సైన్స్‌ చదివే అమ్మాయిలూ..అందుకోండి అందలం JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
సైన్స్‌ చదివే అమ్మాయిలూ..అందుకోండి అందలం
దేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం. కానీ మన దేశంలో విద్య, పరిశోధన రంగాల్లో మహిళల భాగస్వామ్యం నామమాత్రంగానే నమోదవుతుంది. దీన్ని అధిగమించి జెండర్‌ బ్యాలెన్స్‌ (లింగ సమానత్వం) సాధించే దిశగా చర్యలు మొదలయ్యాయి. ఐఐటీల్లో ప్రత్యేక కోటా, ఎంట్రెన్స్‌ టెస్ట్‌లు, ఉద్యోగ నియామక పరీక్షల్లో ఫీజు మినహాయింపు వంటి ఎన్నో చర్యల ద్వారా మహిళలను ప్రోత్సహిస్తున్నారు. శాస్త్ర పరిశోధనల్లో కూడా మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ) ఎన్నో కార్యక్రమాలను ప్రారంభించింది. ఆకర్షణీయమైన ఫెలోషిప్‌ స్కీమ్‌లను అందిస్తోంది. వీటి వివరాలు తెలుసుకుందాం...
 
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థినులు, మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కేంద్రం అనేక ఫెలోషిప్‌లు, సైంటిస్ట్‌ స్కీమ్‌లను అందిస్తోంది. ఉన్నత స్థాయి కోర్సులు, పరిశోధనలు చేయడానికి, ప్రత్యేకంగా రిసెర్చ్‌ ప్రాజెక్ట్‌లు నిర్వహించడానికి ఈ స్కీమ్‌లు ఉపయోగపడతాయి.
 
ఫెలోషిప్‌ల రకాలు
ఒక అంచనా మేరకు దేశంలో 1.93 లక్షల పరిశోధకుల్లో మహిళల సంఖ్య 27,532 మాత్రమే. ఈ సమస్యను అధిగమించి మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు నాలెడ్జ్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఇన్‌ రీసెర్చ్‌ అడ్వాన్స్‌మెంట్‌ థ్రూ నర్చరింగ్‌ (కిరణ్‌) ద్వారా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌ (డబ్ల్యూఓఎస్‌)ను నిర్వహిస్తుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల్లో పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు సామాజికంగా ఎదురవుతున్న సమస్యలకు టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపే ప్రాజెక్ట్‌లు దీని ద్వారా చేపడతారు. డబ్ల్యూఓఎస్‌లో భాగంగా మూడు రకాల కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అవి..
ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌-ఎ (డబ్ల్యూఓఎస్‌-ఎ): బేసిక్‌ / అప్లయిడ్‌ సైన్స్‌లో పరిశోధనకు ఉద్దేశించింది.
ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌-బి (డబ్ల్యూఓఎస్‌-బి): సామజిక సమస్యలకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోని ఆవిష్కరణల ఆధారంగా పరిష్కారం చూపే ప్రాజక్ట్‌లకు ప్రాధాన్యం ఇస్తుంది.
ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌-సి (డబ్ల్యూఓఎస్‌-సి): స్వయం ఉపాధి దిశగా ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ (ఐపీఆర్‌ఎస్‌)లో శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించింది.
 
వెబ్‌సైట్‌: http://www.dst.gov.in/
 
డబ్ల్యూఓఎస్‌ స్ఫూర్తిగా
వర్క్‌ ఫోర్స్‌లో మహిళలది ప్రధాన భూమిక. ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో. చాలా మంది మహిళలు వివిధ రకాల కారణాలతో శాస్త్ర పరిశోధనల వైపు దృష్టి సారించడం లేదు. కుటుంబ బాధ్యతలతో కెరీర్‌కు మధ్యలోనే పుల్‌స్టాప్‌ పెడుతున్నారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించి మహిళలను ప్రోత్సహించడానికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌ (డబ్ల్యూఓఎస్‌)ను 2002-03లో ప్రారంభించింది. కెరీర్‌లో బ్రేక్‌ వచ్చినప్పటికీ.. పరిశోధనల వైపు ఆసక్తిగా ఉండి తిరిగి కెరీర్‌ ప్రారంభించాలనుకునే 27-57 మధ్య వయసులోని మహిళ శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్ట్‌లకు ఆ దిశగా వారిలో స్ఫూర్తి నింపడం, అందుకు అవసరమైన ఉపాధి అవకాశాలు, ఆర్థికపరమైన సహాయం (ఫెలోషిప్‌, గ్రాంట్స్‌ రూపంలో) వసతులు, సౌకర్యాలు కల్పించడమే డబ్ల్యూఓఎస్‌ ప్రధాన ఉద్దేశం.
 
మొబిలిటీ స్కీమ్‌
కిరణ్‌ ద్వారా ప్రారంభించిన మరో కార్యక్రమం మొబి లిటీ స్కీమ్‌. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో రెగ్యులర్‌ విధానంలో పని చేస్తున్న మహిళలకు వారు కోరుకున్న చోట పని చేసే (రీలొకేషన్‌) అవకాశం కల్పిస్తారు. వివాహం, కుటుంబ బాధ్యతలు తదితర కారణాలతో వేరే ప్రదేశానికి బదిలీ కావాలనుకునే వారికి ఈ స్కీమ్‌ ద్వారా అవకాశం కల్పిస్తారు. తద్వారా పూర్తిగా పరిశోధనలపై దృష్టి నిలిపే అవకాశాన్ని ఇస్తున్నారు.
 
ప్రయోజనాలు
ఈ కార్యక్రమాల ద్వారా ఎంపికైన ప్రాజెక్ట్‌ ప్రపోజల్‌కు మూడేళ్లపాటు నిధులను మంజూరు చేస్తారు. దీని ప్రకారం నెల వారీ ఫెలోషిప్‌, చిన్న చిన్న పరికరాల కొనుగోలుకు, వివిధ సెమినార్స్‌, ప్రాజెక్ట్స్‌కు హాజరయ్యేందుకు అయ్యే ఖర్చు, తదితర అవసరాలకు కావల్సిన మొత్తాన్ని చెల్లిస్తారు.
 
ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌ - ఎ
బేసిక్‌ / అప్లయిడ్‌ సైన్సెస్‌కు సంబంధించిన సైన్స్‌, ఇంజనీరింగ్‌ విభాగాల్లో పరిశోధనల దిశగా మహిళా శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్ట్‌లను ప్రోత్సహించడానికి ఈ స్కీమ్‌ ప్రారంభించారు. మేథో వలసను నిరోధించడంతోపాటు మహిళలు ఈ రంగంలో రాణించడానికి చేయూత ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో ఐదు విభాగాల విద్యార్థులకు సహాయం అందిస్తారు. అవి.. ఫిజికల్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఎర్త్‌ అండ్‌ అట్మోస్ఫెరిక్‌ సైన్సెస్‌, ఇంజనీరింగ్‌ టెక్నాలజీ.
ఫెలోషిప్‌ వ్యవధి: మూడేళ్లు
ఫెలోషిప్‌ / గ్రాంట్స్‌ ఇచ్చే విధానం: అర్హతలను బట్టి ఫెలోషిప్‌ / ప్రాజెక్ట్‌కు నిధులను ఇవ్వడంలో తేడాలు ఉంటాయి. పీహెచ్‌డీ / తత్సమాన అర్హత ఉన్న వారికి నెలకు రూ. 55 వేలు (ప్రాజెక్ట్‌కు రూ. 30 లక్షలు), ఎంఫిల్‌/ ఎంటెక్‌ / తత్సమాన అర్హత ఉన్న వారికి నెలకు రూ. 40 వేలు (ప్రాజెక్ట్‌కు రూ. 25 లక్షలు), ఎంఎస్సీ / తత్సమాన అర్హత ఉన్న వారికి నెలకు రూ. 30 వేల (ప్రాజెక్ట్‌కు రూ. 20 లక్షలు) ఫెలోషిప్‌ ఇస్తారు.
వయసు: 27-57 ఏళ్లు. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు గడువు: ఈ స్కీమ్‌ కోసం ఎటువంటి గడువు లేదు. ఏడాది మొత్తం దరఖాస్తులను స్వీకరిస్తారు. డీఎస్‌టీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 
ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌ - బి
సమాజానికి మేలు చేసే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రాజెక్ట్‌లకు ఈ కార్యక్రమం ద్వారా ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం సామాజికంగా క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు టెక్నాలజీ ద్వారా పరిష్కరం చూపే విధంగా ఈ ప్రాజెక్ట్‌ల రూపకల్పన ఉండాలి. ఇందుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళా శాస్త్రవేత్తలు సంబంధిత ప్రాజెక్ట్‌లను సొంతంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌ నేపథ్యం, దాన్ని రూపొందించే ప్రణాళిక, అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయం, లక్షిత వర్గాలు, సాంకేతిక వినియోగం తదితర అంశాల విషయంలో స్పష్టమైన అభిప్రాయాలతో కూడిన ప్రపోజల్‌ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి పంపించాలి. ఆదాయం వచ్చే అవకాశం, సమాజంలోని క్షేత్ర సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్‌లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. డీఎస్‌టీ నియమించే నిపుణుల కమిటీ ప్రాజెక్ట్‌ను ఎంపిక చేస్తుంది.
ప్రాజెక్ట్‌ వ్యవధి (ఫెలోషిప్‌ / ఆర్థిక సహాయం): మూడేళ్లు
ఫెలోషిప్‌ / గ్రాంట్స్‌ ఇచ్చే విధానం: అర్హతలను బట్టి ఫెలోషిప్‌ / ప్రాజెక్ట్‌కు నిధులను ఇవ్వడంలో తేడాలు ఉంటాయి. పీహెచ్‌డీ / తత్సమాన అర్హత ఉన్న వారికి నెలకు రూ. 55 వేలు (ప్రాజెక్ట్‌కు రూ. 30 లక్షలు), ఎంఫిల్‌ / ఎంటెక్‌ / తత్సమాన అర్హత ఉన్న వారికి నెలకు రూ. 40 వేలు (ప్రాజెక్ట్‌కు రూ. 25 లక్షలు), ఎంఎస్సీ / తత్సమాన అర్హత ఉన్న వారికి నెలకు రూ. 30 వేల (ప్రాజెక్ట్‌కు రూ. 20 లక్షలు) ఫెలోషిప్‌ ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో రీసెర్చ్‌ ప్రపోజల్‌ను అప్‌లోడ్‌ చేయాలి. ప్రాజెక్ట్‌ ప్రపోజల్‌ రెండు హార్డ్‌ కాపీలను డీఎస్‌టీకి పంపించాలి.
వయసు: 27-57 ఏళ్ల మధ్యలో ఉండాలి.
 
ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌ - సి
ఈ స్కీమ్‌ను పేటెంట్‌ ఫెసిలిటేటింగ్‌ సెంటర్‌ - టెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ కౌన్సిల్‌ (టీఐఎఫ్‌ఏసీ) అమలు చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా సైన్స్‌ / ఇంజనీరింగ్‌ / మెడిసిన్‌ / సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌ / మాస్టర్స్‌ కోర్సులు చేసిన వారికి ఇంటలెక్చువకల్‌ ప్రాపర్టీ రైట్స్‌ (మేథోసంపత్తి హక్కులు), వాటి మేనేజ్‌మెంట్‌లో ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. దేశంలో మేథో సంపత్తి హక్కుల పరిరక్షణ, నిర్వహణ వంటి అంశాల్లో నిష్ణాతులైన మహిళా శాస్త్రవేత్తల సంఖ్యను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
వయసు: 27-45 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అర్హత: ఇంజనీరింగ్‌ / టెక్నాలజీలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా సైన్సెస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, కంప్యూటరైజ్డ్‌ డేటా బేస్‌ను సేకరించడం, విశ్లేషించడం, నివేదికలు రూపొందించడంలో పరిజ్ఞానం ఉండాలి.
ఫెలోషిప్‌: ఏడాదిపాటు ఇస్తారు.
ఫెలోషిప్‌ మొత్తం: అర్హతలను బట్టి ఫెలోషిప్‌లో తేడాలు ఉంటాయి. పీహెచ్‌డీ / తత్సమాన అర్హత ఉన్న వారికి నెలకు ఫెలోషిప్‌ రూ. 30 వేలు (ప్రాజెక్ట్‌కు రూ. 30 లక్షలు). ఎంఫిల్‌ / ఎంటెక్‌ / ఎంఫార్మసీ / తత్సమాన అర్హత ఉన్న వారికి రూ. 25 వేలు, ఎంఎస్సీ (బేసిక్‌ సైన్సెస్‌) / ఎంబీబీఎస్‌ / బీటెక్‌ / తత్సమాన అర్హత ఉంటే రూ. 20 వేలు ఇస్తారు.
దరఖాస్తు: ఏటా ఫిబ్రవరిలో ఉంటుంది.