పింక్‌ స్లిప్‌ కాదు.. బౌన్సర్‌ స్లిప్‌! JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
పింక్‌ స్లిప్‌ కాదు.. బౌన్సర్‌ స్లిప్‌!
ఐటీ ఉద్యోగుల రాజీనామాకు కంపెనీల కొత్త అస్త్రం..
వెరిజాన్‌లో 250-300 మందితో రాజీనామాలు
ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ గదిలోకి పిలుపు
అక్కడే అధికారులు, సైకియాట్రిస్ట్‌, బౌన్సర్లు
రాజీనామా చేయాలంటూ తీవ్ర వత్తిడి
బలవంతంగా సంతకాలు తీసుకుంటున్న వైనం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అదో ప్రముఖ ఐటీ కంపెనీ! ఆ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజరు గది! అందులో హెచ్‌ఆర్‌ మేనేజర్‌, కంపెనీ సీఈవో, ఓ సైకియాట్రిస్ట్‌, మరో బౌన్సర్‌ కూర్చున్నారు! కంపెనీలో ఎంపిక చేసిన ఉద్యోగులను ఒక్కొక్కరిని పిలిపిస్తున్నారు. రాజీనామా చేయాలని హెచ్‌ఆర్‌ చెబుతున్నారు. సైకియాట్రిస్ట్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. రాజీనామా చేసేది లేదని ఉద్యోగి ఎదురు తిరిగితే బౌన్సర్‌ రంగంలోకి దిగుతున్నాడు. ఉద్యోగి లేచి వెళ్లబోతే భుజాలు గట్టిగా అదిమి పట్టుకుని కూర్చోబెడుతున్నాడు. రాజీనామా చేసే వరకూ అక్కడి నుంచి కదలనివ్వడం లేదు.
 
కేవలం రెండు రోజుల్లోనే ఇలా ఏకంగా 250-300 మంది నుంచి రాజీనామాలు తీసుకున్నారు. నగరంలోని వెరిజాన్‌ ఐటీ కంపెనీ ఉద్యోగులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపిన వివరాలివి. ఏళ్ల తరబడి పని చేసిన ఉద్యోగులను అత్యంత అమానవీయంగా సాగనంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామాలు కోరడం కంటే కూడా ఆ సమయంలో ఉద్యోగుల పట్ల కంపెనీ నిర్వాహకులు వ్యవహరించిన తీరు తమను మరింత జుగుప్సకు గురి చేసిందని తెలిపారు. ఒకే ఐటీ కంపెనీలో రెండు రోజుల్లోనే ఏకంగా 250-300 మందితో రాజీనామా చేయించడం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజీనామా చేయడం ఇష్టం లేక బయటకు వస్తున్న వారి విషయంలో బౌన్సర్లను రంగంలోకి దింపారని, బలవంతంగా భుజాలపై చేయి వేసి, భౌతికంగా దాడి చేసి రాజీనామా కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ వ్యవహరించిన తీరు తమను తీవ్రంగా బాధించిందని, బయటకు చెప్పుకోలేకపోతున్నామని వాపోయారు.
 
మంగళవారం రోజువారీగా ఉద్యోగానికి వెళ్లిన తనను హెచ్‌ఆర్‌ విభాగం అధికారులు పిలిచారని, తన వద్ద ఉన్న మొబైల్‌ను ముందుగానే తీసేసుకున్నారని, లోపలికి వెళ్లిన తర్వాత బలవంతంగా రాజీనామా చేయించారని ఓ ఉద్యోగి తన అనుభవాన్ని వివరించాడు. అలాగే, బుధవారం కూడా ఇలాగే మరి కొంతమందితో రాజీనామా చేయించారని తెలిపాడు. అలాగే, ఈ సమయంలో ఉద్యోగులు మానసిక వేదనతో అనారోగ్యానికి గురవుతారనే ఉద్దేశంతో అంబులెన్సులను, డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచారని తెలిపారు. కాగా ఈ విషయమై వెరిజాన్‌ ఐటీ కంపెనీకి చెందిన హెచ్‌ఆర్‌ వర్గాలను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నిజానికి, దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యిమంది ఉద్యోగుల నుంచి ఈ కంపెనీ రాజీనామాలు చేయిస్తోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఉద్యోగులను సాగనంపుతోంది. చెన్నైలో కూడా కంపెనీ అమానవీయంగా ఉద్యోగులను బయటకు పంపుతోందనే కథనాలు వస్తున్నాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఏకంగా కేబిన్లలో ఉన్న ఉద్యోగులను సెక్యూరిటీ సహాయంతో కేబిన్ల నుంచే బయటకు పంపుతున్నారని అంటున్నారు.
 
ఇంత దారుణమా!?
ఐటీ ఉద్యోగులంటేనే ఎంతో సున్నితంగా తమ పని తాము చేసుకుపోయేవారు. అలాంటి వారిని బలవంతంగా రాజీనామా చేయాలని చెప్పడంతోపాటు చేయకపోతే బౌన్సర్లతో దాడి చేయించి బలవంతంగా సంతకాలు తీసుకోవడం దారుణం. కంపెనీలకు ఉద్యోగులను తొలగించే హక్కు ఉన్నా అది పద్ధతి ప్రకారం నిబంధనలకు లోబడి ఉంటుంది. వెరిజాన్‌ కంపెనీ నుంచి తొలగించిన ఉద్యోగులు మమ్మల్ని కలిసి జరిగిన ఘటనను వివరించారు. దీనిపై లేబర్‌ కమిషన్‌ను పోలీసులను సంప్రదిస్తాం.
-కిరణ్‌ చంద్ర, ఫోరం ఆఫ్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ సభ్యుడు
 
తలచుకుంటేనే తట్టుకోలేకపోతున్నా
‘మూడేళ్లుగా వెరిజాన్‌లో పని చేస్తున్నా. ఉద్యోగంలోంచి తొలగిస్తున్న తీరు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా. ఎంతో ప్రశాంతంగా పని చేసుకునే మాకు ఈ పరిస్థితి ఏమిటి భుజాల మీద చేతులు వేసిన బౌన్సర్లు బలవంతంగా రాజీనామా కాగితాలపై సంతకాలు చేయించారు.
తొలగింపునకు గురైన ఐటీ ఉద్యోగి