కొత్త సంవత్సరంలో టాప్-10 కొలువులు JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
కొత్త సంవత్సరంలో టాప్-10 కొలువులు
2018 వచ్చేసింది. తనతోపాటే ఎన్నో ఆశలను మోసుకు వచ్చింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పుడల్లా మనకు కొంత ప్రేరణ, స్ఫూర్తి లభిస్తుంటాయి. దీన్ని పునాదిగా చేసుకొని నూతన సంవత్సరంలో కెరీర్‌కు బాటలు వేసుకోవాలి. విద్య, ఉద్యోగ రంగాల్లో వేగంగా వస్తోన్న పరిణామాలు కొత్త అవకాశాలకు తెరదీస్తున్నాయి. ఇంజనీరింగ్‌, సైన్సెస్‌, కామర్స్‌, లా... ఇలా అనేక విభాగాల్లో ఆధునిక అవకాశాలు వస్తున్నాయి. సాంప్రదాయ కెరీర్‌లుగా భావించే టీచింగ్‌, లా, ప్రభుత్వ ఉద్యోగాలు కొత్త హవాను సృష్టిస్తు న్నాయి. ఈ నేపధ్యంలో నూతన సంవత్సరంలో ఉద్యోగార్థులకు మంచి అవకాశాలను అందించనున్న టాప్‌ 10 రంగాలపై విశ్లేషణ...
 
కొత్త కెరటం.... డేటా ఎనలిటిక్స్‌
నూతన సంవత్సరంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంబంధిత రంగంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలనుకుంటే మొదట ప్రాధాన్యం ఇవ్వాలిన ఆప్షన్‌ డేటా అనలిటిక్స్‌. డిజిటలైజేషన్‌ వల్ల వివిధ రంగాల్లో లావాదేవీలన్నీ కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌ల వంటి వాటి ద్వారా ఆన్‌లైన్‌లో, ఎలక్ర్టానిక్‌ పద్థతిలో జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో నమోదవుతున్న డేటాను ేసకరించడం, నిల్వ (స్టోర్‌) చేయడం, ప్రాసెస్‌ చేయడం, విశ్లేషించడం వంటి వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడానికి ఆయా కంపెనీలకు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు నిపుణులు అవసరం. ఈ తరహా నిపుణులను తయారు చేయడానికి ఉద్దేశించిన ప్రక్రియే డేటా అనలిటిక్స్‌.
 
బ్యాంకులు, ఐటీ ేసవలు, ఎడ్యుకేషన్‌, ట్రావెల్‌ అండ్‌ హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్‌, రియల్‌ ఎస్టేట్‌, సూపర్‌ మార్కెట్‌, ఈ-కామర్స్‌, టెలికం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, సంస్థలతోపాటు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, జెన్‌ప్యాక్ట్‌, టీసీఎస్‌, ఐబీఎం, విప్రో, డెల్‌ వంటి ఐటీ సంస్థలు డేటా అనలిటిక్స్‌ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఐఐఎం- బెంగళూరు (వెబ్‌సైట్‌: iimb.ac.in/), ఐఐఎం- కోల్‌కతా (వెబ్‌సైట్‌: www.iimcal.ac.in/), ఐఐఎం- లక్నో (వెబ్‌సైట్‌: www.iiml.ac.in), ఐఐఎం- రాంచీ, ఐఐటీ- హైదరాబాద్‌ (వెబ్‌సైట్‌: www.iith.ac.in) డేటా అనలిటిక్స్‌ కోర్సులను అందిస్తున్నాయి.
 
సర్వీస్‌ కమిషన్‌ల హవా
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కెరీర్‌ ప్రారంభించడానికి చక్కని అవకాశం కల్పిస్తోంది యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ). ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఇంజనీర్‌, డాక్టర్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ వంటి కొలువులతోపాటు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, త్రివిధ దళాలకు కావల్సిన వేలాది అధికారుల నియామక ప్రక్రియను యూపీఎస్సీ పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ కోసం క్యాలెండర్‌ విధానాన్ని అనుసరిస్తుంది. అందులో పేర్కొన్న విధంగానే నోటిఫికేషన్లు విడుదలవుతాయి.
 
నూతన సంవత్సరంలో యూపీఎస్సీ నుంచి తొలి నోటిఫికేషన్‌ జనవరి 10న (ఎన్‌డీఏ - ఎన్‌ఏ) నోటిఫికేషన్‌ వెలువడుతుంది. తరవాత ఫిబ్రవరిలో సివిల్స్‌, అటుపై ఐఈఎస్‌ / ఐఎస్‌ఎస్‌, ఈఎస్‌ఈ తదితర నోటిఫికేషన్లు విడుదలవుతాయి. వివరాలను యూపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి పొందొచ్చు.
 
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోని గ్రూప్‌-బి, గ్రూప్‌-సి, జూనియర్‌ ఇంజనీర్‌, స్టెనోగ్రాఫర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, జియాలజిస్ట్‌ కేడర్‌ ఉద్యోగాలతోపాటు సాయుధ పోలీస్‌ దళాల్లోని వివిధ ఖాళీల భర్తీకి ఈ ఏడాది స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (http://ssc.nic.in/) నుంచి భారీ ఎత్తున నోటిఫికేషన్లు విడుదలవుతాయి.
 
తెలుగు రాష్ర్టాల్లోని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ద్వారా కూడా వివిధ ఉద్యోగాల ప్రకటనలు విడుదల కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు జనవరి 22 నుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా గ్రూప్‌-2, 3 నియామక ప్రక్రియలు పూర్తి చేసే అవకాశం ఉంది. తెలంగాణలో గ్రూప్‌-2తో పాటు గురుకులాలు, రూరల్‌ వాటర్‌ సప్లయి అండ్‌ శానిటేషన్‌, వైద్య ఆరోగ్య, తదితర విభాగాల కోసం చేపట్టిన ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి కావచ్చు.
 
కార్పొరేట్‌ స్థాయికి... లా
దేశంలో అత్యధిక మంది ఎంచుకుంటున్న సంప్రదాయ వృత్తుల్లో.. న్యాయవాద వృత్తి ఒకటి. వాక్చాతుర్యం, సవాళ్లను స్వీకరించే గుణం ఉన్న వారికి సరిపడే వృత్తి ఇది. ప్రపంచీకరణ, అవుట్‌ సోర్సింగ్‌ నేపథ్యంలో ప్రస్తుతం కెరీర్‌ పరంగా ‘లా’ సంప్రదాయ స్థాయి నుంచి కార్పొరేట్‌ స్థాయికి చేరింది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, బ్యాంకులు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో లీగల్‌ అడ్వైజర్‌, డ్రాఫ్ట్‌ రైటర్‌గా అవకాశాలు లభిస్తున్నాయి.
 
ఇటీవల కాలంలో పేటెంట్‌ హక్కుల పర్యవేక్షణ సంస్థలు, కాపీరైట్‌ సంస్థలు, పబ్లిషింగ్‌ సంస్థలు, ఎన్‌జీఓలు కూడా లా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నాయి. బహుళజాతి సంస్థలు లీగల్‌ డిపార్ట్‌మెంట్స్‌లో లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు రూ. లక్షల్లో వార్షిక వేతనం పొందుతున్నారు. క్లాట్‌, ఆయా రాష్ర్టాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా లా కోర్సుల్లో చేరొచ్చు.
 
ఎవర్‌గ్రీన్‌.... టీచింగ్‌
టీచింగ్‌ ఎవర్‌గ్రీన్‌ ప్రొఫెషన్‌. ప్లే స్కూల్‌ నుంచి యూనివర్సిటీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల అవసరం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నియామకాలు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ)కి నోటిఫికేషన్‌ వెలువడుతుంది. తెలంగాణలో ఇప్పటికే టీఆర్‌టీ నోటిఫికేషన్‌ వెలువడింది. రెండు రాష్ర్టాల్లోను యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల నియామక ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీలు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయడం ప్రారంభించాయి. ఈసారి రాత పరీక్ష నిర్వహించడం ఈ నియామకాల్లో విశేషం. తెలంగాణలోని యూనివర్సిటీల్లో వందల సంఖ్యలో ఖాళీలున్నాయి. నియామక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అందువల్ల కొత్త సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో మరిన్ని టీచింగ్‌ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి టెట్‌ / సీటెట్‌, యూజీసీ - నెట్‌ వంటి పరీక్షల్లో అర్హత సాధించి సిద్ధంగా ఉండటం ప్రయోజనకరం.
 
జీవితాన్ని మార్చే స్టార్టప్స్‌
స్టార్టప్‌.. యూత్‌ సర్కిల్స్‌లో లేటెస్ట్‌ బజ్‌. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనేది స్టార్టప్స్‌ విషయంలో నిజమవుతుంది. చదువు, వయసుతో నిమిత్తం లేకుండా కాసింత టెక్నికల్‌ నాలెడ్జ్‌, మేనేజెమెంట్‌ స్కిల్స్‌ ఉంటే చాలు, స్టార్టప్‌ దిశగా వడివడిగా అడుగులు వేయవచ్చు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వినూత్న ఉత్పత్తులను రూపొదించడానికి వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ఏర్పాటు చేసే సంస్థలనే స్టార్టప్‌గా వ్యవహరిస్తారు. రతన్‌ టాటా వంటి ప్రముఖులు సైతం స్టార్టప్‌ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
 
స్టార్టప్‌ను ప్రారంభించాలంటే ఏం కావాలి? ఐడియా (ఆలోచన). ఆలోచనే మనం చేరాల్సిన గమ్యానికి బాటలు వేస్తుంది. అయితే ఆలోచనలు ఏవిధంగా వస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే మన అవసరాలు, జీవితానుభవాలు, చుట్టూ జరుగుతున్న సంఘటనలు, చుట్టూ ఉన్న మనుషులు.... ఇవే ఆలోచనలకు ప్రేరణగా నిలుస్తాయి. వీటిలో ఏదైనా ఒక అంశాన్ని గుర్తించి దాన్ని సాల్వ్‌ చేయడానికి మనం చేసే ప్రయత్నమే స్టార్టప్‌ ఏర్పాటుకు దారి తీస్తుంది.
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఎంఐటీ, కోర్స్‌ఎరా, స్టడీడాట్‌కామ్‌ వంటి సంస్థలు ఆన్‌లైన్‌లో స్టార్టప్‌నకు సంబంధించిన కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి.
 
చార్టర్డ్‌ అకౌంటెన్సీకి ఊపు
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) నిపుణులకు డిమాండ్‌ ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికీకరణ, సేవ, ఉత్పత్తి రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండడంతో సీఏ నిపుణులకూ విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న వయసులోనే సమాజంలో హోదా, గౌరవంతోపాటు మంచి వేతనం అందుకోవచ్చు.
 
సీఏ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇందులో కామన్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (సీపీటీ), ఇంటిగ్రేటెడ్‌ ప్రొఫెషనల్‌ కాంపిటెన్స్‌ కోర్సు (ఐపీసీసీ), ఫైనల్‌ దశలుంటాయి. ఈ కోర్సు మొత్తం పూర్తి చేయడానికి ఇంటర్మీడియెట్‌ తర్వాత కనీసం 4 ఏళ్లు పడుతుంది. సీఏ అభ్యసించాలంటే రిజిరేస్టషన్‌ తప్పనిసరి. ఇంటర్మీడియెట్‌ తర్వాత విద్యార్థి సీపీటీ పరీక్ష రాయాలి. ఏటా జూన్‌, డిసెంబర్‌ల్లో దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
 
సీపీటీ పూర్తి చేసిన విద్యార్థులు 9 నెలల తర్వాత ఐపీసీసీ పరీక్ష రాయాలి. డిగ్రీ, పీజీ అర్హతతో సీపీటీ రాయకుండానే నేరుగా ఐపీసీసీలో ప్రవేశించొచ్చు. ఏటా మే, నవంబర్‌ల్లో ఐపీసీసీ పరీక్షలు నిర్వహిస్తారు. ఐపీసీసీ కోర్సులోని గ్రూప్‌-1 లేదా 2 గ్రూప్స్‌ పూర్తిచేసిన విద్యార్థులు ప్రొఫెషనల్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ వద్ద ఆర్టికల్‌షిప్‌ పూర్తిచేయాలి. ఈ సమయంలో ప్రతి నెల స్టయిపెండ్‌ లభిస్తుంది. ఆర్టికల్‌షిప్‌ పూర్తవడానికి ఆర్నెల్ల ముందు సీఏ ఫైనల్‌ పరీక్ష రాయాలి. సీఏ చేసినవారికి టెలికం, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలతోపాటు విదేశాల్లోనూ అవకాశాలున్నాయి.
 
సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ప్రతిభ, అనుభవం ఆధారంగా అధిక వేతనాలు అందుకోవచ్చు. సీపీటీ పాసైన విద్యార్థి ఐపీసీసీలోని గ్రూప్‌-1 పూర్తిచేసి, ఏడాదిపాటు ఆర్టికల్‌షిప్‌ చేేస్త అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. దాంతో అకౌంటెంట్‌గా చేరి నెలకు కనీసం రూ.30 వేలు సంపాదించొచ్చు. ఉద్యోగం చేస్తూనే 2వ గ్రూపులో ఉత్తీర్ణత సాధించి సీఏ హోదా పొందొచ్చు.
 
లక్షల ఉద్యోగాలకు ‘ఫైనాన్స్‌’
అత్యధిక మంది ఉపాధి కల్పిస్తోన్న రంగాల్లో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ విభాగాలు ముందంజలో ఉంటాయి. వివిధ సర్వేల అంచనా ప్రకారం బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ రంగం 2022 నాటికి 16 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకు వెళుతోంది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్స్‌ విభాగంలోనే 7.8 లక్షల ఉద్యోగాలు ఏర్పడనున్నాయి.
 
మొత్తం నియామకాల్లో సుమారు 73 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే జరగనున్నాయి. ఏటా ఐబీపీఎస్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఇన్సూరెన్స్‌ కంపెనీలు మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, తదితర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది. ఫైనాన్స్‌ రంగంలో స్టాక్‌ మార్కెట్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, క్యాపిటల్‌ మార్కెట్‌, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, తదితర విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.
 
భద్రతకు హామీ... పీఎస్‌యూలు
ప్రభుత్వం రంగ సంస్థలు (పీఎస్‌యూలు) ఆకర్షణీయమైన జీతం, ప్రైవేట్‌ రంగంతో పోల్చితే సుస్థిరమైన కెరీర్‌కు హామీనిస్తాయి. వ్యాపార నిర్వహణ, విస్తరణ వంటి కారణాలతో పీఎస్‌యూలు ఏటా వేలా సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.
 
అప్రెంటిస్‌షిప్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, కెమిస్ట్‌, ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ తదితర ఉద్యోగాలను ఏటా భర్తీ చేస్తాయి. ఈ ఒరవడి ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది. గేట్‌, యూజీసీ-నెట్‌ పరీక్షల్లో సాధించిన స్కోర్‌ ఆధారంగా మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తాయి.
 
కంప్యూటేషనల్‌ బయాలజీ
బయలాజికల్‌ సిస్టమ్‌ను అవగాహన చేసుకోవడానికి వీలుగా బయలాజికల్‌ డేటా సహాయంతో అల్గారిథమ్స్‌, నమూనాలను అభివృద్ధి చేయడమే కంప్యూటేషనల్‌ బయాలజీ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియలో అనలిటికల్‌ మెథడ్స్‌, మ్యాథమెటికల్‌ మోడలింగ్‌, సిమ్యూలేషన్‌ వంటి పద్ధతులు ఉంటాయి. కంప్యూటర్‌ సైన్స్‌, అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌, యానిమేషన్‌, బయోకెమిస్ర్టీ, కెమిస్ర్టీ, బయోఫిజిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీ, జెనెటిక్స్‌, జినోమిక్స్‌, ఎకాలజీ, ఎవల్యూషన్‌, అనాటమీ, న్యూరోసైన్స్‌ వంటి అంశాల ప్రాథమిక భావనలు ఉంటాయి.
 
ఈ శాస్త్రం పరిశోధనలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారు ఈ సబ్జెక్ట్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. ఈ కోర్సు చేసినవారు అకడమిక్స్‌, రీసెర్చ్‌ సైంటిస్ట్‌, కంప్యూటేషనల్‌ బయాలజిస్ట్‌గా స్థిరపడొచ్చు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ఈ కోర్సును ఆఫర్‌ చేస్తుంది.
 
సృజనాత్మకం... మెషీన్‌ లెర్నింగ్‌
మెషిన్‌ లెర్నింగ్‌ అనేది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లోని సబ్‌ ఏరియా. ఎలాంటి ప్రోగ్రామింగ్‌ చేయకుండానే కంప్యూటర్లు స్వీయ అభ్యసన (self-learning) విధానంలోకి మారడానికి మెషీన్‌ లెర్నింగ్‌ వీలు కల్పిస్తుంది. కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ను డెవలప్‌ చేయడంపై మెషీన్‌ లెర్నింగ్‌ దృష్టి సారిస్తుంది.
 
ఈ విభాగంలో ప్రవేశించడానికి మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, ఆపరేషన్స్‌ రీసెర్చ్‌పై అవగాహన ఉండాలి. పైథాన్‌, జావా, బిగ్‌ డేటా, డేటా వ్రాంగ్లింగ్‌ అండ్‌ విజువలైజేషన్‌ వంటి సామర్థ్యాలపై పట్టు తప్పనిసరి. ఐఐటి -బాంబే, కాన్పూర్‌ ఈ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి.