పక్కా సమాధానమే బెస్ట్‌ JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
పక్కా సమాధానమే బెస్ట్‌
నీ హాబీ ఏమిటి
బుక్‌ రీడింగ్‌
సచిన్‌ ఆత్మ కథ చదివారా
నాకు స్పోర్ట్స్‌ అంటే ఆసక్తి లేదు
దిలీప్‌ కుమార్‌ బయోగ్రఫీ చదివారా
నాకు సినీ నటులపై పెద్దగా అవగాహన లేదు
మరి మీరేమి చదువుతారు
ఫిక్షన్‌
 
హాబీపై ఇంటర్వ్యూ ఇలా సాగితే తప్పులో కాలు పడినట్లే అని భావించాలి. మీ హాబీ ఏమిటి అంటే బుక్‌ రీడింగ్‌ అని రాశారు తప్ప, అందులో స్పెసిఫికేషన్‌ లేదు. ఫలితంగా ఇన్ని ప్రశ్నలు అడగాల్సి వచ్చింది. ఇరవై నుంచి ముప్పయ్‌ నిమిషాలకు మించని ఇంటర్వ్యూలో హాబీ ఒక ప్రశ్న కావచ్చు, కాకపోనూవచ్చు. ఒక వేళ అడగాలనుకున్నా ఇన్ని ప్రశ్నలు అడిగితే తప్ప మీ హాబీ ఏమిటో అర్థంకాని పరిస్థితి నెలకొనడం అంత మంచిది కాదు. మరో కోణంలో చూస్తే, హాబీలో నిర్దుష్టత లేదు. ఫలితమే ఇంత సంభాషణ. ఫిక్షన్‌ నవలలు అంటే ఇష్టం, సమయం ఉంటే ఫిక్షన్‌ నవలలు బాగా చదువుతాను అని చెప్పి ఉంటే బాగుండేది. ఫలానా రైటర్ల నవలలు అంటే ఇష్టం అంటే విషయం సూటిగా ఉంటుంది. ప్రశ్నలు ఆ తీరులోనే అడిగే అవకాశం ఇంటర్వ్యూయర్‌కు కలుగుతుంది. ఆ ఒక్క ప్రశ్న దగ్గరే ఎక్కువ సేపు ఉండిపోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ ప్రశ్న సజావుగా సాగితే, మీలోని మల్టిపుల్‌ టాలెంట్‌ను తెలుసుకునేందుకు వీలుగా మరిన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఇంటర్వ్యూయర్‌కు ఉంటుంది.
 
అబద్దం చెప్పవద్దు
హాబీ విషయంలో అబద్దం చెప్పకూడదు. మీ హాబీ ఏదైతే ఉందో అదే స్పష్టంగా తెలియజేయాలి. ఉదాహరణకు సరైన అవగాహన లేనప్పుడు సినిమాలు చూడటం నా హాబీ అని చెప్పకూడదు. ప్రస్తుత ట్రెండ్‌, ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలు, చలనచిత్ర నిర్మాణంలో వస్తున్న మార్పులు, సంబంధిత ప్రాథమిక అంశాలు ఏమీ తెలియకుండా సింపుల్‌గా సినిమాలు హాబీ అని చెప్పకూడదు. తెలుగు సినిమాలే తీసుకుందాం. విశ్వనాథ్‌ లేదంటే రాజమౌళి సినిమాలపై ప్రశ్న అడిగితే పక్కాగా చెప్పలేని పరిస్థితి నెలకొనవచ్చు. రైటింగ్‌ ఆర్టికల్స్‌ అన్నారనుకోండి. మీ ఆర్టికల్స్‌ ఏ మేగజైన్‌లో ప్రింట్‌ అయ్యాయి అని అడగవచ్చు. అప్పుడు నీళ్ళు నమిలితే ప్రయోజనం ఉండదు. అబద్దం చెప్పారన్న విషయం అర్థమవుతుంది. దాంతో తప్పుడు అభిప్రాయం కలుగుతుంది. ఒక్కోసారి మీ నిజాయితీ ప్రశ్నార్థకం అవుతుంది. టీవీ వీక్షణ, క్రికెట్‌ ఆడటం, ఫొటోగ్రఫీకి కూడా ఇదే వర్తిస్తుంది. నిజం చెప్పాలంటే సీరియ్‌సగా మీ హాబీ ఏమిటో అదే చెప్పాలి. హాబీ అంటే మీ ఇష్టాన్ని బైటపెట్టడం. మీ మక్కువలోని గాఢతను వ్యక్తం చేయడం. అంతే తప్ప నోటికి వచ్చింది లేదంటే అప్పటికి మీ మనసుకు తట్టింది తెలియజేయడం కాదు.
 
మీ మనస్తత్వం తెలుస్తుంది
చెస్‌ ఆడటం నుంచి పుస్తకాలు చదవడం వరకు ఏదైనా కావచ్చు, అది మీ మనస్తత్వాన్ని పట్టి ఇస్తుంది. కాన్సంట్రేషన్‌ అంటే మీ తదేక దృష్టిపై ఒక అంచనాకు వచ్చేందుకు వీలుకల్పిస్తుంది. పుస్తకాలు చదవడం ఏమంత చిన్న విషయం కాదు. అది మీ రీడింగ్‌ హాబిట్‌ను తెలియజేస్తుంది. అంటే పనిలో భాగంగానూ సంబంధిత లిటరేచర్‌ అధ్యయనానికి మీరేమాత్రం వెనుకడుగు వేయరని చెబుతుంది. చెస్‌ అంటే ఎత్తులు పైఎత్తులతో గెలుపు. ఒక వ్యూహకర్తకు ఉండాల్సిన లక్షణాలను ప్రోదిచేసుకున్నట్టు లెక్క. సరిగ్గా జాగ్రత్తగా విశ్లేషిస్తే ప్రతి హాబీ వ్యక్తులకు ఏదో ఒకటి మప్పుతుంది. అది వృత్తినైపుణ్య పెంపునకు దోహదపడుతుంది. రిక్రూటర్‌ అంచనావేసుకోవడాన్ని బట్టి యావత్తు వ్యవహారం ఉంటుంది.
 
సులువు
నేను బాగా చదువుతాను అని చెప్పడం కంటే చిన్న కథలు/ కవితలు/ బ్లాగ్‌లో రాస్తాను అని చెబితే మంచిదన్నది ఒక ఇంటర్వ్యూయర్‌ అభిప్రాయం. అది కూడా నిజమైతేనే సుమా! పలు ఇంటర్వ్యూ టీముల్లో పాల్గొన్న ఒక రిక్రూటర్‌ అభిప్రాయం ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రశ్నకు మనస్ఫూర్తిగా జవాబు చెప్పిన వారు చాలా తక్కువ అన్నారు. నేరుగా అడగ్గానే, అభ్యర్థులు తమలో తాము ఎంతో స్ర్కూటినీ చేసుకుంటూ ఉంటారని తెలిపారు. తమ హాబీని చక్కగా వ్యక్తం చేసిన వ్యక్తులు తనకు తక్కువ మంది తారసపడ్డారని వెల్లడించారు. తెచ్చిపెట్టుకున్నట్టుగానే సమాధానం ఉండేదన్నారు. నిజానికి హాబీ ఏమిటో చెప్పగానే ఇంటర్వ్యూ చేస్తున్న బృందంలో దానిపై అవగాహన ఉన్న వారుంటే ప్రశ్నిస్తారని, తద్వారా అభ్యర్థికి ఆ రంగంలో ఉన్న అనురక్తి, గాఢతను అంచనా వేస్తారని వివరించారు. పైపెచ్చు సినిమాలు చూస్తాను అని చెప్పడం తనవరకు గొప్ప సమాధానం కాదన్నారు. అది ఎక్కువ మంది చేసే సాధారణ పనుల్లో ఒకటన్నారు. నిజంగా అలవాటు ఉంటే పుస్తకాలు చదువుతాను అని చెప్పడం మంచిది, అందులో అభ్యర్థి సృజనాత్మకతను తెలుసుకునే వీలు ఉంటుందని తెలిపారు.
మొత్తానికి హాబీని తెలియజేయడంలో నిజాయతీ అంతకు మించి దానిపై ఏ ప్రశ్న అడిగినా ఎంతో కొంత వాస్తవికతతో కలిపి సమాధానం ఇవ్వడంలోనే ఈ ప్రశ్న నుంచి అభ్యర్థులు చాలా హాయిగా గట్టెక్కవచ్చని చెప్పవచ్చు.