కొత్త సంవత్సరంలో ఫ్రెషప్...గేరప్! JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
కొత్త సంవత్సరంలో ఫ్రెషప్...గేరప్!
ఈ ఏడాది ముగింపునకు వచ్చింది. కొత్త సంవత్సరంలో ఏమి చేస్తే కెరీర్‌ బెటర్‌గా ఉంటుందో చెబుతున్నారు ఇండస్ట్రీ నిపుణులు. రోజూ కనీసం ఏడు గంటల సేపు కంప్యూటర్‌పై పనిచేస్తున్నారు. ట్రాఫిక్‌లో కొట్టుకుంటూ ఇంటికి వెళ్ళడం కూడా పరిపాటిగా మారింది. రొటీన్‌ జీవితం, బోర్‌ కొట్టిస్తోంది. ఈ సమయంలో మార్పు, అంతకు మించి కొత్త ఉత్సాహాన్ని మనస్సు కోరుకుంటోంది. కానీ పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. నిజమే, అందుకు అనుగుణంగా అన్నీ మారాలి కదా అనొచ్చు. ఏవీ మారవు, మనమే అన్నింటినీ మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి.
 
ఈ ఏడాది సాధించిన విజయాలన్నీ ఒక దగ్గర రాయండి. రెజ్యూమెను అప్‌డేట్‌ చేసుకోవాలంటే ఉపకరించే విధంగా ఆ సమాచారం ఉండాలి.
 
ఉద్యోగి అయితే వెంటనే కొత్త బిజినెస్‌ కార్డుకు ఆర్డర్‌ చేయండి. పర్సనల్‌ వెబ్‌సైట్‌ని సరికొత్తగా, పునర్నిర్మించే పని చేపట్టండి. ప్రొఫెషనల్‌ మెటీరియల్‌కు చిత్రిక పట్టడం అన్న మాట.
 
ఈ ఏడాదిలో మీకు పనిలో సహకరించిన మేనేజర్‌, కొలీగ్స్‌, మెంటార్స్‌కు ధన్యవాదాల మెసేజ్‌లు పంపండి. నిజానికి ఇలాంటి వాటికి మెయిల్‌ కంటే సొంత దస్తూరితో రాసిన లేఖలకే విలువ ఎక్కువ. బిజినెస్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఇవాంకా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పర్సనల్‌గా రాసిన లేఖను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.
 
సంతోషాన్ని అంతకు మించి కృతజ్ఞతను వ్యక్తీకరించడంలో ఇదో ఉన్నతమైన చర్య అంటే అతిశయోక్తి కాదు.
 
రెజ్యూమెను ఒకసారి బ్రష్‌ప్‌ చేయండి. ఈ విషయంలో నెట్‌లో శోధిస్తే అనేకానేక టిప్స్‌ కనిపిస్తాయి. అందులో నచ్చినవి ఉపయో గించుకోవచ్చు.
 
రెజ్యూమెలో అత్యాధునిక టెంప్లేట్స్‌ ఉపయోగించుకోండి. 275 వరకు ఉచిత టెంప్లేట్స్‌ ఉన్నాయి. మీ విశ్వాసాని పాదుగొల్పే రీతిలో వాడుకోండి. ఇంతవరకు చేసిన ఒక్కో జాబ్‌కు అనుగుణంగా వేర్వేరు టెంప్లేట్స్‌ను వినియో గించుకోవచ్చు.
 
రెజ్యూమె రాయడం లేదంటే ఉన్నతీకరించడం కొత్త అనుకుంటే, నిపుణుల సలహా తీసుకోండి. అవరోధాలను తొలగించుకుని ముందుకెళ్ళండి.
 
ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చాలావరకు ఊహించవచ్చు. అన్నింటికంటే మించి కొన్ని సాధారణంగా అడిగేవి కొన్ని ఉంటాయి. వాటికి పక్కాగా ముందుగానే ప్రిపేరవ్వండి.
 
మీరు చేయాలని అనుకుంటున్న లేదా చేస్తున్న పరిశ్రమ/ వృత్తికి సంబంధించి అవసరమైన వాటన్నింటినీ కొనుగోలు చేయండి. ఆర్టిస్ట్‌ అయితే పెన్సిల్‌ తదితర సామగ్రి అవసరం. ట్రాన్స్‌లేటర్‌ అయితే మంచి డిక్షనరీ చాలా ముఖ్యం. ఊరంతా తిరిగే జాబ్‌ అయితే సొంత వాహనం ఉండాలి. వాటి కోసం ప్లాన్‌ చేసుకోవడమే కాదు, కొనుగోలు చేసేందుకు సన్నద్ధం కండి.
 
కెరీర్‌ మేనిఫెస్టోను డెస్క్‌ వద్ద అతికించుకోండి.
 
సామాజిక మాద్యమాల్లో జాగ్రత్తగా ఉండండి. రిక్రూటర్‌ చెప్పుల్లోకి కాలు పెట్టడం అంటే మన కామెంట్స్‌, షేర్‌ చేసే వాటి విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజుల్లో రిక్రూటర్లు సామాజిక మాధ్యమాల్లో మన బిహేవియర్‌ను బట్టి ఒక అంచనాకు వస్తున్నారు. నిజానికి ఇది ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్న సరి కొత్త ట్రెండ్‌.
 
ఈ సంవత్సరం నేర్చుకోవాలని అనుకుంటున్న కొత్త నైపుణ్యాన్ని ఎంపిక చేసుకోండి. పబ్లిక్‌ స్పీకింగ్‌ మొదలుకుని క్రియేటివ్‌ రైటింగ్‌ వరకు ఏదైనా కావచ్చు. ఒక పద్ధతిగా నేర్చుకోండి.
 
కెరీర్‌ ఇంప్రూవ్‌మెంట్‌కు ఉపకరించే అతి పాత పుస్తకాలను ఒకసారి తిరగేయండి. స్టీఫెన్‌ కోవే ‘సెవెన్‌ హాబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫెక్టివ్‌ పీపుల్‌’ డేల్‌ కార్నెగీ ‘హౌ టు విన్‌ ఫ్రెండ్స్‌ అండ్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ పీపుల్‌’ వంటివి ఒకసారి మళ్లీ చదవండి.