఆలోచించకుండా మంచి ఇంటర్న్‌షిప్‌ అవకాశం ఉంటే చేసేందుకు సిద్థంగా ఉండాలి.
ప్రాధాన్యం వీటికే..
దరఖాస్తు చేసుకున్న అందరకీ ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం రాదు. కంపెనీలు దరఖాస్తుదారుల్లోని నైపుణ్యాలను పరిశీలించి మరీ ఇంటర్న్‌గా చేరేందుకు అంగీకరిస్తాయి. ఇందుకు పరిగణనలోకి తీసుకుంటున్న అంశాలు..
 • ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా, ఫెక్సిబుల్‌ ఆటిట్యూడ్‌తో ఉండే వారికి ఇంటర్న్‌గా అవకాశం లభిస్తుంది. ఎందుకంటే ఇటువంటి వారిని అవసరాలకు అనుగుణంగా సులువుగా తీర్చిదిద్దుకోవచ్చనే భావనలో కంపెనీలు ఉంటాయి.
 • అప్పగించిన బాధ్యతలను సరిగా నిర్వహించే సామర్థ్యం ఉందా లేదా అనే అంశం కూడా నిర్ణయాత్మకంగా మారుతుంది. ఇంటర్న్‌షిప్‌ సమయంలో విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలను మెరుగుపరుచుకునే నేర్పు ఉందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు. ఎందుకంటే ఇంటర్న్‌గా అవకాశం కల్పించడానికి కంపెనీ ఎంతో సమయం, డబ్బు వెచ్చిస్తుంది. కాబట్టి ఆ సమయంలో కంపెనీతోపాటు ఇంటర్న్‌గా ప్రయోజనం పొందాలనే ఉద్దేశం దాగి ఉంటుంది. సీరియస్‌నెస్‌ ఉన్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తారు.
 • ఇచ్చిన పనిని బాధ్యతాయుతంగా నిబద్ధతతో నిర్వర్తించే లక్షణం ఉన్న వారికే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సంస్థకు చెందిన డేటాను తస్కరించడం లేదా నష్టపరచడం వంటి పనులను ఇంటర్న్‌లు చేస్తుంటారు. ఇలాంటి అంశాల జోలికి వెళ్లకుండా ఇచ్చిన పనిని సమర్థంగా నిర్వహించేవారిని ఇంటర్న్‌గా తీసుకుంటాయి.
ఎలా ఎంచుకోవాలి
 • ఇంటర్న్‌షిప్‌ చేయడానికి ఒక కంపెనీ / సంస్థను ఎంచుకునే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి..
 • ముందుగా చేరబోయే కంపెనీ గురించి సమగ్ర అవగాహన ఏర్పర్చుకోవాలి.
 • పనితీరు, స్టయిఫండ్‌ వంటి విషయాల్లో స్పష్టతతో ఉండాలి. ఒక ఇంటర్న్‌గా కంపెనీ నుంచి ఏమి ఆశిస్తున్నారు, కంపెనీ మీ నుంచి ఏమి కోరుకుంటుంది వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి.
 • ఇంటర్న్‌గా చేరే ముందు కాలేజీ, సంబంధిత ఫ్యాకల్టీ అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇంటర్న్‌షిప్‌ ద్వారా క్రెడిట్స్‌ లభిస్తాయి.
ఇలా తెలుసుకోవాలి
ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్‌ చేస్తున్న కంపెనీల గురించి తెలుసుకోవడానికి చాలా మాధ్యమాలు ఉన్నాయి. ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు..
 
ఆసక్తి - ప్రదేశం: ఆసక్తి ఉన్న అంశం, చేయాలనుకుంటున్న ప్రదేశం (లోకేషన్‌) ఆధారంగా కంపెనీల / ఎంప్లాయర్స్‌ జాబితాను సిద్ధం చేసుకోవాలి. అందులోంచి ఆసక్తికి అనుగుణంగా ఉండడంతోపాటు సంబంధిత రంగంలోని ఉద్యోగాలను, ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్‌ చేస్తున్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆయా కంపె నీలు నిర్దేశించిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.
 
కెరీర్‌ పోర్టల్స్‌/ బ్లాగ్స్‌/ వెబ్‌సైట్స్‌: ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇంటర్న్‌షిప్స్‌ గురించి సమాచారాన్ని అందజేసే ఎన్నో వెబ్‌సైట్స్‌ / బ్లాగ్స్‌/ పోర్టల్స్‌, ఆన్‌లైన్‌ ఫోరమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఇంటర్న్‌షిప్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అవసరమైతే రిఫరెన్స్‌ను కూడా ఇవి ఇస్తాయి. ఆన్‌లైన్‌ జాబ్‌లిస్టింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా కంపెనీలు ఇంటర్న్‌షిప్స్‌ కోసం ప్రకటనలను జారీ చేస్తుంటాయి. వీటి ద్వారా నేరుగా కంపెనీలకే దరఖాస్తు చేసుకునే లింక్‌ కూడా ఉంటుంది. ఇలాంటి వెబ్‌సైట్స్‌ను తరుచూ వీక్షిస్తుండాలి. వీటిలో రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే సంబంధిత వివరాలను అలర్ట్స్‌ రూపంలో పంపిస్తుంటాయి.
 
కాలేజీ - నెట్‌వర్క్‌: కాలేజీలోని కెరీర్‌ సర్వీస్‌ విభాగం / ప్లేస్‌మెంట్‌ ఆఫీస్‌ ద్వారా ఇంటర్న్‌షిప్స్‌ సమాచారాన్ని పొందొచ్చు. అదేవిధంగా కాలేజీ ఆలుమ్ని, ప్రొఫెసర్లు ఇలా మనకు తెలిసిన వారందరితో నిత్యం ఈ విషయం గురించి సంభా షిస్తూ ఉండాలి. తద్వారా ఏదైనా అవకాశం ఉంటే రిఫర్‌ చేస్తారు.
 
సెర్చింగ్‌: పరిశోధనల్లో నిమగ్నమైన సంస్థలు తరచుగా ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్‌ చేస్తుంటాయి. గూగుల్‌, యాహు వంటి సెర్చ్‌ ఇంజిన్ల ద్వారా సమాచారాన్ని పొందొచ్చు. నాస్కామ్‌, సీఐఐ, వంటి సంస్థల వెబ్‌సైట్ల ద్వారా ఇంటర్న్‌షిప్స్‌ గురించి తెలుసుకోవచ్చు.