నిలబెట్టేవి నైపుణ్యాలే... JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
నిలబెట్టేవి నైపుణ్యాలే...
ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడే లింక్డిన్‌ కంటే యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో విద్యార్థులు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో చదువు పూర్తయినా ఉద్యోగం సాధించడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. వీబాక్స్‌ ఇండియా స్కిల్‌ రిపోర్ట్‌ - 2018 పేర్కొన్న నిజాలివి. విద్యార్థుల్లో కొరవడుతున్న నైపుణ్యాలు, దేశంలో కొత్తగా వచ్చే అవకాశాలు, వాటికి అవసరమైన సామర్థ్యాలను ఈ నివేదిక వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలపై విశ్లేషణ...
 
దేశ వ్యాప్తంగా ఐదు వేల విద్యా సంస్థలు, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఐసీటీఈ), యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ), అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌, కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ర్టీస్‌ (సీఐఐ), పీపుల్‌ స్ర్టాంగ్‌, పియర్సన్‌ ఎడ్యుకేషన్‌ వంటి సంస్థల సహకారంతో నిర్వహించిన సర్వే ఆధారంగా వీబాక్స్‌ ఇండియా స్కిల్‌ రిపోర్ట్‌ను రూపొందించింది. నైపుణ్యాలే ఉద్యోగ సాధనలో కీలకమనే విషయాన్ని ఈ నివేదిక స్పష్టం చేసింది.
 
ఇంటర్న్‌షిప్స్‌
ఒక కోర్సు చదివేటప్పుడు థియరీ నాలెడ్జ్‌ ఎంత ముఖ్యమో, ప్రాక్టికల్‌ పరిజ్ఞానం కూడా అంతే కీలకం. ఇందుకు ఇంటర్న్‌షిప్స్‌ ప్రధానపాత్ర పోషిస్తాయి. కానీ విద్యార్థులు ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇండియా స్కిల్‌ రిపోర్ట్‌ ప్రకారం 63 శాతం మంది మాత్రమే ఇంటర్న్‌షిప్స్‌ను ఎంచుకున్నారు. వారిలో కూడా 86 శాతం మంది ఇంటర్న్‌షిప్స్‌ను ఉద్యోగ సాధనకు ఉపయోగించలేదు. అంటే కేవలం ఇంటర్న్‌షిప్స్‌ మాత్రమే చేశారు, వాటి ప్రాధాన్యాన్ని గుర్తించలేదు. క్షేత్ర స్థాయి నైపుణ్యాలను స్వల్ప కాలంలో పెంచుకోవడానికి ఇంటర్న్‌షిప్స్‌ అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రంగానికి సంబంధించిన కార్యకలాపాలు, సమస్యలు, చూపుతున్న పరిష్కారాలను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మేనేజ్‌మెంట్‌ విద్యార్థి బ్యాంకింగ్‌ రంగంలో ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా ఆ రంగంలోని పరిస్థితులపై ఒక అవగాహన ఏర్పడుతుంది.
 
నెట్‌వర్కింగ్‌
స్కిల్‌ ఇండియా నివేదిక ప్రస్తావించిన మరో అంశం నెట్‌వర్కింగ్‌. వివిధ సందర్భాల్లో ఏర్పడిన పరిచయాలను 86 శాతం మంది విద్యార్థులు తర్వాత కాలంలో కొనసాగించడం లేదు. అంటే నెట్‌వర్కింగ్‌ ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. వాస్తవానికి ఉద్యోగాన్వేషణలో కీలక సాధనం నెట్‌వర్క్‌. అంటే మనకుండే పరిచయాలు. ఈ పరిచయాలను ఉద్యోగాన్వేషణలో ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. నెట్‌వర్కింగ్‌ అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ముందుగా తల్లిదండ్రులు, వారి స్నేహితులు, ఆ తరవాత కాలేజీలో మీ స్నేహితులు, సీనియర్లు, లెక్చరర్లు, అలూమ్ని... ఇవన్నీ విలువైన వనరులు. వీటన్నింటిని ఉద్యోగాన్వేషణలో సమర్థంగా వినియోగించుకోవాలి. వీరందరితో మీ అర్హతలు, నైపుణ్యాల గురించి చర్చించాలి. తద్వారా ఉద్యోగ అవకాశం లభించవచ్చు.
 
రెజ్యూమె
కాలేజీ నుంచి డిగ్రీతో బయటకు రాగానే ఎన్నో ఉద్యోగావకాశాలు ఆహ్వానిస్తుంటాయి. ఉద్యోగ ప్రకటనల్లో పేర్కొన్న అర్హతలు, నైపుణ్యాలతోపాటు బాధ్యతలకు సంబంధించి కొన్ని కీ వర్డ్స్‌ ఉంటాయి. వాటిని నిశితంగా పరిశీలించాలి. వాటిలో కొన్ని మన ప్రొఫైల్‌కు మ్యాచ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటివాటిని గుర్తించి ఉద్యోగ ప్రకటనకు అనుగుణంగా రెజ్యూమెను సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు ప్రకటనలో.. ఉద్యోగిగా ఎంపికైన వ్యక్తి ఆన్‌ టైమ్‌ ఆన్‌ బడ్జెట్‌లో విధులు నిర్వహించాలి అని ఉంటుంది. ఇందుకు కాలేజ్‌లో చేసిన ప్రాజెక్ట్‌ లేదా క్లబ్‌ అధ్యక్షుడిగా, ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా నిర్వహించిన బాధ్యతలను ఉదాహరణగా తీసుకోవాలి. దాన్ని గణంకాల రూపంలో వివరిస్తే ప్రభావవంతంగా ఉంటుంది. ఇలాంటి వాటి ద్వారా మీ నాయకత్వ లక్షణాలు కూడా తెలుస్తాయి.
రెజ్యూమెను సిద్ధం చేసుకునేటప్పుడు స్పెల్లింగ్‌, గ్రామర్‌, ఫార్మాటింగ్‌ ఎర్రర్స్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చదవడానికి సౌకర్యవంతంగా, ఆకర్షణీయమైన నమూనా (టెంప్లేట్‌)లో అర్ధవంతమైన పదాలతో, చూడగానే ఆకట్టుకునే విధంగా రెజ్యూమెను రూపొందించుకోవాలి.
 
సెమినార్స్‌.. లెక్చర్స్‌
క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు చక్కని మార్గాలు సెమినార్స్‌, వర్క్‌షాప్స్‌, పరిశ్రమల సందర్శన, స్టార్టప్‌ ఈవెంట్స్‌. ఇండియా స్కిల్‌ రిపోర్ట్‌ ప్రకారం 78 శాతం మంచి విద్యార్థులు వీటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రియల్‌ టైం ఎక్స్‌పోజర్‌, ప్రాక్టికల్‌ అవేర్‌నెస్‌ పెంచే ఇలాంటి ఈవెంట్స్‌ చదువుతో సమాంతరంగా ముఖ్యమని భావించాలి.
 
ఆన్‌లైన్‌లో చురుగ్గా
స్కిల్‌ ఇండియా నివేదిక ప్రకారం విద్యార్థులు ఆన్‌లైన్‌లో చురుగ్గా ఉంటున్నారు. 92 శాతం మంది ఫేస్‌బుక్‌, 62 శాతం మంది యూట్యూబ్‌ను తరచుగా వీక్షిస్తుంటారు. రిక్రూటర్లు ప్రామాణికంగా తీసుకునే ప్రొఫెషనల్‌ ఆన్‌లైన్‌ సోర్స్‌ లింక్డన్‌ను మాత్రం 26 శాతం మందే ఫాలో అవుతున్నారు. 62 శాతం ఉద్యోగాల కోసం జాబ్‌ లిస్టింగ్‌ వెబ్‌సైట్స్‌ను చూసున్నారు. ప్రస్తుతం నియామక ప్రక్రియ డిజిటల్‌ మోడ్‌లోకి మారిపోయింది. ఆన్‌లైన్‌లో చురుగ్గా ఉండటం తప్పనిసరి. కానీ దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో గమనంలోకి తీసుకోవడం మంచిది.
ఒక వారధిగా
రిక్రూటర్లు ఆన్‌లైన్‌ ప్రొఫైల్స్‌ ద్వారా తమకు కావల్సిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు సంబంధించిన పూర్తి వివరాలు.. అంటే అర్హతలు, నైపుణ్యాలు, సాధించిన విజయాలు, అనుభవం వంటి అంశాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అయితే రిక్రూటర్లు రెజ్యూమెతోపాటు అదనపు సమాచారం కోసం ఆన్‌లైన్‌ / సోషల్‌ మీడియాలో మీ రెప్యూటేషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
అనవసర విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు. ఆయా మాధ్యమాలను వేదికగా చేసుకొని వ్యవహరించే తీరును బట్టి మన వ్యక్తిత్వంపై ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. అందువల్ల ఆన్‌లైన్‌ యాక్టివిటీని మన కెరీర్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఒక వారధిగా ఉపయోగించుకోవాలి.
జాబ్‌ / ఇండస్ర్టీకి సంబంధించిన కీ వర్డ్స్‌ ప్రొఫైల్‌ హెడ్డింగ్‌లో ఉండాలి. సంబంధిత రంగంలోని లేటెస్ట్‌ న్యూస్‌, అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తూ ఉండాలి. తద్వారా ఆ రంగంపై మీకున్న నాలెడ్జ్‌, ఆసక్తి రిక్రూటర్లకు అర్థమవుతుంది. ఇండస్ర్టీ నిపుణులు, ప్రొఫెషనల్స్‌తో ఇంటారాక్ట్‌ అవుతూ ఉండాలి. తద్వారా రిక్రూటర్లు ఒక నిర్ణయానికి రావడానికి కావల్సిన రైట్‌ రిఫరెన్స్‌ లభించినట్లవుతుంది.